13/02/2026
📢 ముఖ్య గమనిక – పిల్లల గుర్తింపు కోసం సమాచారం
జనవరి నెలలో కాజీపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో
చిన్న పిల్లలను కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
ఆ ఘటనలో రక్షించబడిన మొత్తం 7 మంది పిల్లల్లో
➡️ 4 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
అయితే, ఈ ఫోటోలో ఉన్న 3 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలు ఇప్పటివరకు గుర్తించబడలేదు.
ఈ పిల్లలను ఎవరికైనా గుర్తు ఉంటే లేదా వారి తల్లిదండ్రుల సమాచారం తెలిసి ఉంటే,
దయచేసి కాజీపేట సీఐ శ్రీ సుధాకర్ రెడ్డి గారు
📞 ఫోన్ నంబర్: +91 8712685122
కు సంప్రదించి, తగిన ఆధారాలతో ముందుకు రావాలని విజ్ఞప్తి.
ప్రస్తుతం ఈ పిల్లలు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సురక్షితంగా ఉన్నారు.
➡️ ఈ సమాచారం సంబంధిత వారికి చేరేలా షేర్ చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది.
వీలైతే దయచేసి బాధ్యతగా షేర్ చేయండి.