12/01/2025
జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు
*స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా*_
*అసలు పేరు : నరేంద్రనాథ్ దత్తా*
*జననం : 12 జనవరి 1863, కలకత్తా*,
*నిర్యాణము : జూలై 4, 1902 (వయసు 39)*
*స్థాపించిన సంస్థ : బేలూరు మఠం, రాష్ణకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్*
*గురువు : రామకృష్ణ పరమహంస*
*తత్వం : వేదాంతం*
*సాహిత్య రచనలు : రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ*
*👌●స్వామి వివేకానందుని స్పూర్తి వచనాలు●*
◆మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు.
◆ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.
◆కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు.
◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.
◆ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.
◆ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
◆కళింకిత హృదయులకు ఆధ్యాత్మిక వికాసం ఉండదు.
◆తెలివైన వారి తమ పని తామే సాధించుకోవాలి.
◆దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.
◆జీవితం పోరాటాల,భ్రమల పరంపర.జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది
◆దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.
◆పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను.
◆పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
◆విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది
ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది.
◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.
◆నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.
◆మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.
◆మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.
◆విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.
◆వేదకాలానికి తరలిపోండి.
◆సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.
◆సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.
◆విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతా