Padala Charitable Trust - PCT

Padala Charitable Trust - PCT Encourage • Educate • Empower – Transforming lives through health, scholarships & life-skills in rural India

03/09/2026

Plan A మీ కల… Plan B మీ భద్రత!

జీవితంలో ఒక లక్ష్యం ఉండటం ఎంత ముఖ్యమో, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం.

డాక్టర్ కావాలన్నా… ఇంజినీర్ కావాలన్నా… IAS లేదా Police Officer కావాలన్నా — మీ Plan A మీ కలను చూపిస్తుంది. కానీ పరిస్థితులు మారినప్పుడు అదే లక్ష్యం వైపు ముందుకు సాగేందుకు Plan B మీకు ధైర్యాన్ని ఇస్తుంది.

Plan B అంటే ఓటమి కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ ప్రయాణాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లే తెలివైన ప్రణాళిక.

ప్రతి విద్యార్థి తన కలతో పాటు, ఆ కలను చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఆలోచించాలి.

కలలు కనండి. ప్రణాళిక వేసుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నా ముందుకు సాగండి.

We would like to bring to your kind attention a serious concern regarding the collection of additional fees from student...
01/09/2026

We would like to bring to your kind attention a serious concern regarding the collection of additional fees from students by certain private colleges, as highlighted in the recent newspaper report.

As reported, some colleges are allegedly collecting amounts beyond the prescribed fee, placing an additional financial burden on students and their families. There are also concerns that students may hesitate to raise complaints due to fear of consequences.

We kindly request the concerned authorities to look into this matter and verify whether such practices are taking place. If any violations are found, we request that appropriate action be taken to ensure that colleges follow the prescribed fee regulations and that students are protected from unnecessary financial pressure.

We sincerely hope the authorities will consider this matter and take the necessary steps in the interest of students and their families.

30/08/2026

పిల్లలను ప్రతి ప్రమాదం నుంచి కాపాడటం మాత్రమే కాదు…
ప్రమాదాలను ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేయడం మన బాధ్యత.

పిల్లలకు సరైన సమయంలో అవగాహన కల్పిస్తే, ఎన్నో సమస్యలను ముందుగానే నివారించవచ్చు.
POCSO, JJ Act వంటి చట్టాలు ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటాయి. కానీ అవగాహన ఘటన జరగకముందే రక్షణ కల్పిస్తుంది.

పిల్లలకే కాదు… వారితో పనిచేసే ప్రతి పెద్దవారికీ అవగాహన అవసరం.

సరైన అవగాహన • సరైన సమయంలో • ప్రతి ఒక్కరికీ
మన పిల్లల భద్రత కోసం మనమంతా కలిసి ముందడుగు వేద్దాం

*Please click here to watch the full video*
https://www.youtube.com/watch?v=jkGrzbdZOsQ

*Please visit PCT's channel for all the works and impact*
https://www.youtube.com/

29/08/2026

కెరీర్ అంటే డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వడం మాత్రమే కాదు!

ప్రతి విద్యార్థికి తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ, ఆసక్తి, నైపుణ్యం ఉంటుంది. అందరూ ఎంచుకుంటున్నారనే కారణంతో కాకుండా, మన ప్రతిభకు సరిపోయే కెరీర్‌ను ఎంచుకోవడమే నిజమైన విజయం.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:

🔹 నాకు ఏం చేయడం ఇష్టం?
🔹 నేను ఏ విషయాలను బాగా నేర్చుకోగలను?
🔹 భవిష్యత్తులో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను?
🔹 నా నైపుణ్యాలకు సరిపోయే అవకాశాలు ఏవి?

SETHU Career Guidance ద్వారా విద్యార్థులకు స్ట్రీమ్స్ & కోర్సులు, ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ & ప్రైవేట్ అవకాశాలు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ మరియు కెరీర్ ప్లానింగ్‌పై సరైన మార్గదర్శకత్వం అందిస్తున్నాం.

సరైన మార్గదర్శకత్వం + సరైన కృషి = ఉజ్వల భవిష్యత్తు

మీ భవిష్యత్తును ఈరోజే ప్లాన్ చేసుకోండి.
ఎందుకంటే కలలు కనడం మొదటి అడుగు… వాటిని సాకారం చేసుకోవడం తదుపరి అడుగు!

#విద్యార్థులు #కెరీర్‌గైడెన్స్ #విద్య

28/08/2026

ఉన్నతి కుటుంబానికి గర్వకారణమైన విజయం!

ఒంగోలు లో లైబ్రరీ నుంచి నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU), గుజరాత్ వరకు — సత్యాల అంజనా ప్రయాణం - పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి ఒక గొప్ప ఉదాహరణ.

ఉన్నతి స్కాలర్‌షిప్ లబ్ధిదారైన అంజనా, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో L.L.B. పూర్తి చేసి NFSUలో ప్రవేశం సాధించింది. ఈ ఏడాది దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల నుంచి ప్రవేశం పొందిన ఏకైక అమ్మాయిగా ఆమె ప్రత్యేక ఘనత సాధించింది. 🎓

ప్రతిరోజూ దాదాపు 8 గంటలు లైబ్రరీలో క్రమం తప్పకుండా చదువుకోవడం, అలాగే ఉన్నతి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా అందిన Monitering, Career guidance, Social & Emotional Learning (SEL) సెషన్స్ ఆమె ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయి.

ఆమె కల కేవలం ఒక డిగ్రీతో ఆగిపోదు. భవిష్యత్తులో జడ్జిగా మారి, పేదలు మరియు మధ్యతరగతి ప్రజలకు న్యాయం మరింత అందుబాటులోకి తీసుకురావాలనేది అంజనా లక్ష్యం.

అంజనా విజయ ప్రయాణంలో భాగమైనందుకు పదాల చారిటబుల్ ట్రస్ట్ గర్విస్తోంది. ఆమె భవిష్యత్ ప్రయాణం మరిన్ని విజయాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ❤️

కలలు కనండి. పట్టుదలతో ముందుకు సాగండి. విజయాన్ని సాధించండి. స్ఫూర్తిగా నిలవండి.

27/08/2026

మెగా PTM | పిల్లల భద్రతపై అవగాహన

మల్లం ZPHS మరియు కందరాడ ZPHS పాఠశాలల్లో నిర్వహించిన మెగా PTM సమావేశాల్లో, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు Personal Safety Education & POCSO Actపై అవగాహన కల్పించడం జరిగింది.

Safe Touch & Unsafe Touch, ఇబ్బందికర పరిస్థితుల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలి, నమ్మకమైన పెద్దలతో సమస్యలను ఎలా పంచుకోవాలి వంటి ముఖ్యమైన అంశాలను విద్యార్థులకు సులభంగా వివరించాము.

అలాగే, పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించడం, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడటం, తమ సమస్యలను భయపడకుండా పంచుకునేలా ప్రోత్సహించడం వంటి విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాము.


25/08/2026

Padala Charitable Trust (PCT) – Quarter 1 Board of Trustees Meeting | FY 2026–27

Padala Charitable Trust (PCT) ఆధ్వర్యంలో FY 2026–27కు సంబంధించిన Quarter 1 Board of Trustees Meeting విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో Trustees మరియు Leadership Team పాల్గొని, గత త్రైమాసికంలో సంస్థ సాధించిన పురోగతిని సమీక్షించి, రాబోయే కాలానికి సంబంధించిన Strategic Roadmapపై చర్చించారు.

సమావేశంలో Program Implementation, Financial Performance, Policy Enhancements, Infrastructure Development, Employee Welfare Initiatives, Digital Transformation మరియు Strategic Growth వంటి సంస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను సమీక్షించారు.

Key highlights

✅ Review of Quarter 1 progress against the Annual Operating Plan
✅ Strengthening governance through policy and process improvements
✅ Successful recruitment for the Tata Trusts Comprehensive School Improvement Program
✅ Review of financial sustainability, donor engagement, and leadership development initiatives
✅ Program updates and strategic recommendations to enhance quality, innovation, and long-term impact

Team PCT యొక్క అంకితభావం మరియు సమిష్టి కృషిని Board అభినందించింది. సంస్థ లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తూ, సమాజంపై మరింత విస్తృతమైన మరియు సుస్థిరమైన Impactను తీసుకురావడానికి అవసరమైన Strategic Guidance అందించేందుకు Board తన నిబద్ధతను స్పష్టం చేసింది.

PCTలో బలమైన పాలన అనేది కేవలం పర్యవేక్షణ మాత్రమే కాదు — ప్రతి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లే బలమైన పునాది.

పిల్లలు, యువత మరియు సమాజాల జీవితాల్లో అర్థవంతమైన మార్పును తీసుకురావాలనే లక్ష్యంతో PCT తన ప్రయాణాన్ని మరింత బలంగా కొనసాగిస్తోంది.

24/08/2026

𝐓𝐡𝐞 𝐉𝐨𝐮𝐫𝐧𝐞𝐲 𝐨𝐟 𝐒𝐮𝐫𝐲𝐚 𝐏𝐫𝐚𝐬𝐚𝐝 𝐏𝐚𝐝𝐚𝐥𝐚 — 𝐅𝐫𝐨𝐦 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐭𝐨 𝐁𝐨𝐚𝐫𝐝 𝐌𝐞𝐦𝐛𝐞𝐫.

34 సంవత్సరాల క్రితం North South Foundation నా జీవితాన్ని మార్చింది.

1990లో, మా కుటుంబం ఇంజనీరింగ్ విద్యను కొనసాగించే స్థోమత లేని సమయంలో NSF నాకు scholarship ద్వారా అండగా నిలిచింది. ఆ సహాయం నాకు విద్యతో పాటు అవకాశాలను, ఆత్మవిశ్వాసాన్ని, కొత్త ప్రపంచాన్ని అందించింది.

ఆ సహాయం పొందిన నేను 2002లో Padala Charitable Trustను ప్రారంభించి, **“నాకు లభించినదాన్ని మరొకరికి అందించాలి”** అనే నమ్మకంతో ముందుకు సాగాను.

Hyderabadలో జరిగిన NSF India’s Vidya Deepam కార్యక్రమంలో PCT alumni Navya Nissi, Sravya Blessi తమ ప్రయాణాన్ని పంచుకున్నారు. PCT ద్వారా సహాయం పొందిన వారు, ఈ రోజు తమ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు.

అప్పుడు నేను సభలో ఒక ముఖ్యమైన మాట చెప్పాను:

**“These are NOT NSF beneficiaries. These are beneficiaries of a beneficiary of NSF.”**

ఇదే **Paying It Forward** యొక్క అసలైన శక్తి.

ఒక scholarship ఒక జీవితాన్ని మార్చగలదు. ఆ ఒక్క జీవితం ద్వారా వందలాది, వేలాది జీవితాలు మారవచ్చు.

**From beneficiary → to paying it forward → to serving on the Board.**

21/08/2026

Padala Charitable Trust ఆధ్వర్యంలో Z.P.H.S. కొండెవరం మరియు Z.P.H.S. భోగాపురం పాఠశాలల్లో వారధి కార్యక్రమం నిర్వహించాము.

ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు పాల్గొని, వారి విద్య, ఆరోగ్యం మరియు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై అవగాహన పొందారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు వారధి కార్యక్రమం లక్ష్యాలను వివరించడంతో పాటు, విద్యార్థులకు దుస్తులు, షూస్ మరియు స్టేషనరీ కిట్స్ అందించాము.

ప్రతి విద్యార్థి చదువులో ముందుకు సాగాలి, ఆరోగ్యంగా ఎదగాలి, తన కలలను సాకారం చేసుకోవాలి — ఇదే Padala Charitable Trust లక్ష్యం. ❤️

Address

House No. 1-344, Rajeev Nagar 2, Rayudupalem, Ramanayyapeta
Yeleswaram
533005

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Padala Charitable Trust - PCT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share