BC Student Federation AP

BC Student Federation AP BC Student Federation of India
Uniting the youth for unstoppable strength & political power! Join us to empower, engage, and energize every student

We are the voice of students, driving change, fighting for rights, and building a brighter future together.

✊ గానాల రామ్మూర్తి జయంతి – ఘన నివాళులు– ఆనంద్ బాబు | రాష్ట్ర అధ్యక్షుడు, BC Student Federationబీసీల గుండె చప్పుడుగా,అణగా...
21/01/2026

✊ గానాల రామ్మూర్తి జయంతి – ఘన నివాళులు

– ఆనంద్ బాబు | రాష్ట్ర అధ్యక్షుడు, BC Student Federation

బీసీల గుండె చప్పుడుగా,
అణగారిన వర్గాల ఆవేదనగా,
ప్రజా గీతాల ఉద్యమంగా నిలిచిన
గానాల రామ్మూర్తి గారి జయంతిని సీనియర్ బీసీ నాయకులు శ్రీ ధనుంజయ ఆచారి గారి అధ్యక్షతన కర్నూలు బీ-క్యాంప్ లోని బీసీ భవన్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసులు, నాగేశ్వరరావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ విజయకుమార్, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ తిరుమలాచారి గారు, బీసీ యువజన నాయకుడు రాంబాబు, సీనియర్ విద్యార్థి నాయకుడు భరత్ కుమార్, విద్యార్థి నాయకుడు సాయికుమార్, మహిళ నాయకురాలు శకుంతల గారు మరియు ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు.
🗣️ గానాల రామ్మూర్తి గారు పాటకే కాదు – పోరాటానికి రూపం.
అన్యాయంపై ప్రశ్నించమని,
భయంలేకుండా మాట్లాడమని,
బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టమని ఆయన గీతాలు నేర్పాయి.

👉 ఈ జయంతి రోజున
పూలతోనే కాదు – ఆయన ఆశయాలను మన ఉద్యమంగా మార్చుకోవడమే నిజమైన నివాళి.
బీసీ విద్యార్థుల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం
BC Student Federation నిరంతరం పోరాడుతుంది.

గానాల రామ్మూర్తి గారికి జయంతి శుభాకాంక్షలు !

ప్రజా గీతాలు వర్ధిల్లాలి ! | బీసీల ఐక్యత వర్ధిల్లాలి !
— ఆనంద్ బాబు
రాష్ట్ర అధ్యక్షుడు
BC Student Federation

13/12/2025

'అణగారిన జీవితాల్లో అక్షర దారి
పొద్దై పొడిచెను చదువుల జెండగ మారి
ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి
మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
మరువొద్దుర సమాజమా మహనీయులను
మరువొద్దుర సమాజమా మహనీయులను
పూలే సావిత్రిబాయి త్యాగాలను'

అనే గేయం రచన, గానం 'రాంబాబు యాసరపు'

👉మహిళలకు మనువాదులు వేసిన సంకెళ్ళను చీల్చి వారికి చదువు చెప్పిన భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయిని, చదువుల తల్లి
#సావిత్రిబాయిపూలే గారి 194 వ (03.01.1831)
జయంతి 03/01/2025 సందర్భంగా...

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ సాధనకై కర్నూలు జిల్లా కేంద్రం లో జరిగిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశం. పేపర్ క్లిప్పింగ్స...
04/12/2025

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ సాధనకై కర్నూలు జిల్లా కేంద్రం లో జరిగిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశం. పేపర్ క్లిప్పింగ్స్. థ్యాంక్ యూ మీడియా & ఫ్రెండ్స్ !

స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకుల డిమాండ్.కర్నూలు, 03 ...
03/12/2025

స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకుల డిమాండ్.

కర్నూలు, 03 డిసెంబర్ 2025:

త్వరలో జరగబోయే *ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని* కర్నూలు బిర్లా కాంపౌండ్‌లోని సాయి వసంత్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన *రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు డిమాండ్* చేశారు.

ఈ సమావేశాన్ని *బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ బాబు* ఆధ్వర్యంలో నిర్వహించగా, *బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య* అధ్యక్షత వహించారు.

సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు:
యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అయ్యన్న యాదవ్, బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ధనుంజయ ఆచారి, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు సింధూ నాగేశ్వరరావు, మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రిక, సీనియర్ మహిళా నాయకురాలు నాగేశ్వరి నాయుడు, బీసీ సంఘాల JAC ఛైర్మన్ టీజీ శ్రీనివాసులు, బీసీ యువ నాయకులు శ్రీరామ్ యాదవ్, వెంకటేశ్వర్లు, రవి, రాము యాదవ్, భరత్ భూషణ్, లక్ష్మన్న, ప్రియాంక యాదవ్, రాము, సవారన్న తదితరులు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “జనాభాలో సగం భాగం ఉన్న బీసీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 50% రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం తక్షణం స్పష్టతనివ్వాలి. శాస్త్రీయ పద్ధతిలో కుల గణన నిర్వహించి బీసీల నిజమైన జనాభా సంఖ్యను ప్రకటించాలి. వివిధ బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన బడ్జెట్ కేటాయించాలి. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. బీసీ విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్‌ను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.” అని వారు పేర్కొన్నారు.

అలాగే, బీసీల హక్కుల కోసం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం దశలవారీగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

- ఆనంద్ బాబు
అధ్యక్షులు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్

02/12/2025
26/11/2025
ప్రెస్ నోట్కర్నూలు, తేదీ: 24/11/2025.కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు మరియు ప్రాక్టి...
24/11/2025

ప్రెస్ నోట్

కర్నూలు, తేదీ: 24/11/2025.

కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు మరియు ప్రాక్టికల్ బోధనలో ఉన్న లోపాలపై బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు జిల్లా కలెక్టర్ డా.సిరిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ బాబు మాట్లాడుతూ “ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు సరైన ల్యాబ్ సౌకర్యాలు, పరికరాలు, నాణ్యమైన ప్రాక్టికల్ బోధన అందకపోవడం వల్ల సైన్స్ విద్య దెబ్బతింటోందని, విద్యార్థులు ఉన్నత విద్య పోటీల్లో వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు కోసం సైన్స్ ప్రాక్టికల్స్ తప్పనిసరి. నాణ్యమైన ప్రాక్టికల్ బోధన లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి " అని తెలిపారు.

జిల్లా కలెక్టర్ స్పందిస్తూ “ఇంటర్ కళాశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, ప్రాక్టికల్ తరగతులపై త్వరలోనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అవసరమైన చోట తగిన చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య, BC RPS జిల్లా అధ్యక్షుడు చంద్ర శేఖర్ యాదవ్, విద్యార్థి నాయకులు గణేష్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదాలు !
- ఆనంద్ బాబు పగడాల.

బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని బిసి స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ బాబు డిమాండ్....
19/11/2025

బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని బిసి స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ బాబు డిమాండ్. నేడు మీడియాలో ప్రచురితం అయిన పేపర్ క్లిప్పింగ్స్. బిసి విద్యార్థుల సమస్యల కోసం మీడియా మిత్రుల సహకారానికి ధన్యవాదాలు ! 🙏🏻 student federation BC Student Federation AP Anand Babu Pagadala Kurnool City, Andra Pradesh, India

బీసీ హాస్టల్లలో వసతులు మెరుగుపరచండి - కర్నూలు జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారిణి కి విద్యార్థి సంఘాల నేతలు వినతి.కర్నూలు:...
18/11/2025

బీసీ హాస్టల్లలో వసతులు మెరుగుపరచండి - కర్నూలు జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారిణి కి విద్యార్థి సంఘాల నేతలు వినతి.

కర్నూలు: కర్నూలు జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ హాస్టల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బిసి స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు, రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోడి వెంకటేశ్వర్లు, ప్రోగ్రెసివ్ యూత్ అసోసియేషన్ నాయకుడు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యల ను జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రసూన గారికి వినతి పత్రం అందించారు. .
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ" పేద బడుగు వర్గాల విద్యార్థుల భవిష్యత్తు హాస్టల్లతో ముడిపడి ఉన్నందున సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు. చలికాలం ప్రారంభం కావడంతో విద్యార్థులకు నాణ్యమైన బెడ్ షీట్లు పంపిణీ చేయాలని, మెనూలో నాణ్యత పాటించాలని, విద్యార్థుల భద్రత దృష్ట్యా సంక్షేమ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలపై అధికారిణి స్పందిస్తూ " ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనంతోపాటు భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ధన్యవాదాలు !

ఆనంద్ బాబు, బిసి స్టూడెంట్ ఫెడరేషన్.
తేదీ: 18/11/2025

25/08/2025

*ప్రెస్ నోట్*
పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా DSC- 2025 సంబంధించి అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను (స్టేట్, జోన్, డిస్ట్రిక్ట్ స్థాయి) 22.08.2025 నుండి మెగా DSC అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసినదే.

ఈ విషయంగా తెలియచేయడమేమనగా వివిధ కేటగిరీ పోస్టులకుగాను Zone of Consideration లోకి వచ్చిన అభ్యర్థులకు, వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధిత జిల్లాల్లోనే గురువారం అనగా 28.8.2025 న ఉదయం 09.00AM నుండి ప్రారంభమవుతుంది.

కావున ఈ అభ్యర్థులు తమ వ్యక్తిగత Mega DSC - 2025 లాగిన్ ఐడీల ద్వారా 26.08.2025 మధ్యాహ్నం నుండి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు లాగిన్లోకి ప్రవేశించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించిన సూచనలను ఖచ్చితంగా పాటించాలి.

*సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అభ్యర్ధులు తీసుకురావలసిన సర్టిఫికెట్స్:*
▪️సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు
▪️ఇటీవల జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం (వర్తించినచో)
▪️అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం (వర్తించినచో)
▪️కాల్ లెటర్ నందు సూచించిన ఇతర సర్టిఫికెట్స్
▪️గజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు
▪️5 పాస్పోర్ట్ సైజు ఫొటోలు

అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయం మరియు వేదికకు తప్పనిసరిగా హాజరు కావాలి. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. అటువంటి సందర్భంలో తదుపరి మెరిట్ జాబితాలోని అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది.

ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు నిర్దిష్ట సూచనలను పాటించి, సమయానికి సర్టిఫికెట్లతో హాజరు కావాల్సినదిగా తెలియచేయడమైనది.

*గమనిక:*
1. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందు, సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో వ్యక్తిగత Mega DSC-2025 లాగిన్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

2. కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావడం వల్ల అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలుగదు. ఎంపిక పూర్తిగా మెరిట్, అర్హత, రిజర్వేషన్ మరియు సంబంధిత నియమనిబంధనల ఆధారంగానే జరుగుతుంది.

ఎం.వి. కృష్ణ రెడ్డి
కన్వీనర్ DSC - 2025

This Website is about Mega Dsc 2025

24/08/2025

దాచేపల్లి లోని ఒక జూనియర్ కళాశాలలో విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి.
ఈ సంఘటనపై ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ జరపాలని బాధ్యులపై తగిన చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి. Anand Babu Pagadala Anand Babu PagadalaBC Student Federation AP
Guntur

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when BC Student Federation AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share