Susruta Foundation For Health, culture and education

Susruta Foundation For Health, culture and education those who are below the poverty line will get consultation free

25/12/2025

Osmania medical college❤️

23/12/2025

పాతికేళ్ల క్రితం ఎంతో అమాయకంగా వేదికపై పాడిన పాట
నేడు మళ్లీ అదేరోజు
అదే వేదిక
అదే పాట
కాకపోతే
నాడు
అమాయక వైద్య విద్యార్థులం
నేడు
అందరం ఎంతో పరిపక్వత కలిగిన వైద్యులం
ఏదేమైనా
జ్ఞాపకాలు పదిలం
సంతోషాలు అనంతం
జీవితం ధన్యం
A song once sung with innocent hearts on this very stage twenty-five years ago
is being sung again today—
on the same day,
on the same stage,
the same melody.

Yet there is a difference.

Then, we were naïve medical students,
standing at the threshold of our dreams.
Today, we return as seasoned and accomplished physicians,
shaped by time, experience, and responsibility.

Nevertheless, memories remain intact,
joy knows no bounds,
and life, in every sense, feels truly blessed.

22/12/2025

Balancing both man😁😁😉

పాలకుడు ప్రజల కోసం పని చేసే వ్యక్తి అయినప్పుడు పాలన సజావుగా సాగుతుంది  తూర్పుతండ దశాబ్దంన్నర తర్వాత ఉదయాన్ని ఇలా నూతన నా...
14/12/2025

పాలకుడు ప్రజల కోసం పని చేసే వ్యక్తి అయినప్పుడు పాలన సజావుగా సాగుతుంది
తూర్పుతండ దశాబ్దంన్నర తర్వాత ఉదయాన్ని ఇలా నూతన నాయకుడితో పంచుకోవడం మనతో పాటు మా యువత
మా గ్రామ ప్రజల సంతోషకర పరిణామం
ఊర్లో కలివిడిగా ఈరోజు తిరుగుతుంటే అందరితో మమేకం అయి మాట్లాడుతుంటే
వారి మాటల్లో ఉత్సాహం
కళ్లలో సంతోషం కళ్లారా చూసాము
ఆనందించాము
ఆదివారం కదా పుట్టిన ఊరును సందర్శించాలని వచ్చాను

చిన్న గమనిక

నా ఒక్క ఓటుతో మార్పు వస్తుందా?అని అనుకుని
పుట్టినఊరుని వదిలి వెళ్ళిపోయేవారు
మీ ఓటుని పనికిరాని ప్రదేశంలో నమోదు చేసుకోకండి
కనీసం ఓటు వేయడానికి వచ్చి మీ ఊరి ప్రజలకు నూతన యువ పాలకులను అందిచే అవకాశంను వదులుకున్నట్లే
పుట్టిన ఊరికి అన్యాయం చేసినట్లే
అయినవాళ్ళను కలుస్తాం
వారిని కొందరు ఇబ్బందులపాలు చేస్తుంటారు
మీ ఓటు మీ ఊర్లో ఉండడం వల్ల అలా భయపెట్టే నాయకులకు భయం ఉంటుంది
ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు
మనవాళ్ళను మనం కాపాడుకున్నవాళ్ళం అవుతాం
మన అనుకున్న నాయకుణ్ణి మనమే ఎన్నుకునే అవకాశం ఉంటుంది
ఎక్కడో ఓటు వేసి
నా గ్రామం లో నాయకుడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని ఊకదంపుడు మాటలు మాట్లాడే అవసరం లేకుండా ఉంటుంది
గ్రామ అభివృద్ధిలో మనం భాగస్వాములం అవుతాం

మీ
డా ।। రవీందర్ చౌకీదార్

10/12/2025


09/12/2025






పాతికేళ్ల జ్ఞాపకం ఉస్మానినా మెడికల్ కాలేజ్ memories,the vibrant days of college,and the bliss that still enchants my hea...
29/11/2025

పాతికేళ్ల జ్ఞాపకం
ఉస్మానినా మెడికల్ కాలేజ్

memories,
the vibrant days of college,
and the bliss that still enchants my heart.
Love you, Osmania — for all the glory and grace you have bestowed upon my life

మరచలేని జ్ఞాపకాలు…
కళాశాల రోజుల ఆ ఉల్లాసం…
ఇప్పటికీ మనసును మైమరపించే ఆనంద క్షణాలు.
నా జీవితానికి ఎనలేని ఆనందాన్ని అమోఘమైన జీవిత మార్గాన్ని అందించిన ఉస్మానియాను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను.

12/11/2025

🎬 “Watch movies as movies.
Real life will never be like the reel life.
Know the realities and move forward.
Your parents and family always want the best for you.
If you think taking off your clothes is freedom,
remember — if your parents had followed the same path,
you wouldn’t even exist today.”

– With care and concern,
Dr. Ravinder Chowkidar

🎥 “సినిమాని సినిమాలాగే చూడండి.
నిజజీవితం సినిమాలా ఎన్నటికీ ఉండదు.
వాస్తవాలను తెలుసుకొని ముందుకు సాగండి.
మీ తల్లిదండ్రులు, కుటుంబం ఎల్లప్పుడూ మీ మేలే కోరుకుంటారు.
వేసుకునే బట్టలను విప్పేస్తే స్వతంత్రం అనుకుంటే,
గుర్తుంచుకోండి —
మీ తల్లిదండ్రులు కూడా అలా ఆలోచించి ఉంటే,
ఈరోజు మీరు ఉండేవారు కాదు.”

– మీ మేలు కోరే,
డా. రవీందర్ చౌకీదార్

09/11/2025
01/11/2025

ఈ అవ్వ
గత పదిహేను సంవత్సరాలుగా
మెడ భాగంలో కణతి తో ఇబ్బందులు పడి
ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి
ప్రాణభయంతో సర్జరీ చేయించుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ కాలం గడిపింది
హైదరాబాద్ లో అన్ని పేరున్న పెద్ద ఆసుపత్రులను చుట్టేసింది
పైగా ఖర్చు తక్కువలో తక్కువ 5 నుండి 6 లక్షల రూపాయలు అవుతాయని చెప్పారట వాళ్లకు
అటు తిరిగి ఇటు తిరిగి అనుకోకుండా మా ఆసుపత్రికి వచ్చారు
బయట బోర్డు చూసారు
వాళ్లను వీళ్ళను కనుక్కున్నారు
అయినా నమ్మకం కుదరలేదు
ఈ dr ఏంటి బయట ఫౌండేషన్ పేరు పెట్టుకున్నాడు
సేవ గీవ అని బాగానే పేరు వినిపిస్తాంది ఒక్కసారి తేల్చుకుందాం ఈ ఆపరేషన్ చేస్తాడా చేయడా అని లోపలికి వచ్చిన్లు
ఏదైతే ఏంది అనుకుంటూ
చూసాను
అన్ని క్లినికల్ ఎక్సమినేషన్ చేశాను
నా ఛాంబర్ లో కూసోబెట్టి ఓ అరగంట సేపు వారితో సరదాగా మాట్లాడాను
ఆపరేషన్ కి సిద్ధం చేశాను
దాదాపు వారనుకున్న దానికన్నా తక్కువ ఖర్చుతో సర్జరీ చేశాము
ఆ కణతి గుండెనుండి మెదడుకి వెళ్ళే రక్తనాళాలకు బలంగా అంటుకుని ఉంది
ఏ మాత్రం తేడా కొట్టినా డా ।। రవీందర్ చౌకీదార్ మూటముల్లె సర్దుకోవాలి అన్ని ఆలోచించాను
కానీ నాకు ఓ ఛాలెంజ్ అనిపించింది
ఇంతపెద్ద కేసు మానుకోట జిల్లాలో మనం తప్ప ఇంకెవ్వరూ ధైర్యం చేయలేరు అని నిరూపించాలి
నా సనాతన సుశ్రుత ఫౌండేషన్ పేరుని నిలబెట్టుకోవాలి అని సంకల్పించాము
రోగి తరపున బంధువులు కొద్దిల అనుమానంగా ఉన్నాకాని నాపై నమ్మకం పెట్టుకొని ముందుకు వచ్చారు
సర్జరీ చేశాను
దాదాపు ఒకకిలోన్నర బరువు ఉన్న కణతిని తొలగించడం జరిగింది
పేషెంట్ మంచిగా రికవర్ అయ్యారు
ఇంటికి పంపించాను
సర్జరీ జరిగి ఐదునెలలు అయింది
ఎదో పనిమీద ఈరోజు మానుకోటకు వచ్చారట ఇద్దరు దంపతులు
నన్ను కలిసి చూసిపోదాం అని నాదగ్గరికి వచ్చారు
సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నాం
దేవుడు నిన్ను సల్లంగా చూడాలే బిడ్డ అని దీవించి వెళ్ళిపోయింది అమ్మ

సర్వేజనా సుఖినోభవంతు

మీ
మేలుకోరే
డా ।। రవీందర్ చౌకీదార్

Address

5-54/4, Thurputhanda , Enugal, Parwathagiri
Warangal
506369

Telephone

9052572848

Website

Alerts

Be the first to know and let us send you an email when Susruta Foundation For Health, culture and education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share