Andhra Pradesh film & Tv Dance Masters & Dancers Union

Andhra Pradesh film & Tv Dance Masters & Dancers Union Andhra Pradesh Film & Tv Dance Masters & Dancers Union

*ది. 24-06-2025 తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఇ.నెం- 13-90/2/2/5, సీతానగరం , తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా "ఆంధ్రప్రదేశ...
26/06/2025

*ది. 24-06-2025 తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఇ.నెం- 13-90/2/2/5, సీతానగరం , తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా "ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్" కార్యాలయం నందు "ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టివి డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్" రి.నెం. H-241. కు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి.*

*అధ్యక్షులు : కరాటపు వేణుగోపాల్.*
*ఉపాధ్యక్షులు : లింగంపల్లి నానీ గోపాల్,*
*గాడి భాస్కర్.*
*ప్రధాన కార్యదర్శి: మద్దే లక్ష్మి కాంత్ నాయుడు.*
*కోశాధికారి: మొఘల్ అనిల్ బేగ్.*
*కార్యదర్శి : పద్మనాభం అరుణ్ కుమార్.*
*సహాయ కార్యదర్శి : జమ్మాన గౌతం.*
*కార్యనిర్వహక కార్యదర్శి : పెద్దపల్లి నాగార్జున, ఓబుగండ్ల బాబు.*
*ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు*
*జొన్నా నిఖిత.*
*చింతపల్లి సత్యనారాయణ.*
*దండ రాము.*
*కరతోటి గంగాధర్.*
*ఆలపాక ప్రశాంత్.*
*వడ్డే శ్రీనివాస్.*
*జి.డి.మిల్కీ దేవానంద్.*
*తదితరులు ఎన్నికైనారు.*
ఇట్లు
*మద్దే లక్ష్మి కాంత్ నాయుడు*
ప్రధాన కార్యదర్శి:
*ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టివి డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్.H-241*

Let's Rock ....
21/06/2025

Let's Rock ....

గుంటూరుకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ కుమార్తె బేబీ లాస్య మరణానికి కారణమైన లలిత  హాస్పిటల్ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవ...
14/06/2025

గుంటూరుకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ కుమార్తె బేబీ లాస్య మరణానికి కారణమైన లలిత హాస్పిటల్ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ పెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా గారి సూచనల మేరకు సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ వద్ద నిర్వహించే బారీ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ లోని డాన్స్ మాస్టర్స్ ,డ్యాన్సర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్ యూనియన్ ప్రెసిడెంట్ సూర్య వేణు పిలుపునిచ్చారు. దేవుడి తరువాత కనిపించే దేవుడిగా బావించే డాక్టర్స్ వైద్యం కోసం వచ్చిన వారి పట్ల నిర్లక్ష్యం వహించి ఓ నిండు ప్రాణం బలితీసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే గుంటూరు లలిత హాస్పిటల్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని , ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి శ్రీమతి అనిత గారు,వైధ్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు స్పందించి బేబీ లాస్య మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని యూనియన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.*

30/09/2024

*టాలెంట్ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ కు అవకాశాలు.*
# # # # # # # # # # # # # # # # # # # # # # #
*ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టివి డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ H-241 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాలెంట్ ఉన్న డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ కు యూనియన్ లో సభ్యత్వం కల్పించాలని దానికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడీషన్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సూర్య వేణు..*

*29-09-2024 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టివి డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సమావేశం అధ్యక్షులు సూర్య వేణు గారు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ తోరం రాజా గారు హాజరయ్యారు.*

*ఈ సమావేశంలో ఈ క్రింద పేర్కొన బడిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.*
*1) తీర్మానం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాన్స్ పై అవగాహన ఉండి టాలెంట్ గల వారికి యూనియన్ నందు సభ్యత్వం కల్పించాలని, దానికోసం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో ఆడీషన్స్ నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు*
*2) ప్రతీ నెల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించాలని, అవసరాన్నిబట్టి జూం మీటింగ్ ద్వారా సమావేశం నిర్వహించాలని ఏకగ్రీవంగా ఆమోదించారు*
*3) తీర్మానం : ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే సినిమా పాటల షూటింగ్స్ లో యూనియన్ సభ్యులుకు ఖచ్ఛితంగా అవకాశాలు కల్పించాలని గౌరవ ప్రభుత్వం ద్వారా నిర్మాతలకు దర్శకులకు తెలపాలని ఏకగ్రీవంగా ఆమోదించారు.*
*4) తీర్మానం : యూనియన్ కార్యాలయంలో నిరంతరం ప్రాక్టీసు చేసుకునేలా మాష్టర్స్ షెడ్యూల్ చార్ట్ ప్రిపరేషన్ చేయాలని, వర్క్ షాప్ నిర్వహించాలని ఏకగ్రీవంగా ఆమోదించారు.*
*5) తీర్మానం : చెన్నయ్, హైదరాబాద్, బెంగళూరు యూనియన్స్ కాల్షీట్లు రేట్లు స్టడీ చేసి ఇక్కడ కూడా పనికి తగిన వేతనం రూపోందించాలని ఏకగ్రీవంగా ఆమోదించారు.*
*6) తీర్మానం : ప్రతీ మాష్టర్ సినిమా సాంగ్స్ ఒప్పుకోన్నప్పడు యూనియన్ కు తెలిపి అగ్రిమెంట్ సినిమా బేనర్ పై చేసుకున్నప్పుడు మాత్రమే సాంగ్స్ చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించారు.*
*7) తీర్మానం : యూనియన్ సభ్యులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా సాంగ్స్ చేయాలని యూనియన్ సభ్యులు కానివారు సాంగ్స్ షూటింగ్ చేస్తే నిలువరించాలని (ఆపాలని) ఏకగ్రీవంగా ఆమోదించారు.*
*8) తీర్మానం : సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు 3 సమావేశాలుకు రాకపోయినా, యూనియన్ నియమనిబంధనలు పాటించకపొయినా వారిని తోలగించ బడును. వారు చెల్లించిన సభ్యత్వరుసుము చందా తిరిగి ఇవ్వబడదని ఏకగ్రీవంగా ఆమోదించారు*
*9) తీర్మానం: సభ్యులు మరియు కుటుంబ అందరికీ హెల్త్ కార్డులు సభ్యులుకు ప్రమాద భీమా, సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వం కల్పించాలని ఏకగ్రీవంగా ఆమోదించారు*
*ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు లింగంపల్లి నాని గోపాల్ గారు, ప్రధాన కార్యదర్శి మద్దె లక్ష్మి కాంత్ గారు, కోశాధికారి మున్నా గారు, కార్యదర్శి అరుణ్ కుమార్ గారు, గౌతమ్ గారు, సహాయ కార్యదర్శి నాగార్జున గారు, కార్యనిర్వహక కార్యదర్శి బద్వేలు బాబు గారు. కల్యాణ్ గారు , ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సతీష్ గారు, శ్రీను గారు, వాసు గారు,కోటి గారు, ప్రశాంత్ గారు, గంగాధర్ గారు, కెశవ గారు, జీడి గారు, రాము గారు, బత్తిన బాబు గారు, అభిరామ్ గారు తదితరులు పాల్గొన్నారు.*
ఇట్లు
*మద్దె లక్ష్మి కాంత్*
ప్రధాన కార్యదర్శి
*ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టివి డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్. H-241*
*98495 70959*

31/08/2024

East Godavari Audition

Heartly welcome 🙏🏻🙏🏻🙏🏻
24/08/2024

Heartly welcome 🙏🏻🙏🏻🙏🏻

Don’t miss
24/08/2024

Don’t miss

✊
14/07/2024

Address

Vijayawada
520001

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra Pradesh film & Tv Dance Masters & Dancers Union posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share