Sadhu Math venkojipalem jn. Visakhapatnam

Sadhu Math venkojipalem jn. Visakhapatnam service for needy,serve the poor and find GOD in them

01/04/2026
20/01/2026

భగవంతుణ్ణి ఆరాధించడం, భాగవత ఇత్యాది సద్గ్రంథాన్ని పఠించటం, భక్తుణ్ణి సేవించటం ఈ మూడు ఒక్కటే. వీటిలో దేన్ని ఆచరించినా అది భగవంతుణ్ణి సేవించటంతో సమానమే.

18/01/2026

ఏకో దేవః కేశవో వా శివో వా_౹ఏకం మిత్రం భూపతిర్వా యతిర్వా_।ఏకో వాసః పట్టణే వా వనే వా_౹ఏక: నారీ సుందరీ వా దరి వా_।।తా𝕝𝕝 *ఒక్కడే దేవుడు శివుడినైన,విష్ణువు అయినా,నీవు ఎవరిని ఆరాధించినా? దేవుడు ఒక్కడనేభావనతోనేపూజించాలి.ఒకడేమిత్రుడు.అతడు,ధనికుడైనాపేదవాడైనా,స్నేహం చేస్తే మిత్రుడు సంపదలు ఉన్న రాజైన,బూడిద పూసుకుని యతి అయిన వారియందు సద్భావన ప్రేమ కలిగి ఉండాలి.ఒకటే నివాసం అది పట్టణమైన,పల్లె గ్రామమైనా, నీవు సుఖంగా? శాంతి గా? ఆనందంగా? ఉన్నప్పుడు అది కుగ్రామమైనా? విశాలమైన నగరమైనా? చిన్న గుడిశైనా? ఇంద్రభవనమైనా? ఒక్కటే నివాసం.ఒక్కతే జీవిత భాగస్వామిని కలిగి ఉండాలి.వివాహమాడిన స్త్రీ సౌదర్యవతి అయిన, కురూపి అయిన ప్రేమ కలిగి ఉండాలి...]
*తృప్తి ని సంతోషాన్ని... అనేకం ఇవ్వవు.

18/01/2026
18/01/2026

పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. మౌని అంటే సంస్కృతంలో నిశ్శబ్దం అని అర్థం. మౌని అమావాస్య నాడు మౌన వ్రతాన్ని పాటించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు.

🌿మౌన వ్రతం పాటించడం వలన ఒకరోజు ఆయుష్షుని పెంచుకోవడానికి అవుతుంది. ఈసారి ఈ చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది?

మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం, దానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఉదయం 5:25 నుంచి 6:19 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది.
మౌని అమావాస్య నాడు అమావాస్య స్నానం ఆచరిస్తారు. దీని వలన మంచి ఫలితం ఉంటుంది.

చొల్లంగి అమావాస్య నాడు విష్ణుమూర్తి వైద్య వీర రాఘవస్వామిగా అవతరించారు. అందుకని ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయట పడడానికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందడానికి పూజ చేయడం మంచిది.

ఈ స్వామివారి విగ్రహం మీ దగ్గర లేనట్లయితే విష్ణుమూర్తిని కూడా ఆరాధించవచ్చు. చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం చేయడం వలన మంచిది.

ఈ అమావాస్య నాడు లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది.
లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు.

తులసి కోట దగ్గర ముగ్గు వేసి లక్ష్మీ సమేత విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి ఎర్రటి పూలమాలను వేసి ఆరాధించాలి. ఇలా చేయడం వలన విష్ణువు అనుగ్రహాన్ని అమితంగా పొందవచ్చు.

ఈ రోజున అసత్యం పలకరాదు. మౌనంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దలను, స్త్రీలని, పిల్లలను ఈరోజు బాధించకూడదు. ఈరోజు పగటిపూట నిద్రపోకూడదు. రావి చెట్టు చుట్టూ 'నారాయణ నమః' అంటూ 27 సార్లు ప్రదక్షిణలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

అలాగే అక్కడ దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం చదువుకోవచ్చు.
నల్ల నువ్వులు, వస్త్రం, ఉసిరికాయని దానం చేస్తే ఈరోజు చాలా మంచిది....

మౌని అమావాస్యనాడు గంగానది అమృతంగా మారుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఆ రోజున వారణాసిలోని గంగానదిలో, అలహాబాద్‌ (ప్రయాగ)లోని త్రివేణీ సంగమంలో లక్షలాది ప్రజలు స్నానాలు ఆచరిస్తారు

గంగా స్నానానికి అవకాశం లేనివారు సమీపంలో ఉన్న నదిలో, ఇతర నీటి వనరుల్లో గంగా దేవిని తలచుకొని స్నానం చేసి, ఆపన్నులకు దానాలు చేయడం మంచిదన్నది పెద్దల మాట.

ఆధ్యాత్మిక ఉన్నతి కోరుకునేవారు ఈ రోజున పుణ్య తీర్థములందు స్నానము చేసి, మౌనముగా వారి ఇష్టదేవతలను ఆరాధించాలి.

కాకినాడ సమీపంలోనున్న చొల్లంగి ప్రాంతములో సముద్రమునందు, గోదావరిలో ఒక పాయ అయిన తుంగభాగానది కలియుట వలన ఇది సాగర సంగమ ప్రాంతము.
ఈ ప్రాంతములో చొల్లంగి అమావాస్యను ఒక వేడుకగా చేస్తారు.

Wp 855 of 2020, wp 183212 of 2021, wp 30447 of 2021are pending land grabbers trying to grab the math land please help an...
31/12/2024

Wp 855 of 2020, wp 183212 of 2021, wp 30447 of 2021are pending land grabbers trying to grab the math land please help any way

Address

Venkojipalem Jn
Visakhapatnam
530022

Alerts

Be the first to know and let us send you an email when Sadhu Math venkojipalem jn. Visakhapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sadhu Math venkojipalem jn. Visakhapatnam:

Share