17/03/2026
10వ తరగతి విద్యార్థులకు మజ్జిగ పంపిణీ..
దత్తిరాజేరు ఉన్నత పాఠశాల వద్ద సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయిన నేపధ్యంలో , పరీక్షలు రాస్తున్న 115 మంది విద్యార్థులకు,పరీక్ష రాసిన అనంతరం పంపిణీ చేయడం జరిగింది.ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వలన విద్యార్థుల కోసం ఇవి పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షులు సాయి కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు నాగేశ్వరరావు గారు, భీమేష్, రోహిత్ పాల్గొన్నారు...
SAHAYA SPOORTHY FOUNDATION