Good Samaritan Seva Trust . NGO

Good Samaritan Seva Trust . NGO Good Samaritan Seva Trust is a Government Registered, non-religious, non political organization work

🤝 ⚫ 2 కిడ్నీలు కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా గుడ్ సమారిటన్ సేవ ట్రస్ట్.⚫ ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్...
19/06/2025

🤝 ⚫ 2 కిడ్నీలు కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా గుడ్ సమారిటన్ సేవ ట్రస్ట్.

⚫ ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్న ట్రస్ట్ వ్యవస్థాపకులు చిట్టేలు కోటేశ్వరరావు- చిట్టేలు హరీష్ .

- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాఘవపురం గ్రామం, చింతలపూడి మండలం వాస్తవ్యులు ..
తమ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేయించుకుంటూ ఆర్దికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు..
పనులు చేసుకోలేక, తినడానికి డబ్బులు లేక, పిల్లలను చదివించే స్తోమత లేక,చాలా సంవత్సరాలనుండి ఇబ్బందులు పడుతున్నారు.
వీరి పరిస్థితి తెలిసి సహాయం చెయ్యాలనే సంకల్పంతో *గుడ్ సమారిటన్ సేవ ట్రస్ట్* టీమ్ వారి ఊరికి వెళ్లి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. వీరు వంటవండుకొని తినడానికి ఇంట్లో సరుకులు కూడా లేవు.
నిత్యావసర సరుకులు మనం ఇవ్వగలిగితే, వీరికి భోజనం పెట్టిన వాళ్ళము అవుతాము.బాబు:-7 వ తరగతి..
పాప :- 4వ తరగతి.
పిల్లలు చదువు దగ్గరనుండి,భోజనం, ఇతర అవసరాల వరకు, వారి బరువు బాధ్యతలు మొత్తం గుడ్ సమారిటన్ సేవ ట్రస్ట్ చూసుకుంటుందని గతంలో వ్యవస్థాపకులు చిట్టేలు.కోటేశ్వరరావు, హరీష్ గార్లు మాటఇచ్చారు. అన్నమాట ప్రకారం పిల్లలు ఇద్దరినీ స్కూలులో, హాస్టల్ లో, చేర్పించారు. వారికి కావలసిన నిత్యావసర సరుకులు, హాస్టల్ కి కావలసిన వస్తువులు, బుక్స్, డ్రెస్, కొనిచ్చి వారి ఉదరస్వభావన్ని చాటుకున్నారు. ఎవరైన దాతలు ముందుకు వచ్చి సపోర్ట్ ఇవ్వగలిగితే మరెంతో మంది నిరుపేదలకు విద్యను అందించే దిశగా ముందుకు వెళతామని ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన తోట.అంజి గారికి, బత్తుల. కళావతి గారికి, ట్రస్ట్ తరపున హృదయపూర్వక ధన్యవదములుతెలిపారు. ఈ కార్యక్రమములో చిట్టేలు. మౌనిక, అన్నపూర్ణ, పలువురు పాల్గొన్నారు.

GS Seva Trust Ngo Good Samaritan Seva Trust . NGO Harish Chittelu Chittelu Koteswar Naidu

Happy Sankranti To You All My Beloved Friends 💐
13/01/2025

Happy Sankranti To You All My Beloved Friends 💐

* వరద బాధితుల సహాయక చర్యలు *వరద బాధితుల సహాయక చర్యల్లో భాగంగా, వరదల వల్ల నిరాశ్రయులైన మానసిక మరియు శారీరక వికలాంగ బాలబాల...
07/09/2024

* వరద బాధితుల సహాయక చర్యలు *

వరద బాధితుల సహాయక చర్యల్లో భాగంగా, వరదల వల్ల నిరాశ్రయులైన మానసిక మరియు శారీరక వికలాంగ బాలబాలికలకు దుప్పట్లు మరియు క్లీనింగ్ వస్తువులు BCY పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి ముప్పసాని భూలక్ష్మి గారితో కలిసి పంచటం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

:- చిట్టేలు కోటేష్ - చిట్టేలు హరీష్
వ్యవస్థాపకులు, గుడ్ సమారిటన్ సేవా ట్రస్టు.
Harish Naidu Chittelu Chittelu Koteswar Naidu GS Seva Trust Ngo

*We are so glad to be invited to Adam Telugu news channel's Anniversary.* *గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్* ఇంత ఎదగటానికి ప్రధ...
27/08/2024

*We are so glad to be invited to Adam Telugu news channel's Anniversary.*

*గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్* ఇంత ఎదగటానికి ప్రధాన కారణం దేవుని కృప, ట్రస్ట్ సభ్యుల యెుక్క సహకారం మరియు స్పాన్సర్ యొక్క సేవా గుణం. ఈ సందర్భoగా మీ అందరికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ , మీ అందరి తరపున ఈ వార్షికోత్సవ వేడుకలకు అటెంట్ అవుతూ , మన అందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియపరచుటకు సంతోషిస్తున్నాను..

:- *మీ చిట్టేలు కోటేశ్ - చిట్టేలు హరీష్*
*వ్యవస్థాపకులు, గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్.*

💐 " Good Samaritan Seva Trust now in Hyderabad also.." 🫱🫲 .. 🤝*హైదరాబాద్ దివ్యాంగులకు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ చేయూత*హై...
01/07/2024

💐 " Good Samaritan Seva Trust now in Hyderabad also.." 🫱🫲 .. 🤝

*హైదరాబాద్ దివ్యాంగులకు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ చేయూత*

హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లోని నిర్మాణ్ హోమ్ లో నివసిస్తున్న మానసిక మరియు శారీరిక వికలాంగ బాలురకు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులైన చిట్టేలు కోటేశ్వరరావు - చిట్టేలు హరీష్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందచేయటం జరిగింది. ట్రస్ట్ వ్యవస్థాపకులైన చిట్టేలు హరీష్ స్నేహితుల ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆపదలో వున్నవారిని ఆదుకోవాలనే ధ్యేయంతో గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ అనే స్వచ్చంధ సేవా సంస్థ ని స్థాపించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో సేవలు అందించటం జరిగిందనీ, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడ తమ సేవల్ని ప్రారంభించటం చాలా సంతోషంగా వుందని పేర్కోన్నారు. మేము ఈ సంస్థ ద్వారా ఎన్నో వందలమందికి సేవ చేయగలుగుతున్నాము అంటే దానికి తన స్నేహితుల ప్రోత్సాహం కూడా ఎంతో వుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిట్టేలు కోటేశ్వరరావు - మౌనిక, మాస్టర్ సుకుమార్, హరీష్ చిట్టేలు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

"గుడ్ సమారిటన్ సేవా ట్రస్ట్ - ఫుడ్ బ్యాంకు" ద్వారా పేద వలస కూలీలకు, నిరాశ్రయులకు ఆహార పంపిణీ..మైలవరం నియోజకవర్గం ఇబ్రహీం...
19/12/2023

"గుడ్ సమారిటన్ సేవా ట్రస్ట్ - ఫుడ్ బ్యాంకు" ద్వారా పేద వలస కూలీలకు, నిరాశ్రయులకు ఆహార పంపిణీ..

మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం లోని గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులైన చిట్టేలు కోటేశ్వరరావు - చిట్టేలు హరీష్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇబ్రహీంపట్నం వాస్తవ్యులు చిట్టేలు అప్పారావు (లేటు)- నిర్మల గార్ల మనువడు చిట్టేలు రమేష్ -సౌజన్య దంపతుల ఏకైక కుమారుడు అయినటువంటి "అయాన్" అన్నప్రాసన వేడుక బయెర్షబా చర్చ్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విందు ఏర్పాటు చేయటం జరిగింది. మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా, కుటుంబసభ్యులు అందరూ కలిసి ఫెర్రి కృష్ణా నది ఒడ్డున గుడారాలలో నివసిస్తున్న పేద వలస ప్రజలకు పంచటం జరిగింది.

ఈ కార్యక్రమంలో చవల ఉదయ భాస్కర్ - మల్లీశ్వరి, శశి, తేజేష్, చెల్లు మల్లీశ్వరి, హర్షిత శ్రీ తదితరులు పాల్గొనటం జరిగింది.

"గుడ్ సమారిటన్ సేవా ట్రస్ట్ - ఫుడ్ బ్యాంకు" ద్వారా పేద వలస కూలీలకు, నిరాశ్రయులకు ఆహార పంపిణీ..మైలవరం నియోజకవర్గం ఇబ్రహీం...
01/12/2023

"గుడ్ సమారిటన్ సేవా ట్రస్ట్ - ఫుడ్ బ్యాంకు" ద్వారా పేద వలస కూలీలకు, నిరాశ్రయులకు ఆహార పంపిణీ..

మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం లోని గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులైన చిట్టేలు కోటేశ్వరరావు - చిట్టేలు హరీష్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇబ్రహీంపట్నం వాస్తవ్యులు చిట్టేలు అప్పారావు (లేటు)- నిర్మల గార్ల మనువడు చిట్టేలు రమేష్ -సౌజన్య దంపతుల ఏకైక కుమారుడు అయినటువంటి "అయాన్" అన్నప్రాసన వేడుక బయెర్షబా చర్చ్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విందు ఏర్పాటు చేయటం జరిగింది. మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా, కుటుంబసభ్యులు అందరూ కలిసి ఫెర్రి కృష్ణా నది ఒడ్డున గుడారాలలో నివసిస్తున్న పేద వలస ప్రజలకు పంచటం జరిగింది.

ఈ కార్యక్రమంలో చవల ఉదయ భాస్కర్ - మల్లీశ్వరి, శశి, తేజేష్, చెల్లు మల్లీశ్వరి, హర్షిత శ్రీ తదితరులు పాల్గొనటం జరిగింది.

🥹🙏 Kindly Inform To Us Plzzz... ఇటువంటి ఆకలి చావులు మళ్ళీ వినకూడదు. ఇలాంటివి జరగకూడదు అని మీరు నిర్ణయించుకున్నట్లయితే, మ...
24/11/2023

🥹🙏 Kindly Inform To Us Plzzz...
ఇటువంటి ఆకలి చావులు మళ్ళీ వినకూడదు. ఇలాంటివి జరగకూడదు అని మీరు నిర్ణయించుకున్నట్లయితే, మీ సమీపంలో నివసిస్తున్న లేదా మీకు తెలిసిన వారిలో ఎవరైనాసరే ఇటువంటి పరిస్తుతుల్లో వున్నారని తెలిసిన వెంటనే మమ్మల్ని సంప్రదించవలసిందిగా వేడుకొంటున్నాము 🙏.

ఇట్లు
గుడ్ సమరిటన్ సేవ ట్రస్ట్
93980 62162 & 98849 25717
చిట్టేలు కోటేష్ - చిట్టేలు హరీష్
(వ్యవస్థాపకులు )

మీరు కలలు కన్న జీవితం - దీపావళి వెలుగులా అభివృద్ధి చెందాలని కోరుకుంటూమీకు, మీ కుటుంబ సభ్యులకుదీపావళి శుభాకాంక్షలు..!:- మ...
12/11/2023

మీరు కలలు కన్న జీవితం - దీపావళి వెలుగులా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు..!

:- మీ సహోదరులు,
చిట్టేలు కోటేశ్వరరావు - చిట్టేలు హరీష్
( వ్యవస్థాపకులు, గుడ్ సమరిటన్ సేవ ట్రస్ట్ )

Address

D. No :/17-59, Sivalayam Opp Street, Ferry, Ibrahimpatnam
Vijayawada
521456

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+919398062162

Website

Alerts

Be the first to know and let us send you an email when Good Samaritan Seva Trust . NGO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Good Samaritan Seva Trust . NGO:

Share