Anurag Helping Society

Directions Contact the organization

Anurag Helping Society Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anurag Helping Society, Community Organization, Warangal.

ఉచిత వైద్య శిబిరాలు వృద్ధులకు ఆరోగ్యాన్నే కాక  మనో ధైర్యాన్ని అందిస్తాయి- డాక్టర్ అనితా రెడ్డివృద్ధుల వారోత్సవాలను పురస్...
25/09/2026

ఉచిత వైద్య శిబిరాలు వృద్ధులకు ఆరోగ్యాన్నే కాక మనో ధైర్యాన్ని అందిస్తాయి- డాక్టర్ అనితా రెడ్డి

వృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకుని స్త్రీ శిశు సంక్షేమం, వృద్ధుల మరియు దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు కే. యు పక్కన గల లార్డ్ వృద్ధ ఆశ్రమములో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ ,అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కడిపికొండ డాక్టర్లు విచ్చేసి ఉచిత వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు, ఉచితముగా మందులు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు వృద్ధులకు ఆరోగ్యాన్నే కాక చాలా మనోధైర్యము అందిస్తాయని ఎవరు లేని ఆశ్రమములోని వృద్ధులకు తమ ఆరోగ్యం గురించి పట్టించుకునే వారు ఉన్నారన్న ఆనందం సంతృప్తి వారి కళ్ళలో కనిపించిందని అన్నారు, ప్రతి ఒక్కరూ వృద్ధుల పట్ల బాద్యతతో ప్రేమ గౌరవం చూపించాలని, ఏ ఇబ్బంది కలిగినా ట్రిబ్యునల్ కోర్టును సంప్రదించవచ్చని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, వృద్ధాప్యము ఎవరికి శాపంగా మారకూడదని అన్నారు, వృద్ధులకు అన్ని రకాలుగా అందరూ అండగా నిలబడటమే నిజమైన వృద్ధుల వారోత్సవాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, లార్డ్ వృద్ధ ఆశ్రమ నిర్వహకులు నాగరాని నరేష్, డాక్టర్లు బానోతు సంతోష్, కంటి డాక్టర్ ప్రతాపగిరి ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రావు, సమ్మి రెడ్డి, ఏ న్ ఎం సబితా రాణి, సరోజ, ఆశ వర్కర్ మరియ, మమత తదితరులు పాల్గొన్నారు

ఒకరి  చిరునవ్వుకి మనం కారణం కాకపొయిన పర్వాలేదు కానీ  ఒకరి  కన్నీటికీ మాత్రం మనం కారణం కాకూడదు,అద్దం చూసుకుంటే మనకు మనమే ...
25/09/2026

ఒకరి చిరునవ్వుకి మనం కారణం కాకపొయిన పర్వాలేదు కానీ ఒకరి కన్నీటికీ మాత్రం మనం కారణం కాకూడదు,అద్దం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం అదే అర్థం చేసుకుంటే ప్రతీ మనిషిలోను మనమే కని పిస్తాం జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగటం గొప్పకాదు . పదిమంది బాధను తీర్చి పైకి రావడమే గొప్ప మనం ఆనందంగా ఉండటం అంటే ఆస్తులు ధనం ఉండటం కాదు మనల్ని ప్రతి రోజూ గుర్తు పెట్టుకొన ఆప్యాయంగా పలకరించే మనషులు ఉండటం .

శుభ మధ్యాహన్నం అందరికి🙏

*శుభోదయం *గురువు నేర్పేది పాఠం, బ్రతుకు నేర్పేది అనుభవ పాఠం. శత్రువులు నేర్పేది గుణపాఠం, మనం అన్ని చూచి  మనకి అవసరం ఉన్న...
24/09/2026

*శుభోదయం *

గురువు నేర్పేది పాఠం, బ్రతుకు నేర్పేది అనుభవ పాఠం. శత్రువులు నేర్పేది గుణపాఠం, మనం అన్ని చూచి మనకి అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చు కోవాలి, అవసరం కోసం నటించడం మొదలు పెడితె జీవితాంతం నటిస్తూనే బతకాల్సి ఉంటుంది మన వెనుక మన గురించి చెడుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మన వెనుకే , మనం డబ్బును ఎవరి కోసమైన కొంత ఖర్చు చేయొచ్చు కానీ మన సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి !! అది ఎవరైనా ఎంత దగ్గరైన బంధం కలిగిన వారైన సరే!!

డాక్టర్ అనితా రెడ్డి కి  శ్రీ గణేష్ ఎక్స్ లెన్సి అవార్డు - 2025మనం ఫౌండేషన్ మరియు గ్లోబల్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ ...
23/09/2026

డాక్టర్ అనితా రెడ్డి కి శ్రీ గణేష్ ఎక్స్ లెన్సి అవార్డు - 2025

మనం ఫౌండేషన్ మరియు గ్లోబల్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ & కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ వారు డాక్టర్ అనితా రెడ్డి చేస్తున్న సమాజ సేవ మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు గుర్తించి శ్రీ గణేష్ ఎక్స్ లెనెస్సి అవార్డు, సర్టిఫికేట్ అందించారు, మట్టి వినాయకులను పెట్టాలని ప్రోత్సాహించడం, మట్టి వినాయకులను ఉచితముగా అందించడం, గణేష్ నవరాత్రులలో ప్లాస్టిక్ నివారణ, డిజే నివారణ మరియు పర్యావరణ వ్యవస్థ కు హని తలపెట్టేవి ఏవి ఉపయోగించ వద్దని అవగాహన కార్యక్రమాలు చేపట్టడం,ఆరోగ్య కరమైన సమాజానికి ,యువత సన్మార్గమార్పు కు డాక్టర్ అనితా రెడ్డి అందిస్తున్న సేవలను గుర్తించి సంస్థ పౌండర్ చైర్మన్ అడ్వకేట్ డాక్టర్ చక్రవర్తి అవార్డు కు ఎంపిక చేసినట్లు తెలిపారు పర్యావరణ పరిరక్షణ కు చెట్లు పెంచడం, చెట్లు నరుకుటను అరికట్టడం లో డాక్టర్ అనితా రెడ్డి పిల్లలను యువతను పెద్దలను, తీర్చిదిద్దుతున్న తీరు అవగాహన కార్యక్రమాలు చాలా స్పూర్తి గా ఉన్నాయని అన్నారు
గణేష్ నవరాత్రులలో పర్యావరణ హితం కోరే కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డు ఇస్తామని అన్నారు పర్యావరణాన్ని కాపాడడం, అంటే మనల్ని మనం కాపాడుకో వడమే ఏ కాక భావితరాలకు మంచి పర్యావరణ జీవనాన్ని బహుమతిగా ఇవ్వడం అని,ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా పాటు పడాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు

నాకు  కోపం ఎక్కువే... చచ్చేంత వరకు ఉంటుంది  కాని అది అవతలి వారు హద్దు దాటితే వారి మాట హద్దు దాటితే మాత్రమే యుద్ధం... నాక...
23/09/2026

నాకు కోపం ఎక్కువే... చచ్చేంత వరకు ఉంటుంది కాని అది అవతలి వారు హద్దు దాటితే వారి మాట హద్దు దాటితే మాత్రమే యుద్ధం... నాకు దైర్యం ఎక్కువే సమయానికి ఎక్కడవాడాలో అక్కడ వాడుతా, నాకు దయ ఎక్కువే కాని అపాత్ర దానం చేయను ఒకరి మెప్పు కోసం అసలే చేయను అవసరార్దులకు మాత్రమే చేస్తా, నాకు ప్రేమ కూడా ఎక్కువే ఇది మాత్రమే ఎప్పుడు వాడుతూ ఉంటాను అందరికి, నన్ను అర్ధం చేసు కోవడం చాల కష్టం అంటారు కొందరు కాని నేను ఎవరినైన ఇష్టపడితే మద్యలో వదిలిపెట్టను...అది ప్రేమ అయినా స్నేహమైన, బందుత్వం అయినా ....నాది అనుకుంటే ఏది చేయడానికైనా సిద్ధమే..., నా మరణం, నా జీవితం దైవం నిర్ణయించిన ప్రకారం నడుస్తుంది కాని చని పోయిన తరువాత కూడా మనల్ని పది మంది మంచిగా గుర్తు చేసుకునేలా ఉండాలన్నది నా కోరిక , ఆశ ఉంటే సరి పోదుగా దానికి తగ్గ పనులు, మాటతీరు, వ్యక్తిత్వం మనదై ఉండాలి!!!! అదే ప్రయత్నం లో ఉంటానేను...
శుభ మధ్యాహ్నము 🙂

జీవితంలో  మనం  ముందుకు  ఎదగాలి  అంటే  ఒదిగి  ఉండటం నేర్చుకోవాలి  గెలవాలి  అంటే ఓటమి  ఒప్పుకోవడం  నేర్చుకోవాలి సర్దుబాటు ...
22/09/2026

జీవితంలో మనం ముందుకు ఎదగాలి అంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి గెలవాలి అంటే ఓటమి ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు !

జీవితంలో మనం సుఖంగా ఉండాలి అంటే మూడే మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి . ఒకటి జరిగిన దాన్ని మర్చిపోవాలి రెండు జరుగుతున్న దాన్ని గమనించుకోవాలి, మూడు జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి

మనషులలో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది , అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది .

శుభోధయం🙏

If you are  Talented In Correction Of Punctuation You will Become Master Of Knowledge, If You are Talented in Understand...
21/09/2026

If you are Talented In Correction Of Punctuation You will Become Master Of Knowledge, If You are Talented in Understand the Content You Will become Master of Humanity With Kind Heart, If you are Master of Knowledge You will Surprise the Minds, If you are Master Of Humanity You Occupy the Others Mind and Heart, This is Called Difference between...!!!
Always Life is So...Beautiful , Showing and Making Difference is in Our Hands... Enjoy the Life as You Like...Try to Share your Love and Happiness to Others if possible...

అన్ని సవ్వంగా  ఉన్నప్పుడు ధైర్యంగా  ఉండటం గొప్ప  కాదు ఎన్ని  సమస్యలు  నిన్ను  చుట్టు ముట్టినా ఆ...ధైర్యాన్ని  కోల్పోకుండ...
19/09/2026

అన్ని సవ్వంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండటం గొప్ప కాదు ఎన్ని సమస్యలు నిన్ను చుట్టు ముట్టినా ఆ...ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటమే గోప్ప విషయం జీవితంలో ఏది మనకు ఎదురు వచ్చి ఇవ్వదు మనమే ఎదురు వెళ్లి తీసుకోవాలి , మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు మన జీవితం గురించి ఇతరులకు చెప్ప కూడదు ,ఇతరుల జీవితాల్లో మనం తలదూర్చ కూడదు, ఉచిత సలహాలు అసలే ఇవ్వకూడదు ,జీవితం అంటే అనిపించింది చేయటం కాదు , అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకు తున్నట్లు అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకు తున్నట్లు !
ఒకరిని అనుకరించ కుండా నీదైన స్టయిల్లో బతకాలి!

శుభ సాయంత్రం

.
.

ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎఫ్. ఎం. ఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండ అశుంతభవన్ లో మహిళలు టైలరి...
18/09/2026

ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎఫ్. ఎం. ఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండ అశుంతభవన్ లో మహిళలు టైలరింగ్ , మగ్గం వర్క్ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్బంగా మహిళలకు సర్టిఫికెట్స్ అందజేత కార్యక్రమం, అదేవిదంగా నూతనంగా పేద మహిళలకు మరో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమానికి జడ్జి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసు అధారిటీ హన్మకొండ సెక్రటరీ నేరెళ్ళ వెంకట హైమ పూజిత గారు, నేను, ఇతర అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది, మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషము, సంతృప్తి కలిగింది .

As a senior citizens tribunal court member I am always happy to listen senior citizens words and version With patience  ...
18/09/2026

As a senior citizens tribunal court member I am always happy to listen senior citizens words and version With patience to understand their pain and to solve it in perfect way under Law with Humanity touch !!!

Address

Warangal
506001

Website

Alerts

Be the first to know and let us send you an email when Anurag Helping Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anurag Helping Society:

Shortcuts

Share