ROYAL Service TRUST

ROYAL Service TRUST "Educate, Empower, Encompass and Enrich to Build a better Tommorrow". To bring awareness about environmental protection, public health and sanitation.

"It`s about being humble,being able to share ourselves and touch the lives of the community". To encourage and ensure equitable education for all irrespective of gender
To identify the potential youth and help them to realize their dreams by imparting knowledge with 21st century skills. To create an environment and establishment that takes care of Senior citizens, disabled and homeless. To promot

e brotherhood and well being of the community for social and economic progress. To develop leaders who will make a difference in the community.

03/01/2026
28/08/2025

రాయల్ సర్వీస్ ట్రస్ట్ విజయవాడ ద్వారా 2025 -26 విద్యా సంవత్సరానికి గాను ఆర్ధికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో స్కాలర్షిప్స్ మంజూరు చేయాలనీ ట్రస్ట్ పాలకమండలి నిర్ణయించింది.

కావున 60 % మార్కులతో ఉత్తీర్ణులైన ఇంటర్మీడియట్ , వివిధ డిగ్రీ ఆపై కోర్సులను చదువుచున్న అర్హులైన విద్యార్థులు , ట్రస్ట్ నిర్ధేశించిన నమూనాలో తమ దరఖాస్తులను ది 15 -9 -2025 లోపుగా స్వయంగా గాని , పోస్ట్ ద్వారా గాని దిగువ పేర్కొన్న అడ్రస్ కు చేరునట్లు పంపవలెను.

రాయల్ సర్వీస్ ట్రస్ట్
(వర్కింగ్ ఆఫీస్ )
A 4 సత్నం అపార్ట్మెంట్
గురుద్వార్ రోడ్,
గురునానక్ నగర్ కాలనీ
విజయవాడ -520008

ఆఖరు తేదీ ది 15 -9 -2025 తరువాత చేరిన దరఖాస్తులు పరిశీలింపబడవు .ప్రభుత్వ మరియు ఎయిడెడ్ విద్యాసంస్థలలో చదివిన మరియు చదువుతున్న విద్యార్హులకు ప్రాధాన్యత ఇవ్వబడును.ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవు. ఎంపికైన విద్యార్థులకు ముందుగా సమాచారం ఇవ్వబడుతుంది.

ఇట్లు
శీతాళం రాంబాబు , చైర్మన్ (7989460929 )
తోట పద్మనాభరావు , కార్యదర్శి (9848130189 )
అంకం రామ సాయి ప్రసాద్, కోశాధికారి (9828282354 )
రాయల్ సర్వీస్ ట్రస్ట్, విజయవాడ

గమనిక

విద్యాభివృద్ధికి మెరిట్ విద్యార్థుల పురోభివృద్ధికి దాతలు ఇచ్చే విరాళాలను ఈ క్రింది బ్యాంకు అకౌంట్ కి పంపి విద్యార్థులకు చేయూత ఇవ్వవలసినదిగా విన్నపము.మీరు ఇచ్చే విరాళాలపై ఇన్కమ్ టాక్స్ చట్టం సెక్షన్ 80 జి ప్రకారం 50 % ఆదాయపు పన్ను మినహాయింపు కలదు.

బ్యాంకు అకౌంట్ వివరాలు ;
రాయల్ సర్వీస్ ట్రస్ట్
కెనరా బ్యాంకు
ఎన్టీఆర్ సర్కిల్ బ్రాంచ్ , విజయవాడ
ఎస్ బి అకౌంట్ నెంబర్;37512010024939
IFSC కోడ్ : CNRB 0013751

02/10/2024

డియర్ రాయల్స్
ది 29-9-2024 వ తేదీన జరిగిన మన రాయల్ సర్వీస్ ట్రస్ట్ వార్షిక సర్వ సభ్య సమావేశం లో 2024-26 సంవత్సరములకు మన ట్రస్ట్ పాలక మండలి నూతన ఆఫీస్ బేరర్స్ గా

రాయల్ సీతాళం రాంబాబు, చైర్మన్
రాయల్ గునుకుల పుల్లయ్య, వైస్ చైర్మన్
రాయల్ ఈమని దామోదర రావు, వైస్ చైర్మన్
రాయల్ తోట పద్మనాభ రావు, కార్యదర్శి
రాయల్ తిక్కిశెట్టి నాగభూషణం, సహాయకార్యదర్శి
రాయల్ అంకెం రామ సాయిప్రసాద్, కోశాధికారి
రాయల్ సాగి కోటేశ్వరరావు, సహాయ కోశాధికారి గా ఎన్నికయినట్లు తెలియచేయటానికి సంతోషిస్తున్నాం.
ఇట్లు
పెటేటి పుల్లయ్య
గుండపు చంద్రశేఖర్
గాజుల రామారావు
రాయల్ సర్వీస్ ట్రస్ట్

16/12/2023
మన రాయల్ సర్వీస్ ట్రస్ట్ పిలుపు కు స్పందించి, ఈ సంవత్సరం నీట్ పరీక్ష లో ఉత్తమ ర్యాంక్ పొంది, సిధార్థ మెడికల్ కాలేజీ లో అ...
18/11/2023

మన రాయల్ సర్వీస్ ట్రస్ట్ పిలుపు కు స్పందించి,
ఈ సంవత్సరం నీట్ పరీక్ష లో ఉత్తమ ర్యాంక్ పొంది, సిధార్థ మెడికల్ కాలేజీ లో అడ్మిషన్ పొందిన ఒక మెడిసిన్ (MBBS) విద్యార్థి కి కోర్స్ పూర్తి అయ్యేవరకు(5 సంవత్సరాలు ) స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారావేత్త, వింటెక్ వాటర్ ప్లాంట్ అధినేత రాయల్ కొప్పినేని శీతయ్య గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు రాయల్ సర్వీస్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాం.

పేటేటి పుల్లయ్య
చైర్మన్

గుండపు చంద్రశేఖర్
కార్యదర్శి

గాజుల రామారావు
కోశాధికారి
రాయల్ సర్వీస్ ట్రస్ట్
విజయవాడ

మన రాయల్ సర్వీస్ ట్రస్ట్ పిలుపు కు స్పందించి ఇప్పటికే ఒక మెడిసిన్ (MBBS) విద్యార్థిని కి మొత్తం కోర్స్ కి స్పాన్సర్ చేసి...
07/11/2023

మన రాయల్ సర్వీస్ ట్రస్ట్ పిలుపు కు స్పందించి ఇప్పటికే ఒక మెడిసిన్ (MBBS) విద్యార్థిని కి మొత్తం కోర్స్ కి స్పాన్సర్ చేసినారు. ఆ విద్యార్థిని ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తుంది.
ఆ విద్యార్థిని కోర్స్ పూర్తి కావటం వలన ఇప్పుడు మరో విద్యార్థి కి స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన శ్రీ కుప్పాల శ్రీనివాస్ గారికి రాయల్ సర్వీస్ ట్రస్ట్ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలుతెలియచేస్తున్నాం.

కీ. శే. కుప్పాల బుల్లి స్వామినాయుడు గారు లెక్కలు మాస్టారు గా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సుప్రసిద్ధులు. వారు ప్రతిభ గల విద్యార్థుల ను గుర్తించి ప్రోత్సహించే వారు. అందులో ఎవరైనా ఆర్ధికంగా వెనుక బడిన వారుంటే వారే ఆర్ధిక సహాయం చేసేవారు.వారు ఇచ్చిన ప్రోత్సాహం తో వారి శిష్యులు ఎంతో మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గా ఉద్యోగులుగా స్థిరపడ్డారు.
ఇటీవల నేను బుల్లి స్వామినాయుడు గారి సంస్మరణ కార్యక్రమం లో పాల్గొన్నప్పుడు వారి సహాధ్యాయులు, శిష్యులు కీ. శే.నాయుడు గారి గురించి చెప్పిన వాటిలో వారి మాటల సారాంశాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్థావించాను.

అలాంటి తండ్రి కి వారసుడైన మన రాయల్ కుప్పాల శ్రీనివాస్ గారు తండ్రి అడుగుజాడల్లో వారి ఆశయాల ను కొనసాగిస్తూ.... వ్యాపార రీత్యా చెన్నై లో స్థిరపడినా ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు కు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీనివాస్ గారికి మరొక్క సారి హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

పేటేటి పుల్లయ్య
చైర్మన్, రాయల్ సర్వీస్ ట్రస్ట్
విజయవాడ

కొలుసు వెంకట కళ్యాణ్ కి  ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం 25,000/- విరాళం రాయల్ సర్వీస్ ట్రస్ట్ తరఫున వారి తల్లిదండ్రులకు ...
03/10/2023

కొలుసు వెంకట కళ్యాణ్ కి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం 25,000/- విరాళం రాయల్ సర్వీస్ ట్రస్ట్ తరఫున వారి తల్లిదండ్రులకు 2-10-2023 వ తేదీ న అందజేయడం జరిగింది🙏

ప్రియమైన సోదర/ సోదరీమణులకు మన రాయల్ సర్వీస్ ట్రస్ట్  ప్రధాన ఆశయం మన సమాజంలోని ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్...
01/10/2023

ప్రియమైన సోదర/ సోదరీమణులకు

మన రాయల్ సర్వీస్ ట్రస్ట్ ప్రధాన ఆశయం మన సమాజంలోని ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్ధులకు వారి విద్యాభివృద్దికి సహకరించటమనే విషయం మీకు తెలిసినదే
ఈ ప్రధాన ఆశయానికి అనుగుణంగా మనము గత ఐదు సంవత్సరాలనుండి ఆర్ధికంగా వెనుకబడిన ప్రతిభవంతులైన విద్యార్థులకు 35,00,000/- రూపాయలు పైగా స్కాలర్షిఫ్స్ అందచేశాము. ముగ్గురు విద్యార్థిని లను దత్తత తీసుకుని మనమే వారికి పూర్తి ఫీజులు చెల్లెస్తున్నాం. ఇందులో ఇద్దరు మెడిసిన్ (MBBS ) మరొకరు ఇంజనీరింగ్ (B. Tech CSE) చదువుచున్నారు.

ఈ విద్యాసంవత్సరం (2023-24 ) ప్రారంభమయి నది కనుక గత ఐదు సంవత్సరం ల మాదిరిగానే ఈ విద్యాసంవత్సరంలో కూడా వారికి తోడ్పాటు అందించ వలసిన బాధ్యత తో పాటు మరికొంత మందికి అదనంగా సహాయం చేయ వలసిన బాధ్యత మనపై ఉన్నది. ఈ సంవత్సరం కూడా ఉపకార వేతనములు పంపిణీ చేయవలెనని ట్రస్ట్ పాలక కమిటీ నిర్ణయించింది.
ట్రస్ట్ పాలక కమిటీ నిర్ణయానికి అనుగుణంగా విద్యార్థులు స్కాలర్షిప్ పొందుటకు దరఖాస్తు చేసుకునే గడువు సెప్టెంబర్ 30 వ తేది తో ముగిసినది. వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి అక్టోబర్ లో నే మనం స్కాలర్షిప్స్ పంపిణీ చేయవలసి ఉన్నది.

కావున పైన తెలియచేసిన ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుటకు మీ సహాయసహకారములను అభ్యర్ధిస్తున్నాం.

మీరు అందచేసే విరాళములు ఈ క్రింద బ్యాంకు అకౌంటుకు జమచేసి, మీ అడ్రసు మరియు పాన్ నంబరు / ఆధార్ వివరాలను ఈ క్రింద ఇచ్చిన మొబైల్ నంబర్లకు వాట్సప్ ద్వారా తెలియ చేయ వలసినదిగా మనవి
మీరు అందచేసే విరాళములకు 50% ఆదాయపు పన్ను మినహాయింపు (80G) కలదు

మీ విరాళములను :
రాయల్ సర్వీస్ ట్రస్ట్
కెనరాబాంకు
పటమట
విజయవాడ
SB A/c No. 37512010024939
IFSC: CNRB0013751
లేదా బ్యాంకు క్యూఆర్ కోడ్ ఉపయోగించ వచ్చు

ఇట్లు
Rl. పేటేటి పుల్లయ్య, చైర్మన్
9948199455
Rl. గుండపు చంద్రశేఖర్, కార్యదర్శి 9246471029
Rl. గాజుల రామారావు, కోశాధికారి 9985846122
రాయల్ సర్వీస్ ట్రస్ట్

రాయల్ సర్వీస్ ట్రస్ట్  సర్వసభ్య సమావేశం ( హోటల్ హయ్యత్ ప్లేస్, విజయవాడ) లో "బడే ప్రసాదరావు మెమోరియల్ రాయల్ మెరిటోరియస్ స...
31/08/2023

రాయల్ సర్వీస్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం ( హోటల్ హయ్యత్ ప్లేస్, విజయవాడ) లో "బడే ప్రసాదరావు మెమోరియల్ రాయల్ మెరిటోరియస్ స్టూడెంట్ " అవార్డు తో పాటు గా విద్యార్థినికి 10,000/- రూపాయలు చెక్కు ను అందచేస్తున్న ఏపీ కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్ కృష్ణ మూర్తి, యువ పారిశ్రామిక వేత్త శ్రీ బొండాడ రాఘవేంద్ర రావు తదితరులు...

Address

Vijayawada Buckinghampet

Alerts

Be the first to know and let us send you an email when ROYAL Service TRUST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ROYAL Service TRUST:

Share