Mother Voluntary Organization

Mother Voluntary Organization నిరాశ్రయులను ఆదుకోవడం, పర్యావరణపరిర?

ప్రతీ పౌరుడికి ఓటు అనేది హక్కు- ఓటు వేయడం బాధ్యత - సిరికొండ విక్రమ్ కుమార్, MVO -ఫౌండర్ ప్రతు పౌరుడికి ఓటు అనేది హక్కు అ...
11/09/2024

ప్రతీ పౌరుడికి ఓటు అనేది హక్కు
- ఓటు వేయడం బాధ్యత
- సిరికొండ విక్రమ్ కుమార్, MVO -ఫౌండర్

ప్రతు పౌరుడికి ఓటు అనేది హక్కు అని, ఓటు వేయడం బాధ్యత కూడా అని మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిరికొండ విక్రమ్ కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఓటర్లను ప్రలోభ పెట్టి తననే సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానం చేసుకున్నది సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయంపై బుధవారం మేయిల్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కలెక్టర్, పోలీస్ అధికారులకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకోమ్ము తండా గ్రామంలో గత రెండు రోజుల క్రితం రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా తననే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, అందుకుగాను గ్రామంలో మూడు గుడులు, ఓటుకో వెయ్యి రూపాయలు ఇస్తానని ఓటర్లను ప్రలోభ పెట్టి తీర్మానం చేసుకున్నది మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడే అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అడ్డదారిలో ప్రలోభాలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ధనార్జన లక్ష్యంగా పనిచేస్తారని, భవిష్యత్ తరాల కోసం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకొని సర్పంచ్లను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాలతో నిరాశ్రయులైన కుటుంబాల సహాయార్థం మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో CM సహాయనిధికి రూ. 5000 విరాళం అందించాం...
03/09/2024

భారీ వర్షాలతో నిరాశ్రయులైన కుటుంబాల సహాయార్థం మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో CM సహాయనిధికి రూ. 5000 విరాళం అందించాం. ఇట్టి చెక్కును తహశీల్దార్ కి అందజేశాం. సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఈవారం నిలిపేసి అట్టి మొత్తాన్ని సహాయ నిధికిచ్చాం

మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ 9వ వార్షికోత్సవం పురస్కరించుకుని తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి మంగళవారం నిర్వహించ తలపెట్ట...
06/08/2024

మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ 9వ వార్షికోత్సవం పురస్కరించుకుని తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి మంగళవారం నిర్వహించ తలపెట్టిన అన్నదాన కార్యక్రమం ఈ రోజు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతీ మంగళవారం కొనసాగుతోంది

మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ 2024 క్యాలెండర్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిచే ఆవిష్కరణ చేయించడం జరిగింది..
06/01/2024

మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ 2024 క్యాలెండర్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిచే ఆవిష్కరణ చేయించడం జరిగింది..

22/10/2023

Address

Warangal

Telephone

+919603151176

Website

Alerts

Be the first to know and let us send you an email when Mother Voluntary Organization posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mother Voluntary Organization:

Share