12/07/2024
న్యూజెర్సీ పరిసర ప్రాంతాల్లోని మితృలందరికీ మా తెలుగుపీపుల్ ఫౌండేషన్ హృదయపూర్వక ఆహ్వానం! ఫౌండేషన్ పదహారవ వార్షికోత్సవం ఈ ఏడాది డిసెంబర్ 14 శనివారం సాయంత్రం హైట్స్ టౌన్ హైస్కూలులో నిర్వహిస్తున్నాము. ఎంతోమంది దాతలు, స్పాన్సర్లు, వలంటీర్లు, శ్రేయోభిలాషుల సహకారంతో ఫౌండేషన్ ఎందరో విద్యార్థులకు సహాయం అందిస్తోంది. అటు ఇండియాలో, ఇటు అమెరికాలో కాలేజీ విద్యార్థులకు సహకారం అందిస్తోంది. మా ఈ ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి హాజరై మేము చేస్తున్న కార్యక్రమాల గురించి, మా విద్యార్థుల విజయాల గురించి, వారి జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి తెలుసుకొని మీరూ మీకు చేతనైన సహాయం అందిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ పోస్టును షేర్ చేసి మీ మితృలందరికీ తెలియజేయాల్సిందిగా మనవి.
Google Maps Location Address:
https://maps.app.goo.gl/1E9E9PuHh1bcCCQi6?g_st=ic