09/04/2026
ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణా సంస్థ వారి సౌజన్యంతో
శ్రీ ఇడదాసుల విద్యా ఆరోగ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది.
ఈ క్యాంపును సూర్య హాస్పిటల్ డాక్టర్ ఇడదాసుల యశ్వంత్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆయన క్యాంపు కు వచ్చిన రోగులను ఉద్దేశించి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ మరియు సూర్య హాస్పిటల్ సహకారంతో సేవా ఫౌండేషన్ గత కొంత కాలంగా ఎన్నో వైద్య శిబిరారాలను నిర్వహించిదని, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే మా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు.
ఈ కంటి వైద్య శిబిరానికి కంటి రోగులు 60 మంది రాగా అందులో 31 మందికి కేటరాక్ట్ మరియు నలుగురికి టెరీజియం ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించడంతో వారిని శంకర్ ఫౌండేషన్ వారి బస్సులో విశాఖపట్నం తరలించడం జరిగింది. మిగిలిన వారికి వైద్యులు మందులు అద్దాలు సూచించారు. శిబిరానికి వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు సేవా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.
శిబిరంలో సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల తిరుపతి రాజు, సభ్యులు బలివాడ శ్రీనివాసరావు, బేతా నర్సింహులు శంకర్ ఫౌండేషన్ వైద్యులు సిబ్బంది, సూర్య హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.