24/07/2026
గౌటెంగ్‌లోని New Life Centre for Girlsలో ఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన సేవా కార్యక్రమం
“Gifting Smiles, Celebrating KTR @ 50”
BRS NRI South Africa Community Outreach Initiative
జోహన్నెస్‌బర్గ్, గౌటెంగ్ | 23 జూలై 2026
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో నిర్వహించిన “Gifting Smiles, Celebrating KTR @ 50” కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా గౌటెంగ్ రాష్ట్రంలోని New Life Centre for Girls, President Park, Midrand లో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో, అరవింద్ ప్రసాద్ చీకోటి నాయకత్వంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలికలకు అవసరమైన బియ్యం, కిరాణా సరుకులు, ఆహార పదార్థాలు, పరిశుభ్రత సామగ్రి, ఇతర నిత్యావసర వస్తువులు అందజేయడంతో పాటు, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెచ్చని దుప్పట్లు పంపిణీ చేశారు. బాలికలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి అవసరాలను తెలుసుకుని, వారితో కలిసి కేటీఆర్ జన్మదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల మాట్లాడుతూ,
“కేటీఆర్ గారి 50వ జన్మదినాన్ని సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ప్రజాసేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించాం. ప్రస్తుతం కొనసాగుతున్న చలికాలంలో చిన్నారులకు వెచ్చని దుప్పట్లు, నిత్యావసర వస్తువులు అందించడం ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు తీసుకురాగలిగాం. అదే కేటీఆర్ గారికి మేము అందించే నిజమైన జన్మదిన కానుక.” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగరాజు గుర్రాల, అరవింద్ ప్రసాద్ చీకోటి, నరేందర్ రెడ్డి, సాయి కిరణ్ నల్లా, రవీందర్ రెడ్డి, కిరణ్ కుమార్ బెల్లి, వూరె వంశీ, లక్ష్మణ్ రెడ్డి, విక్రమ్ పెట్లూరు తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, యువత సాధికారత మరియు సామాజిక సేవా కార్యక్రమాలను ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ సమాజానికి సేవ చేయడానికి కట్టుబడి ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.