Viswa Vidyarthi Sena AP

Viswa Vidyarthi Sena AP Viswa Vidyarthi Sena (VVS)
A student movement committed to educational justice, equal opportunities, leadership development and social transformation. Ambedkar.

Inspired by the ideals of Mahatma Jyotirao Phule, Savitribai Phule and Dr. B.R.

16/06/2026
✊ గానాల రామ్మూర్తి జయంతి – ఘన నివాళులు– ఆనంద్ బాబు | రాష్ట్ర అధ్యక్షుడు, BC Student Federationబీసీల గుండె చప్పుడుగా,అణగా...
21/01/2026

✊ గానాల రామ్మూర్తి జయంతి – ఘన నివాళులు

– ఆనంద్ బాబు | రాష్ట్ర అధ్యక్షుడు, BC Student Federation

బీసీల గుండె చప్పుడుగా,
అణగారిన వర్గాల ఆవేదనగా,
ప్రజా గీతాల ఉద్యమంగా నిలిచిన
గానాల రామ్మూర్తి గారి జయంతిని సీనియర్ బీసీ నాయకులు శ్రీ ధనుంజయ ఆచారి గారి అధ్యక్షతన కర్నూలు బీ-క్యాంప్ లోని బీసీ భవన్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసులు, నాగేశ్వరరావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయకుమార్, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ తిరుమలాచారి గారు, బీసీ యువజన నాయకుడు రాంబాబు, సీనియర్ విద్యార్థి నాయకుడు భరత్ కుమార్, విద్యార్థి నాయకుడు సాయికుమార్, మహిళ నాయకురాలు శకుంతల గారు మరియు ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు.
🗣️ గానాల రామ్మూర్తి గారు పాటకే కాదు – పోరాటానికి రూపం.
అన్యాయంపై ప్రశ్నించమని,
భయంలేకుండా మాట్లాడమని,
బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టమని ఆయన గీతాలు నేర్పాయి.

👉 ఈ జయంతి రోజున
పూలతోనే కాదు – ఆయన ఆశయాలను మన ఉద్యమంగా మార్చుకోవడమే నిజమైన నివాళి.
బీసీ విద్యార్థుల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం
BC Student Federation నిరంతరం పోరాడుతుంది.

గానాల రామ్మూర్తి గారికి జయంతి శుభాకాంక్షలు !

ప్రజా గీతాలు వర్ధిల్లాలి ! | బీసీల ఐక్యత వర్ధిల్లాలి !
— ఆనంద్ బాబు
రాష్ట్ర అధ్యక్షుడు
BC Student Federation

13/12/2025

'అణగారిన జీవితాల్లో అక్షర దారి
పొద్దై పొడిచెను చదువుల జెండగ మారి
ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి
మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
మరువొద్దుర సమాజమా మహనీయులను
మరువొద్దుర సమాజమా మహనీయులను
పూలే సావిత్రిబాయి త్యాగాలను'

అనే గేయం రచన, గానం 'రాంబాబు యాసరపు'

👉మహిళలకు మనువాదులు వేసిన సంకెళ్ళను చీల్చి వారికి చదువు చెప్పిన భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయిని, చదువుల తల్లి
#సావిత్రిబాయిపూలే గారి 194 వ (03.01.1831)
జయంతి 03/01/2025 సందర్భంగా...

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ సాధనకై కర్నూలు జిల్లా కేంద్రం లో జరిగిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశం. పేపర్ క్లిప్పింగ్స...
04/12/2025

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ సాధనకై కర్నూలు జిల్లా కేంద్రం లో జరిగిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశం. పేపర్ క్లిప్పింగ్స్. థ్యాంక్ యూ మీడియా & ఫ్రెండ్స్ !

స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకుల డిమాండ్.కర్నూలు, 03 ...
03/12/2025

స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకుల డిమాండ్.

కర్నూలు, 03 డిసెంబర్ 2025:

త్వరలో జరగబోయే *ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని* కర్నూలు బిర్లా కాంపౌండ్‌లోని సాయి వసంత్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన *రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు డిమాండ్* చేశారు.

ఈ సమావేశాన్ని *బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ బాబు* ఆధ్వర్యంలో నిర్వహించగా, *బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య* అధ్యక్షత వహించారు.

సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు:
యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అయ్యన్న యాదవ్, బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ధనుంజయ ఆచారి, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు సింధూ నాగేశ్వరరావు, మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రిక, సీనియర్ మహిళా నాయకురాలు నాగేశ్వరి నాయుడు, బీసీ సంఘాల JAC ఛైర్మన్ టీజీ శ్రీనివాసులు, బీసీ యువ నాయకులు శ్రీరామ్ యాదవ్, వెంకటేశ్వర్లు, రవి, రాము యాదవ్, భరత్ భూషణ్, లక్ష్మన్న, ప్రియాంక యాదవ్, రాము, సవారన్న తదితరులు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “జనాభాలో సగం భాగం ఉన్న బీసీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 50% రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం తక్షణం స్పష్టతనివ్వాలి. శాస్త్రీయ పద్ధతిలో కుల గణన నిర్వహించి బీసీల నిజమైన జనాభా సంఖ్యను ప్రకటించాలి. వివిధ బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన బడ్జెట్ కేటాయించాలి. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. బీసీ విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్‌ను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.” అని వారు పేర్కొన్నారు.

అలాగే, బీసీల హక్కుల కోసం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం దశలవారీగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

- ఆనంద్ బాబు
అధ్యక్షులు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్

26/11/2025

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Viswa Vidyarthi Sena AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share