18/11/2023
నిన్న మధ్యాహ్నం గం.1-45 ని.లకు నూజివీడు నియోజకవర్గం పరిధిలో జరిగిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర సందర్భంగా నూజివీడు నియోజకవర్గం శాసనసభ్యులు మాన్యశ్రీమేకా వెంకట ప్రతాప్ అప్పారావు (నాయన) గారి సహకారంతో సహకార ఉద్యోగుల సమస్యలను రెండు నిమిషాలు పాటు ప్రత్యేకంగా ప్రస్తావించటం జరిగింది. గ్రేడ్ 2 ద్వితీయ శ్రేణి పరిచయ కార్యక్రమంలో ఈ వినతి పత్రం సమర్పించడం జరిగింది .
పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంపుదల చేయాలని ,ఆడిట్ రిపోర్టర్లలో అనామత్తు పద్దలలో పెడుతున్న జీతాలను తొలగించాలని, 2019 తర్వాత నియమించబడిన ఉద్యోగులను ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని , హెచ్ఆర్ పాలసీ ఉద్యోగులకు అమలుపరచాలని తదితర సమస్యలను ప్రభుత్వ ఆమోదం కొరకుపంపించారని Reference చూపించటం జరిగింది.ఈ ఫైల్ వ్యవసాయం మరియు సహకారం మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవి చౌదరి గారి దగ్గర పెండింగ్ లో ఉందని పలుమార్లు ఆయనను కలిసి సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరగా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపినామని అక్కడ నుంచి అనుమతి వచ్చిన వెంటనే జారీ చేస్తామని చెప్తున్నారని మూడు సంవత్సరములుగా హెచ్ఆర్ పాలసీ పెండింగ్లో ఉందని తెలియజేయడం జరిగింది . దీనిపై సీఎం గారి వివరణ ఇస్తూ పరిశీలించి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.మరలా ఆయన వ్యక్తిగత కార్యదర్శి భరత్ గుప్తా గారికి పూర్తిగా వివరించమని పంపించడం జరిగింది ఆయన వివరాలు సేకరించి సీఎం ఓ ఆఫీస్ నుండి ఆ ఫైలు పరిశీలించి ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి ఈ సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తామని తెలియజేశారు. మన వినతి పత్రంపై నూజివీడుకు నియోజకవర్గ శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు లెటర్ హెడ్ పై మన సమస్యలు తప్పక పరిష్కరించాలని సిఫార్సు చేస్తూ ఎండార్స్మెంట్ లెటర్ జత పరచటం వలన అంత సమయం కేటాయించటం జరిగింది.
ఇందుకు సహకరించిన నియోజకవర్గ శాసనసభ్యులు మాన్యశ్రీ మేకా వెంకట ప్రతాప్ ప్రతాప్ అప్పారావు గారికి ఏపీ పాక్స్ ఎంప్లాయిస్ రాష్ట్ర అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము.
సదా ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడే...
మీ
నీలంనాగేశ్వరరావు.