MHPS Penamaluru

MHPS Penamaluru MHPS

22/02/2026
18/02/2026
18/02/2026
తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు చోటు లేదు- మేడారం కోవా బన్ ఉదంతంలో యావత్ హిందూ సమాజం వలీకి అండగా నిలవడం హర్షణీయం- మత ...
15/02/2026

తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు చోటు లేదు
- మేడారం కోవా బన్ ఉదంతంలో యావత్ హిందూ సమాజం వలీకి అండగా నిలవడం హర్షణీయం
- మత సామరస్యం వెల్లివిరిసేలా కూటమి పాలన
- కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారమందించాలి
- ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి
- మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోవ బన్ను పరిశ్రమ కొరకు వలి & మిత్ర బృందానికి షిబ్లీ గారి చేతుల మీదుగా రూ. 50 వేలు సహాయం

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు స్థానం లేదని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి తెలిపారు. ఇటీవల మేడారం జాతర సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులచే వేధింపులకు గురైన కోవా బన్‌ విక్రేత వలీకి యావత్ హిందూ సమాజం అండగా నిలవడం నిజంగా హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వలీ, జావేద్, హుస్సేన్ తదితరులు ఆదివారం నగరంలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయానికి విచ్చేశారు. వలీకి అండగా ఉంటామని, కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం లభించేలా కృషి చేస్తామని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి ఈ సందర్భంగా వలీ తదితరులకు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వ భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వలీకి ఎదురైన అవమానం పట్ల విచారం వ్యక్తం చేసి, సంఘీభావం తెలియజేశారని షుబ్లి పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన నేత కొణిదెల నాగబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితర ముఖ్య నేతలు మేడారం ఉదంతం పట్ల విచారం వ్యక్తం చేసి, వలీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మత సామరస్యంతో విలసిల్లుతోందని, అన్ని వర్గాల ప్రజలు శాంతి, సౌహార్ద వాతావరణంలో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఫారూఖ్ షుబ్లి వెల్లాడించారు. కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోవ బన్ను పరిశ్రమకు వలీ & అతని మిత్ర బృందానికి షిబ్లీ గారి చేతుల మీదుగా రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. సమాజంలో శాంతి, ఐక్యత నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

15/02/2026
03/02/2026
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలమేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ 7వ డివి...
31/01/2026

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలమేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ 7వ డివిజన్ లోని స్థానిక 40వ నంబర్ సచివాలయంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షిబ్లి గారు తన చేతులమీదుగా 4000 రూపాయల చొప్పున పెన్షన్లు
1. పరిమి కమల (వితంతు పెన్షన్)
2. దోనెపూడి శివ మల్లీశ్వరి (వితంతు పెన్షన్)
3. ఆవల కనకమ్మ (వృధాప్య పెన్షన్)
4. పరస వసంత కుమారి (వృధాప్య పెన్షన్) లకు అందజేశారు.

Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Kesineni Sivanath మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి Vasantha Venkata Krishna Prasad Putha Chaithanya Reddy Raghu Rama Krishna Raju Bonda Uma Mla Gadde Ramamohan Reddeppagari Madhavi Akka Fans-Kadapa Saleem Pasha Saleempasha Daggubati Purandeswari Kollu Ravindra Bode Prasad PVN Madhav Pattabhi Ram Kommareddy Ramakrishna Cpi Nasyam Mohammed Farook TD Janardhan ఫరూఖ్ షిబ్లీ గారి సైన్యం

07/01/2026

AVKAI PROGRAM JAN 8,9,10

04/01/2026

సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా, గౌ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌ మైనారిటీ & న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ NMD ఫరూఖ్ గారి సూచనల మేరకు విజయవాడ బుక్ ఫెస్టివల్ నందు ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ పుస్తకాల ప్రదర్శనను రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌ శ్రీ PVN మాధవ్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. తదనంతరం ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షిబ్లి గారితో ప్రదర్శనకు ఉంచిన ఉర్దూ పుస్తకాలను మరియు చంద్రబాబు గారు ఉర్దూ భాషకు ఇచ్చిన ప్రాధాన్యత మరియు సేవలను తెలుపుతూ ప్రదర్శన స్టాల్ లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా PVN మాధవ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదని, మతానికి భాషతో సంబంధం లేదని. ఉర్దూ ముస్లింల భాష, సంస్కృతం హిందువుల భాష అనడం తప్పు అని భాషకు మతానికి సంబంధమే లేదని అన్నారు. ప్రతిఒక్కరు మాతృ భాషను ప్రేమించాలని మాతృ భాషపై పట్టు కలిగి ఉండాలని అన్నారు.

సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా, గౌ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌ ...
04/01/2026

సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా, గౌ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌ మైనారిటీ & న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ NMD ఫరూఖ్ గారి సూచనల మేరకు విజయవాడ బుక్ ఫెస్టివల్ నందు ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ పుస్తకాల ప్రదర్శనను రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌ శ్రీ PVN మాధవ్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. తదనంతరం ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షిబ్లి గారితో ప్రదర్శనకు ఉంచిన ఉర్దూ పుస్తకాలను మరియు చంద్రబాబు గారు ఉర్దూ భాషకు ఇచ్చిన ప్రాధాన్యత మరియు సేవలను తెలుపుతూ ప్రదర్శన స్టాల్ లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా PVN మాధవ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదని, మతానికి భాషతో సంబంధం లేదని. ఉర్దూ ముస్లింల భాష, సంస్కృతం హిందువుల భాష అనడం తప్పు అని భాషకు మతానికి సంబంధమే లేదని అన్నారు. ప్రతిఒక్కరు మాతృ భాషను ప్రేమించాలని మాతృ భాషపై పట్టు కలిగి ఉండాలని అన్నారు.

31/12/2025

తుమ్మలపల్లి కళాక్షేత్రం విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ NMD ఫరూఖ్ గారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన ఉర్దూ అకాడమీ చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ.

Address

Yanamalakuduru
Vijayawada
520013

Website

Alerts

Be the first to know and let us send you an email when MHPS Penamaluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share