Ravuri Vineela Memorial Foundation

Ravuri Vineela Memorial Foundation We are a Non Government & Non Profit Organisation established to serve the Poor in the Memory of Late Ms Ravuri Vineela.

21/04/2026
Free Spectacles distribution to post operation patients at Tanguturu
15/11/2025

Free Spectacles distribution to post operation patients at Tanguturu

ఈ రోజు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణమందిరం నందు ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. సుమారు 220 మందికి పర...
13/07/2025

ఈ రోజు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణమందిరం నందు ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. సుమారు 220 మందికి పరీక్షలు నిర్వహించగా 185 మందికి శుక్లముల ఆపరేషన్ చేయాలని నిర్ణయం చేసి వారిని శంకర కంటి ఆసుపత్రి, పెదకాకాని కి తరలించడం జరుగుతుంది8

ఈ రోజు కందుకూరు మండలంలోని అనంతసాగరం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 60 మంది విద్యార్థులకు పుస్తకాలు, పలకలు ఉచితంగా...
02/07/2025

ఈ రోజు కందుకూరు మండలంలోని అనంతసాగరం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 60 మంది విద్యార్థులకు పుస్తకాలు, పలకలు ఉచితంగా పంపిణీ చేయడమైనది

28/05/2025
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమాన్ని టంగుటూరు ఎన్ టి ఆర్ సేవ...
28/05/2025

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమాన్ని టంగుటూరు ఎన్ టి ఆర్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు...ఈ సందర్బంగా సేవా సమితి మరియు రావూరి వినీల మెమోరియల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పలు రకాల జబ్బులకు వైద్యం చేపించుకున్నారు. ఈ సందర్బంగా సేవాసమితి కన్వీనర్ రావూరి తిరుమల రాధా కృష్ణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు జాతికి, ఆంధ్రరాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. మసీద్ సెంటర్ లో ఉన్న నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా రాధా కృష్ణ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తెలుగు సీనీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్దానాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి నందమూరి తారకరామారావు అన్నారు. తెలుగు రాష్ట్రం అభివృద్ది కోసం ఆయన కన్న కలలను నిజం చేయడమే ఆయనకు మనము ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని వారు తెలిపారు.

కార్యక్రమం లో మాజీ ఎంపిపి చదలవాడ చంద్రశేఖర్ మాట్లాడుతూ కిలో బియ్యం 2 రూపాయలు, సగం ధరకే చేనేత వస్త్రాలు, పక్కా గృహాల నిర్మాణం, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీరామారావు గారికి చెందుతుందని వారు అన్నారు. ఫౌండేషన్ వారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తు లో మరిన్ని చేయాలనీ ఆశించారు. మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు మాట్లాడుతూ మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్థానిక స్విమ్స్ ఆసుపత్రి వారు సహకరించడం చాలా సంతోషం అని అభినందించారు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని, అటువంటి పార్టీలో పని చేయడం మా అందరికీ గర్వకారణంగా ఉందని వారు అన్నారు.కార్యక్రమం లో స్విమ్స్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ భవిష్యత్తు లో ఫౌండేషన్ వారితో కలిసి మరిన్ని క్యాంపు లు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు కార్యక్రమం లో కంటి శుక్లలకు అవసరం అయినా వారికీ సుమారు 280 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో సుమారు 135 మందికి ఆపరేషన్ లు అవసరం అయినా వారిని ఆసుపత్రి కి తరలించారు అదేవిదంగా జనరల్ జబ్బులకు గాను సుమారు 250 మందికి గుండె, షుగర్, శ్వాస పలు చికిత్స లు చేయగా వారికీ ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగింది కార్యక్రమం లో స్విమ్స్ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాసరావు తోపాటు శంకర కంటి ఆసుపత్రి డాక్టర్ లు చేతన, ధ్రువ, స్టాఫ్ రాంబాబు, ప్రసన్న కుమార్, సుభాషిణి, మరియు ఫౌండేషన్ ప్రతినిధులు గోపి సాయి కృష్ణ, సుబ్బారావు, మురళి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు

28/05/2025
28/05/2025

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమాన్ని టంగుటూరు ఎన్ .....

28/05/2025

Address

C/o Veera Brahmendra Swamy Temple
Tanguturu
523274

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravuri Vineela Memorial Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share