22/06/2026
పెద్దతుంబలంలోని బీసీ హాస్టల్ పునఃప్రారంభించాలి
పెద్దతుంబలంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిన బీసీ హాస్టల్ పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆశ్రయంగా నిలిచింది. సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ ఉండి తమ విద్యను కొనసాగించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
అయితే గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే ఈ హాస్టల్ మూతపడింది. దీంతో ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు వసతి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.
విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు. విద్యార్థులకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అందువల్ల పెద్దతుంబలం బీసీ హాస్టల్‌ను వెంటనే పునఃప్రారంభించి, మళ్లీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకుర