17/05/2026
ముఖ్య ప్రకటన
ఉండ్రాజవరం గ్రామంలోని బౌద్ధ ధమ్మపీఠం నందు ప్రతి నెలా మూడవ సోమవారం నిర్వహించే ఉచిత కంటి మరియు దంత వైద్య శిబిరాలను, ప్రస్తుత వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేపు (అనగా 18 మే 2026, సోమవారం) తాత్కాలికంగా రద్దు చేయడమైనదని తెలియజేస్తున్నాము. ఈ అసౌకర్యానికి మన్నించగలరు.
ఇట్లు,
మైత్రేయ బుద్ధ విహార ట్రస్ట్ - బౌద్ధ ధమ్మపీఠం,
ఉండ్రాజవరం.
సంప్రదించవలసిన నంబర్లు: 8500768009, 93929 80666