CITU - Andhra Pradesh

CITU - Andhra Pradesh Official page of the Centre of Indian Trade Unions (CITU), Andhra Pradesh State Committee.
(1)

The Centre of Indian Trade Unions (CITU) is a prominent national trade union in India founded in 1970. CITU aims to protect and advance the constitutional, legal, and human rights of workers across all sectors, including industrial, agricultural, and the informal sector. It advocates for better wages and working conditions through negotiations and political activism and is affiliated with the World Federation of Trade Unions (WFTU).

28/04/2026

మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని MBVK హాల్‌లో సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.

 తేదీ : 28.04.2026ప్రచురణ / ప్రచురణార్ధం : 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి మహిళా రిజర్వేషన్ అమలుపై కేంద్...
28/04/2026



తేదీ : 28.04.2026
ప్రచురణ / ప్రచురణార్ధం :
2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి
మహిళా రిజర్వేషన్ అమలుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో మంగళవారం కా॥ కె.ధనలక్ష్మి అధ్యక్షతన విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులకు రాయభారాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుu్బరావమ్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని ఆమె గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశవ్యాప్తంగా మహిళలందరూ సుదీర్ఘకాలం పోరాడారని వామపక్ష పార్టీల ఎంపీలు పార్టీ పార్లమెంట్‌లో గళమెత్తి నినదించారని ఆమె చెప్పారు. ఈ తీర్మానంపై హాజరైన నాయకులు మాట్లాడారు.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుచేసే చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. 2024 లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుచేయాల్సి ఉండగా మోడీ ప్రభుత్వం మోకాలు ఒడ్డిందని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు, డీ లిమిటేషన్, జనాభా లెక్కలు ముడిపెట్టడం మోడీ ప్రభుత్వం కపట నాటకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి మాట్లాడుతూ అనాదిగా దేశంలో పురుషాధిక్య వ్యవస్థ రాజ్యమేలుతోందని మహిళల హక్కులు హరించబడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రితో గొంతు కలిపి మహిళలకు దక్షిణాది రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయటం తగదని ఆమె హితవు పలికారు. గత 30
ఏళ్ళుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆటంకాలు సృష్టిస్తూ మహిళాలోకాన్ని మోసగించే చర్యలను ఎన్‌డిఎ పాలకులు ఆపి తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలన్నారు.
సామాజిక కార్యకర్త కె.వసుంధర, ఐఎఫ్‌టియు నాయకులకు కె.పొలారి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకోసం జరిగే ఉధ్యమాలు, పోరాటాలలో క్షేత్రస్థాయిలో ప్రజానీకాన్ని భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాపితంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతున్నాయని కార్మిక వర్గం నిర్వహించే పోరాటాల్లో కూడా మహిళా సంఘాలు భాగస్వాములు అవుతాయని ఆమె తెలిపారు. మహిళలను వంటింటి కుందేలుగా మార్చే ఆరఎసఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని ఆమె కోరారు. కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్‌పి మనోహర్ కుమార్ లు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లులో దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలకు కూడా రిజర్వేషన్లు అమలయ్యేవిధంగా చూడాలని వారు ప్రభుత్వాలను కోరారు. జన విజ్ఞాన వేదిక నాయకులు జి.మురళిధర్, డివైఎఫఐ ప్రధాన కార్యదర్శి జి.రామన్న, ఎసఎఫఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రసన్న కుమార్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, ముజఫర్ అహమ్మద్, ఆర్.వి.నరసింహారావు, దయా రమాదేవి, రైల్వే యÖనియన్ నాయకులు వివిఎల్ నరసింహులు, అంగన్‌వాడీ యÖనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌సిహెచ్ సుప్రజ, ఫీల్డ్ అసిస్టెంట్ల యÖనియన్ రాష్ట్ర నాయకులు ఎం.హరనాధ్, సోషల్ మీడియా బాధ్యులు సుభాషిణి తదితరులు ప్రసంగించారు.
(సి.హెచ్.నరసింగరావు)
అధ్యక్షులు

(ఏ.వి.నాగేశ్వరరావు)
ప్రధాన కార్యదర్శి

మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని MBVK హాల్‌లో సిఐటియు ఆధ్...
28/04/2026

మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని MBVK హాల్‌లో సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

 తేదీ : 28.04.2026ప్రచురణ / ప్రచురణార్ధం : కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతువేతనాలు పె...
28/04/2026



తేదీ : 28.04.2026
ప్రచురణ / ప్రచురణార్ధం :
కడియం ఎపి పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు
వేతనాలు పెంచాలని, పర్మినెంట్ చెయ్యాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు కడియం యూనిట్‌లో సుమారు 15 నుండి 20 ఏళ్లుగా పనిచేస్తున్న 850 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతనాల పెంపు మరియు ఇతర డిమాండ్ పై ఏప్రిల్ 28న ఉదయం నుండి సమ్మె చేస్తున్నారు.
గత ఒప్పందం 2023 జూన్ 30తో ముగిసినప్పటికీ, యాజమాన్యం నూతన ఒప్పందం చేయడానికి నిరాకరించింది. యÖనియన్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చినందుకు కక్షతో యÖనియన్ నాయకులకు షోకాజ్ నోటీసులిచ్చి యÖనియన్ నాయకత్వాన్ని రెచ్చగొట్టింది.
రోజువారీ వేతనాన్ని రూ.300 మేర పెంచాలని, సీనియార్టీ ప్రాతిపదికన కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మికులకు 20% బోనస్ మరియు 22% ప్రొడక్షన్ బోనస్ కల్పించాలని కోరారు. వారాంతపు సెలవులకు వేతనం ఇవ్వాలని, ఓవర్ టైంకు డబుల్ వేతనం ఇవ్వాలని, క్యాంటీన్ ధరలను తగ్గించడంతో పాటు, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక వాష్ రూమ్ కల్పించాలని డిమాండ్స్ ఇచ్చారు. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల హక్కులు పరిరక్షించాలని కోరారు. వందల కోట్లు లాభాలు ఆర్జిస్తున్నా యాజమాన్యం కార్మికులకు వేతనాలు పెంచకుండా తీవ్రమైన దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము.
వీరి సమ్మెకు సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతోంది. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.
(సి.హెచ్.నరసింగరావు)
అధ్యక్షులు

(ఏ.వి.నాగేశ్వరరావు)
ప్రధాన కార్యదర్శి

విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వము, కా...
27/04/2026

విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వము, కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు.

జీతాలు తక్షణమే చెల్లించాలనే డిమాండ్‌తో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది ✊

ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ లో కాంట్రాక్టు కార్మికుల సమ్మె కు మద్దతుగా నిలిచిన CITU East Godavari District. వేతనా...
27/04/2026

ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ లో కాంట్రాక్టు కార్మికుల సమ్మె కు మద్దతుగా నిలిచిన CITU East Godavari District. వేతనాల పెంపు, స్కిల్ అప్ గ్రేడేషన్, సీనియారిటీ ఆధారంగా ట్రైనీ లు, ఓవర్ టైమ్ కు సి.ఆఫ్ కాకుండా డబల్ వేతనం తదితర డిమాండ్స్ పరిష్కారనికై సమ్మె.

సమ్మె శిబిరంలో సిఐటియ ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, కడియం పేపర్ మిల్ సిఐటియ కార్యదర్శి విద్యా సాగర్ తదితరులుపాల్గొన్నారు.


మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసే స్మార్ట్ కిచెన్ల ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఏపి మధ్య...
27/04/2026

మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసే స్మార్ట్ కిచెన్ల ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఏపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా.

27/04/2026

మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసే స్మార్ట్ కిచెన్ల ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఏపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి.

26/04/2026

వ్యవసాయ మార్కెట్ కమిటీల ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ జీతాలు, డిపార్ట్మెంట్ ద్వారా చెల్లించాలి......ఎ పి వ్యవసాయ మార్కెట్ కమిటీల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ( సి ఐ టి యు) రాష్ట్ర కమిటీ

26/04/2026

ఎ పి వ్యవసాయ మార్కెట్ కమిటీల యార్డ్స్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, వాచ్మెన్, అటెండర్, సుబాబుల్ సెక్యూరిటీ గార్డ్స్ తదితరు కేటగిరీల కార్మికులకు మినిమమ్ టైం స్కేల్ జీతాలు, డిపార్ట్మెంట్ ద్వారా చెల్లించాలి......

Address

CITU Andhra Pradesh State Office
Vijayawada
520003

Alerts

Be the first to know and let us send you an email when CITU - Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category