22/06/2026
🌟 గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అవగాహన కార్యక్రమం 🌟
యువ చైతన్య సేవా సమితి (YCSS) ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి దేవి ఛారిటబుల్ ట్రస్ట్, అమలాపురం లో పిల్లల కోసం "గుడ్ టచ్ – బ్యాడ్ టచ్" పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పిల్లలకు వ్యక్తిగత భద్రత, మంచి స్పర్శ – చెడు స్పర్శ మధ్య తేడా, ప్రమాదకర పరిస్థితులను గుర్తించడం, మరియు నమ్మకమైన పెద్దలకు తెలియజేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించబడింది.
కార్యక్రమాన్ని మిస్ ఎన్. ధరణి, వాలంటీర్, యువ చైతన్య సేవా సమితి (YCSS) నిర్వహించారు. సుమారు 30 మంది పిల్లలు పాల్గొని చురుకుగా స్పందించారు. ఈ కార్యక్రమం పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి భద్రతపై అవగాహనను మెరుగుపరిచింది.
💙 "నా శరీరం నాది – నన్ను రక్షించుకోవడం నా హక్కు"
# chaithanya seva samithi