06/03/2024
Prateechi Naimisham : Vaiyyaasi Lessons 2017 Dr. Sarada Purna
నిరంతర భగవధ్యానం ' ఉపాసన' అని తాత్త్వికుల మాట.
నిరంతరం అనగానే ఏకాగ్రత అని స్పష్టం అవుతుంది .
ఉపాసనలొ అత్యంత అవసరమైనది ' చిత్తైకాగ్రత' . .
చిత్తం అనగానే వస్తు దృష్టి ని అధిగమించాలి అని తెలుస్తుంది .
అంటే కాకి మీదో కాకరకాయ మీదో కాక మన లోపలకి దృష్టి సారించాలి.
లోపల అంటే ? ఏముంది లోపల ? ఎక్కడుంది ? ఎప్పుడు ఉంటుందా ?
కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది గమనించాలి .
ఉచ్చ్వాస నిశ్వాసాల ప్రవాహాన్ని గమనించాలి.
అంటే శ్వాస మీద ధ్యాస !
కొంత సేపటికి ఉహలు బందీ లవుతాయి .
ఆలోచనలు నెమ్మదిస్తాయి .
ఈ ప్రయత్నం వలన పల్చనయ్యేది ఉపాధి . భావం . భౌతికత . ఆ గట్టు దాటుతాం !
ఉపాధి పోగా ఉపహితాంశం ' జీవుడు' నేను అని మనం నుకుంటున్న ' నేను'
ఎల్లవేళలా ఉపాధి లేకుండా ఉపహిత మయ్యేది ' బ్రహ్మం' . అనుపహితాంశం అన్నమాట .
తాత్కాలిక ఉపాసనలొ సిద్ధించే ' నేను అనే ఆత్మ దర్శనం' ఈ ప్రయత్నానికి ఆరంభం .
సంప్రదాయ ప్రవణుల ప్రకారం ఇక్కడ కావలసినది ' ఆచర్యోపదేశం ' గురూ పదేశం'
మనమున్న కాలానుగుణ నిర్ణయం మాత్రం ' శిక్షణ' , 'క్రమశిక్షణ !
మనసు సంస్కారం పొందేది గురు సేవ వలన . భక్తి వలన ! ప్రపత్తి వలన ! అర్పణ వలన !
పైన చెప్పినవన్నీ మెట్లు ! ఒక్కొక్కటిగా అవేమిటో తెలిసి అధిగమించాలి .
బ్రాహ్మ భావన తెలియటం, బ్రాహ్మని పొందటం మోక్షంగా గ్రహించాలి .
ఉపాసన అంటే ' అనుష్ఠానం ' ' ఏకాగ్ర చిత్త వృత్తి ' , తన లోని స్మృతి సంతతి జ్ఞాన విశేషం ' భక్తీ' , 'దర్శన సమాకారం ' ' బ్రహ్మ భావనా మనస్కత ' , ఇలా ఎన్నెన్నో అర్ధాలు చెబుతుంది తాత్త్విక శబ్ద నిఘంటువు .
లాక్షణికులు ఉపాసన అనగానే ' సమీపం లో ఉండటం' అని ప్రవచిస్తారు .
మనసును కేంద్రీకరించటమే ప్రధానం .
ఆ కేంద్ర బిందువు ఒక విశేష మైన శక్తికి ,
ఒక విశిష్ట అనుభూతికి , ప్రత్యేక శక్తి ఉద్భవానికి ద్వారం .
ఉపాసన ద్వారా మనసుని దృష్టిని లక్ష్యంమీద కేంద్రీకరింప వచ్చు .
మనసు స్వచ్చం గా ఉంటుంది . మనో సంయమనం సిద్ధిస్తుంది .
అవిచ్చన్నం గా చేసే తదేక చింతన ఉపాసన .