Aryavysya

Aryavysya Arya Vysya Digital Magazine is a community information magazine for future generation to know ancestors credentials.

Celebrating my 5th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
20/12/2024

Celebrating my 5th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

31/10/2024

దీపావళి రామాయణ కాలం నాటిదా లేక భారతం కాలం నాటిదా. ఏ కాలం నాటిదైనా దుష్ట శిక్షణ జరిగి, శిష్ట రక్షణ జరిగింది కనుక ఆ సందర్భంగా ప్రజల మధ్య, ప్రజా జీవనం మధ్య జరిగే వెలుగుల పండుగే ఈ దీపావళి. రావణుని రాముడిని సంహరించిన సందర్భంగా ఉత్తర భారతీయులు దీపావళి జరుపుకుంటుంటే, మరికొందరు నరకాసురిని సంహరించిన సందర్భంగా దక్షిణాదిన ఈ పండుగ జరుపుకోవటం పరిపాటి. ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేట ఈ చిరుదివ్వెలు చూచి చుక్కలనుకుంటారో ఎంత మంచి భావన. దేవతలు మన వెలుగులు చుక్కలనుకుంటే, మనమేమో ఆకాశాన ఉన్న వెలుగులు చుక్కలనుకుంటున్నాం. అమావాస్య రోజున జరుపుకునే వెలుగుల పండుగ మన జీవితాలలో కూడా ఉండాలని వాసవీ ఫౌండేషన్ టీం సభ్యులందరూ ఆశిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు. శుభం భూయాత్.

27/10/2024

కూర్చుండ మా యింట కురిచీలు లేవు, ప్రణయాంకమే సిద్ధపరుచుచుంటి ,
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు , నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి, పూజకు మావిట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి,
నైవేద్యము ఇడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతి కందియనుంటి,
లోటు రానీయ నున్నంతలోనా నీకు రమ్ము దయసేయు మాత్మ పీఠమ్ము పైకి,
అమృత ఝరి చిందు నీ పాదాంకముల యందు కోటి స్వర్గాలు మొలిపించు కొనుచు తండ్రీ

25/10/2024

ఒక సన్యాసి గుర్రం మీద వెళుతున్నాడు. ఒక దొంగ ఆ గుర్రాన్ని కాజేయాలని అనుకున్నాడు. కుంటుకుంటూ వెళ్ళి సన్యాసిని సాయం అడిగాడు. గుర్రం ఎక్కించుకున్నాడు సన్యాసి. కొంత దూరం వెళ్ళిన తరువాత సన్యాసిని తోసేసి నేను నిన్ను మోసం చేసి నీ గుర్రాన్ని కాజేయటానికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు సన్యాసి గుర్రాన్ని తీసుకెళ్ళు నేనేమీ అనుకోను కాని మోసం చేసి తీసుకొచ్చాను అని ఎవరికీ చెప్పకు. ఎందుకంటే దేశంలో సాయం చేసే మనుషులే ఉండరు.

అదిగో రామయ్యా, ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరీ, శబరీ వస్తున్నానంటున్నవి. నడవలేని వెర్రి శబరి నీకోసమే, నీ కోసమే నడచి నడ...
24/10/2024

అదిగో రామయ్యా, ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరీ, శబరీ వస్తున్నానంటున్నవి. నడవలేని వెర్రి శబరి నీకోసమే, నీ కోసమే నడచి నడచి నడచి... అసలే ఆనని చూపు, ఆ పై ఈ కన్నీరు తీరా దరిచేరిన నా చూపు కానదయ్యయ్యో..
ఎంతటి ఎదురు చూపు, ఎంతటి ఆర్ద్రత, ఎంతటి ప్రేమ బాల్యం నుండి నడవలేని వృద్ధాప్యం వరకూ రాముని కోసం చూసిన ఎదురు చూపు.
భక్తి అంటే తనను తాను సమర్పించుకోవటం అంతే కాని గుట్టలకొద్దీ పూలు, ప్లేట్ల నిండా పండ్లు, ఆలయమంతా నోట్లు రోడ్లంతా గంతులు.. మనసు ద్రవించాలు, పరవశించాలి, కనులలో ఆర్ద్రత నిండాలి. గుండెలనిండా ఆ రూపం నిండిపోవాలి.
ఏంటో పొద్దున్నే ఇలా మనసు లాగేస్తుంది.

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే. మహా రాజులు, మంత్రులు నిన్నడగవచ్చే వారలే, మాబోటి దీనులు నీ అండకోర...
24/10/2024

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే. మహా రాజులు, మంత్రులు నిన్నడగవచ్చే వారలే, మాబోటి దీనులు నీ అండకోరే వారలే. ఆదుకొమ్మని, పైకి చేదుకొమ్మని చెప్పవమ్మ మా అయ్యకు, రామయ్యకు. ...
ఎందుకో ఈ రోజు రామయ్య గుర్తుకు వచ్చాడు.
వామాంక స్థిత జానకీ ! పరి లసత్ కోదండ దండం కరే ! చక్రం చోర్భ కరేణ బాహు యుగళే ! శంఖం శరం దక్షిణే ! విభ్రాణం జల జాత పత్ర నయనం ! భద్రాధ్రి మూర్తి స్థితం, కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే.
ఆది శంకరునిచే కీర్తించబడిన రామయ్య. భద్రగిరీశుడు. భార్యను ఒడిలో కూర్చోపెట్టుకున్న మన రామయ్య. ఎంతటి అందగాడండి. మీరూ ఓ సారి వీక్షించండి.

23/10/2024

ఉడుముండదె నూఱేండ్లును
బడియుండదె పేర్మిబాము పదినూఱేండ్లున్
మడుపునగొక్కెర యుండదె
కడునిలబురుషార్దపరుడు గావలె సుమతీ...!

తాత్పర్యం :
ఉడుము నూరు సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, కొంగ మడుగులో చాలా కాలము దాకా జీవిస్తాయి. అయితే వాటివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? అదే మంచిపనులను చేసే విషయంలో ఆసక్తి కలిగిన వారు ఉన్నట్లయితే.. వారివల్ల ప్రయోజనం ఉంటుందని సుమతీ శతకకారుడు ఈ పద్యంలో చెప్పాడు.
అందువల్ల నాకో పదవి ఉందని, ఆ పదవి కోసం వేలాది రూపాయలు వెచ్చించే బదులు తీసుకున్న పదవికి న్యాయం చేయగలిగితేనే తీసుకోవాలి. పదవి అలంకారం కావాలి కాని, పదవికి మనం అలంకారం కాకూడదు.

దేవుడు ఉన్నాడా లేడా. పుణ్యం వస్తుందా రాదా. మరుజన్మ ఉందా లేదా. మళ్ళీ ఇలానే పుడతామా లేదా. ఎన్ని కేజీల పుణ్యం వస్తుంది. నాక...
22/10/2024

దేవుడు ఉన్నాడా లేడా. పుణ్యం వస్తుందా రాదా. మరుజన్మ ఉందా లేదా. మళ్ళీ ఇలానే పుడతామా లేదా. ఎన్ని కేజీల పుణ్యం వస్తుంది. నాకు తెలిసి ఇవన్నీ వృధా మాటలు, వృధా ఆశలు. ఐతే ఒక్కటి మాత్రం నిజం. వాస్తవం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు కాని, క్షేత్రం కాని, దేశం కాని వెళితే ఒక జ్ఞాపకం తీసుకురావాలి. లేదా మన గుర్తు ఒకటి వదిలి రావాలి. ఊరైనా, ఉనిక్ అయినా. అందుకే మనం ఉన్నా లేకపోయినా కొన్ని సంవత్సరాలపాటు మన ఉనికిని గుర్తుండిపోయే సేవకాని, జ్ఞాపకం ఉంచాలి. ఆ చిన్న ఆశతో స్థాపించిందే వాసవీ ఫౌండేషన్. ఇందులో సభ్యులు, దాతలు, టీం సభ్యులు అందరూ ఏదో ఒక విధంగా ఒక 50-60 సంవత్సరాలు గుర్తుండిపోతారు. అందుకే వారి వివరాలు వాసవీ ఫౌండేషన్ వెబ్ సైటు ద్వారా, వారి వివరాలు ఆర్యవైశ్య డిజిటల్ మాసపత్రికద్వారా కొన్ని దశాబ్ధాలు ముందు తరాలకు గుర్తుండిపోయే అవకాశం కలుగ చేస్తుంది. మీరు మరో 5,6 దశాబ్ధాలు ప్రజల మదిలో గుర్తు ఉండాలంటి మన వాసవీ ఫౌండేషన్ లో సభ్యులుగా గాని, దాతలుగా కాని చేరండి. అలాగే మీ సేవలు ఆర్యవైశ్య డిజిటల్ మాసపత్రిక ద్వారా పదిలపరచుకోండి. వివరాలకు www.vasavifoundation.com and www.aryavysyamagazine.com 9160053535 and 8310355276.

Uncategorized Vasavi Foundation – Andhra Pradesh September 5, 2024September 5, 2024 Post Views: 63 VASAVI FOUNDATION – AP State President, మరియు Chairman, Education Committee, All India Federation of AVOPAs (FAI):ఆచార్య భవనారి…

21/10/2024

రాయైతేనేమిరా దేవుడు - హాయిగా ఉంటాడు జీవుడు - ఉన్నచోటే గోపురం ఉసురు లేని కాపురం - అన్నీఉన్న మహానుభావుడు-

20/10/2024

కుడితే చావాలని వరమడిగిన చీమ కుట్టీ కుట్టకముందే చస్తుంది చూడరా అని మన తెనుగు సామెత. ఎవరినో ఏదో చేద్దామని, ఎవరిని ఏదో చేస్తే ఏదో అవుతుందని పిచ్చి పిచ్చి ఆలోచనతో చేసే పిచ్చి పనులకు ఆ సర్వాశ్వరుడు సహకరించాలి. లేకపోతే ఉల్టా పుల్టా అవుతుంది. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. ఎంతమంది నా చుట్టూ వున్నా నా మనసు కొట్లాడేది, కొట్టుకునేది మాత్రం అతి కొద్ది మందికోసం మాత్రమే. పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే అని ఊరికే అనలేదు మరి.

హ్రీంకారాసన గర్భితానలశిఖాం, సౌః క్లీం కళాం బిభ్రతీం, సౌవర్ణాంబర ధారీణీం వరసుధా ధౌతాం, త్రినేత్రోజ్జ్వలామ్,వందే పుస్తక పా...
11/10/2024

హ్రీంకారాసన గర్భితానలశిఖాం, సౌః క్లీం కళాం బిభ్రతీం,
సౌవర్ణాంబర ధారీణీం వరసుధా ధౌతాం, త్రినేత్రోజ్జ్వలామ్,
వందే పుస్తక పాశ మంకుశ ధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం,
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీమ్.
నవరాత్రి శోభలతో భక్తజనావళిని సమాదరించిన భగవతీం, పుస్తక ధారీణీం, జగత్కారిణి, జగదాంబ విజయ దరహాస వీచికలతో మమ్ములను ఆశీర్వదించమని వాసవీ ఫౌండేషన్ టీం సభ్యులు ఆ జగదాంబను ప్రార్థిస్తున్నాం.

06/10/2024

దేశంలో చిల్లర గాళ్ళు ఎక్కువ అయ్యారు. ఏదేదో చెప్పేసి ఏదేదో చేసేస్తామని చెప్పి ఫోను తీయరు, పని చేయరు. ఎవరు ఏది చెప్పినా నమ్మేయకండి బ్రోస్. ఉద్యోగాలు లేవు. పని లేదు. కొంతమంది బ్రతుకు తెరువు ఇదే. కిం కర్తవ్యం. ఏమీ చేయలేం. ఒకరికొకరం జాగ్రత్త అని చెప్పుకోవటం తప్ప.

Address

Ramachandra Nagar, Srivari Sannidhi Complex, Tirumalabyepass Road, Opp SBI Staff Training Centre, Tirumala Byepass Road
Tirupati
517501

Opening Hours

Monday 7am - 8pm
Tuesday 7am - 8pm
Wednesday 7am - 8pm
Thursday 7am - 8pm
Friday 7am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 5pm

Telephone

+919160053535

Alerts

Be the first to know and let us send you an email when Aryavysya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aryavysya:

Share