01/04/2026
ప్రెస్ నోట్
విశాఖపట్నం, మార్చి 31:
ఏప్రిల్ 3, 4 తేదీలలో కర్నూల్ జిల్లా క్లస్టర్ యూనివర్సిటీలో నిర్వహించబడనున్న రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్‌కు సంబంధించి గోడపత్రికలను ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విడుదల చేశారు.
ఈ సందర్భంగా విశాఖ జిల్లా కార్యదర్శి డి. వెంకటరమణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని యూనివర్సిటీల అభివృద్ధి మరియు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లపై ఈ కన్వెన్షన్‌లో చర్చించి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు ఇవి:
ఖాళీగా ఉన్న 3,371 ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి
యూనివర్సిటీల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి
విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి
పరిశోధక విద్యార్థులకు నెలకు రూ.20,000 ఫెలోషిప్ అందించాలి
పరిశోధనలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
యూనివర్సిటీలలో కుల వివక్షత నిర్మూలనకు “రోహిత్ చట్టం” అమలు చేయాలి
హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.3,000 మెస్ బిల్లు ఇవ్వాలి
యూజీసీ నెట్/సెట్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ తదితర కేంద్ర విద్యా సంస్థలకు కేంద్రం నుండి నిధులు రాబట్టాలి
డీమ్డ్ మరియు ప్రైవేటు యూనివర్సిటీలను నియంత్రిస్తూ, ఫీజులపై అదుపు, రిజర్వేషన్ల అమలు చేయాలి
ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు అజయ్, యూనివర్సిటీ కార్యదర్శి ఎం. కుసుమాంజలి, ఉపాధ్యక్షులు ప్రగతి, సహాయ కార్యదర్శులు సాగర్, విశాల్, అలేఖ్య, గౌరీ లక్ష్మి, కాశీం, సంతోష్ మరియు ఇతర యూనివర్సిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కన్వెన్షన్ ద్వారా రాష్ట్రంలోని ఉన్నత విద్యా రంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.