PNM AP

PNM AP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PNM AP, Nonprofit Organization, https://maps. app. goo. gl/MovrReRYWrv8faD 87, Vijayawada.

ప్రజానాట్యమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1943లో కళ ప్రజల కోసం ప్రగతి కోసం అనే లక్ష్యంతో స్థాపించబడిన సాంస్కృతిక సంస్థ. ఇది సామ్యవాద సిధ్దాంతాల ఆధారంగా ప్రజల సమస్యలను వీధి నాటకాలు, పాటలు, నృత్యాలు, ఇతర కళారూపాల ద్వారా ప్రజా చైతన్య పరచడానికి కృషి చేస్తుంది.

వైఎస్ కృష్ణేశ్వరరావు సంస్మరణ సభ ఎంబివికె లో జరిగింది.
16/08/2026

వైఎస్ కృష్ణేశ్వరరావు సంస్మరణ సభ ఎంబివికె లో జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి చాటుదాం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో  ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో విద్యా...
15/08/2026

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి చాటుదాం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటల పోటీలు.

🇳🇪దేశభక్తి చాటుదాం కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పాత కడప హైస్కూల్లో, ఆజాది, పాడవోయి భారతీయుడా పాటలకు డాన్స్ వేస్తున్న చ...
15/08/2026

🇳🇪దేశభక్తి చాటుదాం కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పాత కడప హైస్కూల్లో, ఆజాది, పాడవోయి భారతీయుడా పాటలకు డాన్స్ వేస్తున్న చిన్నారులు🥁

"దేశభక్తి చాటుదాం" గుంటూరు జిల్లా కుంచనపల్లి మరియు తాడేపల్లి సుందరయ్య నగర్ లో జరిగింది.స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజ...
15/08/2026

"దేశభక్తి చాటుదాం" గుంటూరు జిల్లా కుంచనపల్లి మరియు తాడేపల్లి సుందరయ్య నగర్ లో జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటల పోటీలు.

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు, ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ పిలుపుమేరకు ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి ఎంపీయుపి పాఠశాల నందు శుక్రవారం ప్రజానాట్యమండలి తాడేపల్లి రూరల్ కమిటీ ఆధ్వర్యంలో దేశభక్తిని చాటుదాం పేరుతో విద్యార్థిని విద్యార్థులకు పాటల పోటీలను నిర్వహించారు. ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు నల్లపు కిషోర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆర్ వి రాఘవయ్య, రైతు సంఘం గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. మూడవ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పలు దేశభక్తి గీతాలను ఉత్సాహభరితంగా ఆలపించి, తమ ప్రతిభను చాటారు. అనంతరం సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రజానాట్యమండలి మేమంటోలు, సర్టిఫికెట్లను నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆర్ వి రాఘవయ్య మాట్లాడుతూ సమాజంలో డిజిటల్ వినియోగం విపరీతంగా పెరిగిందన్నారు. విద్యార్థులు విలువలతో కూడిన చదువుతోపాటు, కళల పట్ల ఆసక్తితో తమ తమ ప్రతిభలను కనబరుచుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు సంఘం గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులలో దాగిన వివిధ రకాల కళలను ప్రోత్సహించే దిశగా ప్రజానాట్యమండలి కృషి చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు తమ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కృషిచేసి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. సిఐటియు తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేందుకు విద్యార్థులు మంచి నడవడికను అలవర్చుకొని, గురువులు చూపిన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు కంచర్ల సాంబశివరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎల్ నాగేశ్వరరావు, సుధా రత్న కుమారి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

80 వ స్వాతంత్ర దినోత్స వం సందర్భంగా ప్రజానాట్యమండలి విశాఖ జిల్లా కార్యాలయం హష్మీ భవనంలో త్రివర్ణ పతాకం జెండా ఆవిష్కరణ జర...
15/08/2026

80 వ స్వాతంత్ర దినోత్స వం సందర్భంగా ప్రజానాట్యమండలి విశాఖ జిల్లా కార్యాలయం హష్మీ భవనంలో త్రివర్ణ పతాకం జెండా ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి, మహిళా సంఘం, నాయకులు జీ రమణ, ఎం చంటి, సుమిత్ర, రిటైడ్ ఎంప్లాయిస్, స్టీల్ ప్లాంట్ నాయకులు భానుమూర్తి,
డాన్స్ టీచర్ రాగిణి, యోగా గురువులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

🇮🇳దేశభక్తి చాటుదాం కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా, కడప ప్రకాష్ నగర్ బాయ్స్ హాస్టల్లో కళారూపాలను తయారుచేసి ప్రోగ్రాం ఇవ్వ...
15/08/2026

🇮🇳దేశభక్తి చాటుదాం కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా, కడప ప్రకాష్ నగర్ బాయ్స్ హాస్టల్లో కళారూపాలను తయారుచేసి ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది 🥁

80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం లోప్రజానాట్యమండలి, CITU మద్దిలపాలెం జోన్ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఆరిలోవ ...
15/08/2026

80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం లో
ప్రజానాట్యమండలి, CITU మద్దిలపాలెం జోన్ కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఆరిలోవ ప్రాంతంలో ఆటపాట మాట సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
15/08/2026

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

14/08/2026

Fidel Castro 100th birthday anniversary programme - Vijayawada

13/08/2026

ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్లో జరిగిన ఫైడల్ కాస్ట్రో శత జయంతి కార్యక్రమం

Address

Https://maps. App. Goo. Gl/MovrReRYWrv8faD 87
Vijayawada
520008

Alerts

Be the first to know and let us send you an email when PNM AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PNM AP:

Shortcuts

Share