PDSU Srisailam

PDSU Srisailam Progressive Democratic Students Union

01/05/2024

21/07/2023
శ్రీశైలం  20:07.2023.*కడప నగరంలో జూలై 22,23 తేదీలలో జరిగే PDSU రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను, జనరల్ కౌన్సిల్ ను...
20/07/2023

శ్రీశైలం
20:07.2023.
*కడప నగరంలో జూలై 22,23 తేదీలలో జరిగే PDSU రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను, జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి*
---(PDSU)

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను ఈనెల 22,23 తేదీలలో కడప నగరంలో UTF భవనంలో నిర్వహిస్తున్నట్లు PDSU శ్రీశైలం మండల కమిటీ అధ్యక్షులు యం. జ్ఞాన దేశీగన్ తెలిపారు.
గురువారం నాడు శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో విద్యార్థులతో కలిసి గోడపత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం యూనివర్సిటీ విద్యను భ్రస్టు పట్టించిందని, ఫెల్లోషిప్ లకు కోత విధించిందని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం -2020 పేరుతో విద్యారంగాన్ని కాషాయికరణ, కార్పొరేటికరణ, కేంద్రికరణ చేస్తుందని దుయ్య బట్టారు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం, మొఘలుల చరిత్ర, భగత్ సింగ్ చరిత్ర, పీరియాడిక్ టేబుల్ వంటి శాస్త్రీయ, చారిత్రక పాఠ్యంశాలను తొలగించి, ఆశాస్త్రీయ భావాలను విద్యార్థుల మెదళ్ళలోకి చొప్పించడానికి చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ పాఠశాలలను ముక్కలు చేశారని, 3,4,5 తరగతులను హైస్కూల్స్ లో విలీనం చేస్తున్నారని అన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ ను మూసివేయడానికి రంగం సిద్ధం చేశారని అన్నారు. ప్రతి సంవత్సరం డియస్సి వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళైనా ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదని, రాష్ట్రంలో 9వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో 50,677 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఇప్పటికైనా వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీలో సింగిల్ సబ్జెక్టు విధానం తెచ్చి డిగ్రీ విద్యను భ్రష్టు పట్టిస్తుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాలపై, విద్యారంగ సమస్యలపై ఈ క్లాసులలో, జనరల్ కౌన్సిల్లో చర్చించి, భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలిపారు . కడపలో రెండు రోజుల పాటు జరిగే క్లాసులను, జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో PDSU మండల ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జాన్, మల్లికార్జున, సుభాష్ జగ్గు దాదా ,ఆకాష్,కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

The revolution is not an apple that falls when it is ripe. You have to make it fall.Happy Birthday Che Guevara
14/06/2023

The revolution is not an apple that falls when it is ripe. You have to make it fall.

Happy Birthday Che Guevara

15/04/2022
14 ఏప్రిల్ 50వ వర్ధంది నివాళులుజోహార్  జార్జ్ రెడ్డి అన్న...(1/Jan/1947 - 14/Apr/1972)
14/04/2022

14 ఏప్రిల్ 50వ వర్ధంది నివాళులు
జోహార్ జార్జ్ రెడ్డి అన్న...
(1/Jan/1947 - 14/Apr/1972)

Address

Srisailam
518102

Telephone

+919581471435

Website

Alerts

Be the first to know and let us send you an email when PDSU Srisailam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PDSU Srisailam:

Share