Ambedkar's India Mission

Ambedkar's India Mission దళితుల హక్కుల ఉద్యమం · ప్రతి దళితవాడకు ప్రత్యేక పంచాయతీ, ఏటా ₹2 కోట్లు · నాయకత్వం: శ్రీ పి.వి. సునీల్ కుమార్ IPS

జాబితాలో పేరు లేకపోతే, మన దళితవాడ ఓటు ఒకటి తగ్గినట్టే.ఓటు శక్తి | ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఈ రోజే చెక్ చేయండి — మ...
14/10/2026

జాబితాలో పేరు లేకపోతే, మన దళితవాడ ఓటు ఒకటి తగ్గినట్టే.

ఓటు శక్తి | ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఈ రోజే చెక్ చేయండి — మీది, మీ ఇంట్లో పెద్దలది, కొత్తగా 18 ఏళ్లు నిండిన వాళ్లది.

✔ voters.eci.gov.in లో మీ పేరు, మీ ఇంట్లో వాళ్ల పేర్లు వెతకండి
✔ సందేహం ఉంటే ఓటర్ హెల్ప్‌లైన్ 1950 కి కాల్ చేయండి (మీ STD కోడ్‌తో, ఉచితం)
✔ ECINet యాప్‌లో మీ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) తో కాల్ బుక్ చేసుకోవచ్చు
✔ 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు ఫారం 6 తో నమోదు చేసుకోవాలి
ఆధారం: భారత ఎన్నికల సంఘం (PIB, 4 నవంబర్ 2025) · ecisveep.nic.in

జాబితాలో ఉన్న ప్రతి ఓటు ఒక ప్రశ్న: "మా దళితవాడకు ప్రత్యేక పంచాయతీ హోదా ఇస్తారా?"

దళితవాడ ప్రత్యేక పంచాయతీ అయితే:
✔ సొంత గ్రామ సభ: దళితవాడ ఓటర్లందరూ సభ్యులు. మన సమస్యలు మన సభలోనే చర్చ, మన పనుల ప్రణాళికకు మన సభ ఆమోదం.
✔ ఒక్క నోటిఫికేషన్ చాలు — దళితవాడ ప్రత్యేక పంచాయతీ అవుతుంది (ఏపీ పంచాయతీ రాజ్ చట్టం, సెక్షన్ 3).

శ్రీ పి.వి. సునీల్ కుమార్ గారి నాయకత్వంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ డిమాండ్:
✔ ప్రతి దళితవాడకు ప్రత్యేక పంచాయతీ హోదా
✔ ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్ నిధుల నుండి ప్రతి దళిత పంచాయతీకి ఏటా ₹2 కోట్లు

ఈ పోస్ట్‌ను మీ దళితవాడ WhatsApp గ్రూప్‌లో షేర్ చేయండి — ఒక్కరి పేరు జాబితాలో చేరినా అది మన గెలుపే.

మన దళితవాడ... మన పంచాయతీ. జై భీమ్.
Instagram లో PVSK గారిని ఫాలో అవ్వండి: instagram.com/pvsk_revolution
#ఓటుశక్తి #దళితవాడపంచాయతీ

13/10/2026

ప్రభుత్వం చేయాల్సిన 4 పనులు: అందరికీ విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగ/వ్యాపార అవకాశాలు, శాంతిభద్రతలు.

అడగడం మన హక్కు.

శ్రీ పి.వి. సునీల్ కుమార్ గారు (I.P.S., మాజీ డీజీపీ), అమలాపురం సభ, 9 అక్టోబర్ 2026.

#ఓటుశక్తి

🔔 దళితవాడల సమస్యలు, పరిష్కారాలు రోజూ — ఈ పేజీని ఫాలో అవ్వండి

13/10/2026

"మీరు అడిగేది ఎలాంటి తప్పు కూడా లేదు... మనిషి అనేవాడు ఎవరైనా సరే అడిగేటువంటి కనీస హక్కులు మాత్రమే మీరు అడుగుతున్నారు."

15 ఏళ్ల సేవ తర్వాత క్రమబద్ధీకరణ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోరుతున్న పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు AIM సంఘీభావం.

వారి డిమాండ్లు: క్రమబద్ధీకరణ · రెగ్యులర్ అయ్యేవరకు 100% గ్రాస్ శాలరీ · హెల్త్ కార్డులు, EPF · ఉద్యోగ భద్రత.

శ్రీ పి.వి. సునీల్ కుమార్ గారు (I.P.S., మాజీ డీజీపీ), పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా, అమలాపురం | 9 అక్టోబర్ 2026.

🔔 దళితవాడల సమస్యలు, పరిష్కారాలు రోజూ — ఈ పేజీని ఫాలో అవ్వండి

#పారామెడికల్ #సమానపనికిసమానవేతనం

13/10/2026

యువత లేస్తే... దళితవాడ గెలుస్తుంది 🎙️

అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు మీసాల జయరాజు గారి సందేశం — ఉద్యమంలో యువత బాధ్యత, మనం చేయాల్సిన పని.

మన డిమాండ్: ప్రతి దళితవాడకు ప్రత్యేక పంచాయతీ హోదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ — రెండు రాష్ట్రాల దళితవాడలకూ స్వయం పాలనే దారి.

పూర్తిగా చూడండి, మీ దళితవాడ యువతకు పంపండి. మీ దళితవాడ పేరు, మండలం కామెంట్ చేయండి 👇

🔔 దళితవాడల సమస్యలు, పరిష్కారాలు రోజూ — ఈ పేజీని ఫాలో అవ్వండి

#దళితవాడ

13/10/2026

రిజర్వేషన్ ఇస్తున్నాం, అధికారం ఇస్తున్నాం — మీకొచ్చే ఇబ్బంది ఏంటి?

రిజర్వేషన్ల మీద 2024లో ఒక సభలో శ్రీ పి.వి. సునీల్ కుమార్ గారు మాట్లాడిన మాటలు.

ప్రతి దళితవాడకు ప్రత్యేక పంచాయతీ హోదా కావాలి — ఇది ప్రతి దళితుడి హక్కు. ఏటా మాకు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్ ₹20,000 కోట్ల నిధుల నుండి ప్రతి దళిత పంచాయతీకి ₹2 కోట్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలి.

ఈ వీడియోని మీ గ్రూపుల్లో షేర్ చేయండి 🙏



🔔 'Ambedkar's India Mission' పేజీని ఫాలో అవ్వండి — మన దళితవాడ... మన పంచాయతీ ఉద్యమం వార్తలు మొదట ఇక్కడే

12/10/2026

మీ ఎమ్మెల్యే, ఎంపీని ఒక్క ప్రశ్న అడగండి: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాకు మీ మద్దతు ఉందా?

ఈ ప్రశ్న ఎందుకు?
✔ రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు, 1950 — 3వ పేరా: హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతం ఆచరించే వ్యక్తిని షెడ్యూల్డ్ కులం సభ్యుడిగా పరిగణించరు.
✔ 1950లో ఈ హోదా హిందువులకు మాత్రమే. 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులను చేర్చుతూ ఈ ఉత్తర్వును సవరించారు.
✔ 1950 ఉత్తర్వులోని 3వ పేరా రాజ్యాంగబద్ధతపై సవాల్ 2004 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
(ఆధారం: సామాజిక న్యాయ శాఖ — 1950 ఉత్తర్వు; సుప్రీంకోర్టు తీర్పు, 24 మార్చి 2026; SC Observer; Scroll, 11 జూన్ 2026)

మతం మారినంత మాత్రాన కుల వివక్ష మారదు — హక్కులు సమానంగా ఉండాలి.
శ్రీ పి.వి. సునీల్ కుమార్ గారి నాయకత్వంలో AIM డిమాండ్: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి — 1950 ఎస్సీ ఉత్తర్వులోని 3వ పేరాను సవరించాలి.

ఓటు అడగడానికి ఎవరు వచ్చినా — ప్రతి ప్రజాప్రతినిధినీ — ఇదే ప్రశ్న అడగండి.
సమాన హక్కుల కోసం AIM ఉద్యమంలో చేరండి — ఈ పోస్ట్‌ను మీ గ్రూపులకు షేర్ చేయండి.
#దళితక్రైస్తవులు #ఎస్సీహోదా #సమానహక్కు

🔔 దళితవాడల సమస్యలు, పరిష్కారాలు రోజూ — ఈ పేజీని ఫాలో అవ్వండి

12/10/2026

"నాకు ఎవ్వరి టికెట్ అక్కర్లేదు. నాకు కావాల్సింది దళితవాడ పంచాయతీ."

మా నిధులు మాకు, హాస్టళ్లలో మా పిల్లలకు సౌకర్యాలు: ఇవే AIM అడుగుతున్నది.

శ్రీ పి.వి. సునీల్ కుమార్ గారు (I.P.S., మాజీ డీజీపీ), అమలాపురం సభ, 9 అక్టోబర్ 2026.

#దళితవాడపంచాయతీ

🔔 దళితవాడల సమస్యలు, పరిష్కారాలు రోజూ — ఈ పేజీని ఫాలో అవ్వండి

12/10/2026

"న్యాయబద్ధమైన కోరికల కోసం పోరాటం చేసే హక్కు మీకు... ఎవరూ కూడా భయపడొద్దు."

షోకాజ్ నోటీసులు అందుకున్న పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు AIM అండ.

వారి డిమాండ్లు: క్రమబద్ధీకరణ · రెగ్యులర్ అయ్యేవరకు 100% గ్రాస్ శాలరీ · హెల్త్ కార్డులు, EPF · ఉద్యోగ భద్రత.

శ్రీ పి.వి. సునీల్ కుమార్ గారు (I.P.S., మాజీ డీజీపీ), పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా, అమలాపురం | 9 అక్టోబర్ 2026.

🔔 దళితవాడల సమస్యలు, పరిష్కారాలు రోజూ — ఈ పేజీని ఫాలో అవ్వండి

#పారామెడికల్ #సమానపనికిసమానవేతనం

12/10/2026

రాధ మనోహర్ దాస్ గాడి నిజ స్వరూపం తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.. #

🌸💐 అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు 💐🌸బాలికలే భావి భారత భవిష్యత్తు! 💗ప్రతి బాలికకు నాణ్యమైన విద్య, సమాన హక్కులు, ...
11/10/2026

🌸💐 అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు 💐🌸

బాలికలే భావి భారత భవిష్యత్తు! 💗

ప్రతి బాలికకు నాణ్యమైన విద్య, సమాన హక్కులు, ఆత్మగౌరవం, భద్రతతో కూడిన జీవితం అందాలి. బాలికలు తమ కలలను సాకారం చేసుకుంటూ, అన్ని రంగాల్లో విజయాలు సాధించేలా సమాజం ప్రోత్సహించాలి.

బాలికలను గౌరవిద్దాం… బాలికల హక్కులను కాపాడుదాం… సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మిద్దాం!

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల బాలికలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐

ఇట్లు,
మాన్య శ్రీ పి.వి. సునీల్ కుమార్ IPS గారు
వ్యవస్థాపక అధ్యక్షులు
అంబేడ్కర్ ఇండియా మిషన్ (AIM)

#బాలికలదినోత్సవం

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Ambedkar's India Mission posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ambedkar's India Mission:

Shortcuts

Share