10/05/2026
భారత పౌరునిగా మీకు ప్రభుత్వ మరియు కార్యాలయాలను ప్రశ్నించే, సమాచారం అడిగే హక్కు రాజ్యాంగం + చట్టాల ద్వారా వచ్చింది ఇవి రూల్స్ :
*1. రాజ్యాంగ హక్కులు - ప్రశ్నించే పునాది*
ఆర్టికల్ హక్కు వివరణ
**ఆర్టికల్ 19(1)(a)** వాక్ స్వాతంత్ర్యం & భావ ప్రకటన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం మీ ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు - "సమాచారం లేకుండా భావ ప్రకటనకు అర్థం లేదు"
**ఆర్టికల్ 21** జీవించే హక్కు జీవించాలంటే పాలనపై సమాచారం తెలుసుకునే హక్కు కూడా ఉంటుంది అని సుప్రీంకోర్టు తీర్పు
**ఆర్టికల్ 32 & 226** రాజ్యాంగ పరిహార హక్కు ప్రభుత్వ అధికారి విధి నిర్వహించకపోతే హైకోర్టు/సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు
*2. సమాచారం అడిగే ప్రధాన చట్టం - RTI Act 2005*
ఇదే మీ బలమైన ఆయుధం. ప్రతి ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి వెబ్సైటు, జీవోలు,ఆర్డర్ కాపీలు, కార్యాలయ ఉద్యోగుల వివరాలు, ఎంతమంది ఉద్యోగులు ఆఫీసు కేటాయించబడ్డారు, వారు ప్రజలకు అందించే రోజువారి సేవలు, వారికి సంబంధించిన నియమ నిబంధనల కాపీలు కార్యాలయ విధులు అడిగి ప్రశ్నించి కోరవచ్చు.
*ముఖ్య సెక్షన్లు:*
సెక్షన్ హక్కు వివరం
**Sec 3** సమాచార హక్కు పౌరులందరికీ ప్రభుత్వ సమాచారం పొందే హక్కు ఉంది
**Sec 4(1)(b)** స్వచ్ఛంద వెల్లడి ప్రతి ఆఫీస్ తమ విధులు, అధికారుల పేర్లు, జీతాలు, బడ్జెట్, సబ్సిడీలు 17 అంశాలు వెబ్‌సైట్‌లో పెట్టాలి
**Sec 6(1)** దరఖాస్తు హక్కు తెలుగు/ఇంగ్లీష్/హిందీలో రాతపూర్వకంగా లేదా మౌఖికంగా అడగవచ్చు. కారణం చెప్పాల్సిన అవసరం లేదు
**Sec 7(1)** సాధారణ సమాచారం 30 రోజులు. ప్రాణ, స్వేచ్ఛకు సంబంధిస్తే 48 గంటలు, రెడీగా ఉంటే టైం లిమిట్ లేదు.
**Sec 8 & 9** మినహాయింపులు దేశ భద్రత, వ్యక్తిగత గోప్యత లాంటివి తప్ప అన్ని ఇవ్వాలి
**Sec 19** అప్పీల్ హక్కు 30 రోజుల్లో రిప్లై రాకపోతే మొదటి అప్పీల్. 90 రోజుల్లో రెండో అప్పీల్ - సమాచార కమిషన్‌కు
**Sec 20** జరిమానా సమాచారం ఇవ్వని అధికార�