19/04/2025
Temple renovation going on……🙏🏻🙏🏻🙏🏻
*శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానము, కొడవటంచ నందు ఈరోజు తేది. 04.04.2025 శుక్రవారం రోజున శ్రీ స్వామి వారి ఆలయ జిర్నోద్దరణ(పునః నిర్మాణం) కార్యక్రమం ఉదయం 8:00 నుండి విశ్వాక్ సేనపూజ, పుణ్యవచనం, హోమం, మూర్తిహోమం, నవకాలషార్ధన, పూర్ణహుతి, శ్రీ స్వామి వారికి నవకాలషాలతో అభిషేకం, మూర్తి కుంభావాహనం.*
*ఉదయం 11:00గంటలకు శ్రీ స్వామివారు బాలాలయంలోని కి ప్రవేశం జరిగినది.*
*తదుపరి మూర్తి చండ, ప్రచండ దేవతలు జయ, విజయలు, శిఖరము, ద్వజస్థంభం, రాజగోపురం, శ్రీ ఆంజనేయ స్వామి, గరుడ ఆల్వార్ ఉద్వాసన కార్యక్రమములు జరిగినవి* .
ఇట్టి కార్యక్రమములో ఆలయ కార్యనిర్వాహనాధికారి ఎస్. మహేష్, ఆలయ చైర్మన్ యం. బిక్షపతి, ఎండోమెంట్ DE రమేష్, ఆలయ ధర్మకర్తలు ఎస్. సుదర్శన్, కె. జోగేందర్, మల్లయ్య, ఐలయ్య, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులకు గమనిక :- దేవాలయం పునః నిర్మాణం జరుగుచున్నందున శ్రీ స్వామి వారి దర్శనములు బాలాలయంలోకి (శ్రీ స్వామివారి కల్యాణ మండపం) మార్చబడినది.
చైర్మన్ / కార్యనిర్వాహణాధికారి