Manam-Vanam Foundation

Manam-Vanam Foundation Serve to Needy

యలమర్రు అగ్ని ప్రమాద ఘటన భాదితులకు మనం-వనం అండ..
06/09/2026

యలమర్రు అగ్ని ప్రమాద ఘటన భాదితులకు మనం-వనం అండ..

పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో ఇటీవల జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా పశువుల పాక కాలిపోయి..గేదెలు కాలిపోగా విషయం తెలుసుక...
06/09/2026

పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో ఇటీవల జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా పశువుల పాక కాలిపోయి..గేదెలు కాలిపోగా విషయం తెలుసుకున్న మనం - వనం ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ పెనుమాల శ్రీనివాసరావు గారు వారిని పరామర్శించి ఎలా జరిగింది అని తెలుసుకుని తక్షణ సాయం కింద 10,000/- రూపాయలు ఆర్థిక సాయం అందించటం జరిగింది..

పామర్రు నియోజకవర్గం: *అడ్డాడ జడ్పీ హైస్కూల్ రత్నం 'సింధు ప్రియ'కి అరుదైన పురస్కారం..**ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపి...
06/09/2026

పామర్రు నియోజకవర్గం:

*అడ్డాడ జడ్పీ హైస్కూల్ రత్నం 'సింధు ప్రియ'కి అరుదైన పురస్కారం..*

*ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించి, పట్టుదలతో చదివితే ఆకాశమే హద్దు అని చాటిచెప్పిన గ్రామీణ ప్రతిభకు ఘన సత్కారించారు..*

పామర్రు మండలం, అడ్డాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి సంచలనం సృష్టించిన మద్దాలి సింధు ప్రియకు అరుదైన గౌరవం దక్కింది.

పరిమిత వనరులతోనే అద్భుత ప్రతిభను కనబరిచి, మండలానికి గర్వకారణంగా నిలిచిన సింధు ప్రియ కృషిని గుర్తిస్తూ 'మనం-వనం ఫౌండేషన్' విశిష్ట ప్రోత్సాహకాన్ని అందించింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫౌండేషన్ డైరెక్టర్ పెనుమాల శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా పాఠశాలను సందర్శించి, సింధు ప్రియను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

విద్యార్థిని భవిష్యత్తు చదువులకు, ఉన్నత ఆశయ సాధనకు ఊతమిచ్చేలా రూ. 10,000/- (పది వేల రూపాయలు) నగదు పారితోషికాన్ని బహుమతిగా అందజేశారు.

NMMS (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) కు ఎంపిక అయిన మరొక విద్యార్థికి 2000/- బహుమతి ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో పెనుమాల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ:

"ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ మండల స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించడం సామాన్యమైన విషయం కాదు.

సింధు ప్రియ పట్టుదల, క్రమశిక్షణ నేటి తరం విద్యార్థులందరికీ ఆదర్శం.

గ్రామీణ ప్రాంతాలలోని ఇటువంటి అద్భుతమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే 'మనం-వనం ఫౌండేషన్' ముఖ్య ఉద్దేశం.

సింధు ప్రియ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం," అని ఆకాంక్షించారు.

తన కష్టానికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా, మనం-వనం ఫౌండేషన్ అందించిన ఈ ప్రోత్సాహం తనలో మరింత నమ్మకాన్ని నింపిందని, భవిష్యత్తులో ఇంకా బాగా చదివి సమాజానికి సేవ చేస్తానని విద్యార్థిని సింధు ప్రియ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొని సింధు ప్రియను, ఆమెను ప్రోత్సహించిన మనం-వనం ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.

*పామర్రు మండలం కురుమద్దాలి గ్రామంలో మనం వనం పౌండేషన్ డైరెక్టర్ పెనుమాల శ్రీనివాసరావు గారు దోవారి హారిక గారికి MBBS 2వ సం...
06/09/2026

*పామర్రు మండలం కురుమద్దాలి గ్రామంలో మనం వనం పౌండేషన్ డైరెక్టర్ పెనుమాల శ్రీనివాసరావు గారు దోవారి హారిక గారికి MBBS 2వ సంవత్సరం చదువు నిమిత్తం 30,000/- రూ.లు ఆర్థిక సహాయాన్ని అందజేసినారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భారతి గారు, గ్రామస్తులు,నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.*

ఆగస్టు 15వ తేదీన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న వెల్ఫేర్ కార్యదర్శిని పల్లవి గారిని సత్కర...
06/09/2026

ఆగస్టు 15వ తేదీన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న వెల్ఫేర్ కార్యదర్శిని పల్లవి గారిని సత్కరిస్తూ...

*జమిదగ్గుమిల్లి స్కూల్ టాపర్ ‘రామ్ చరణ్’కు ఘన సత్కారం...**రూ. 10,000 నగదు ప్రోత్సాహకం అందించిన ‘మనం వనం’ ఫౌండేషన్ డైరెక్...
06/09/2026

*జమిదగ్గుమిల్లి స్కూల్ టాపర్ ‘రామ్ చరణ్’కు ఘన సత్కారం...*

*రూ. 10,000 నగదు ప్రోత్సాహకం అందించిన ‘మనం వనం’ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు*

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించినందుకు గుర్తింపువిద్యార్థులను ప్రోత్సహించడంలో ‘మనం వనం’ ఫౌండేషన్ ముందంజ

పామర్రు/జమిదగ్గుమిల్లి సెప్టెంబర్ 3 :

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ అసాధారణ ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘మనం వనం’ ఫౌండేషన్ మరోమారు తన ఉదారతను చాటుకుంది.

జమిదగ్గుమిల్లి ఉన్నత పాఠశాలలో గత పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి, పాఠశాల స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ప్రతిభావంతుడైన విద్యార్థి వెన్న మోహన రామ్ చరణ్‌ను ట్రస్ట్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి,రూ. 10,000 నగదు బహుమతి అందజేశారు.

పాఠశాలలోగురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘మనం వనం’ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ పెనుమాల శ్రీనివాసరావు (పి.ఎస్.ఆర్) గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన టాపర్‌గా నిలిచిన వెన్న మోహన రామ్ చరణ్‌కు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థి ఉన్నత చదువులకు ఆర్థికంగా తోడ్పడేలా రూ. 10,000 (పది వేల రూపాయలు) నగదు ప్రోత్సాహకాన్ని డైరెక్టర్ పెనుమాల శ్రీనివాసరావు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కొనియాడారు.

రామ్ చరణ్ సాధించిన విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో అతను మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

తమ పాఠశాల ప్రతిభవంతుడైన విద్యార్థికి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించినందుకు పాఠశాలప్రధానోపాధ్యాయులు చలమల శెట్టి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయ బృందం ‘మనం వనం’ ట్రస్ట్‌కు మరియు డైరెక్టర్ శ్రీనివాసరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాడిశెట్టి సత్య, మనం వనం ఫౌండేషన్ ప్రతినిధి పెనుమాల ప్రతాప్, మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ముదునూరి శివకృష్ణ, వాయామ ఉపాధ్యాయుడు బాదర్ల రాము, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

*మొవ్వలో సాకారం కానున్న బహుకాల స్వప్నం - రాజ్యాంగ నిర్మాత విగ్రహ స్థాపనకై శ్రీ పెనుమాల శ్రీనివాసరావు గారి ఉదార విరాళం*అణ...
06/09/2026

*మొవ్వలో సాకారం కానున్న బహుకాల స్వప్నం - రాజ్యాంగ నిర్మాత విగ్రహ స్థాపనకై శ్రీ పెనుమాల శ్రీనివాసరావు గారి ఉదార విరాళం*

అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భరతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాశయుని నిలువెత్తు విగ్రహ ప్రతిష్ఠాపనకై మొవ్వ కేంద్రంగా ఎన్నో సంవత్సరాలుగా వేచిచూస్తున్న బహుజనుల స్వప్నం సాకారమయ్యే శుభతరుణం ఆసన్నమైంది.

మొవ్వ సెంటర్లో అంబేద్కరుని విగ్రహాన్ని నెలకొల్పాలన్న ఈ బృహత్తర కార్యానికి అండగా నిలుస్తూ అంబేద్కరిస్టులు, దాతలు ముందుకు వస్తున్నారన్నారు.

కొండాయిపాలెం వాస్తవ్యులు, 'మనం-వనం ఫౌండేషన్' డైరక్టర్ అయిన శ్రీ పెనుమాల శ్రీనివాసరావు (PSR) గారు తమ ఉదారతను చాటుకున్నారు.

ఈ మహత్కార్యమునకు తమ వంతు ఆర్థిక పుష్టిని చేకూరుస్తూ, అక్షరాలా రూ. 25,000/- (ఇరవై ఐదు వేల రూపాయలు)ల విరాళాన్ని విగ్రహ నిర్మాణ కమిటీ వారి బ్యాంకు ఖాతాకు బదిలీ గావించారు.

సామాజిక స్పృహతో ఆయన చేసిన ఈ విశేషమైన ఆర్థిక సాయమునకు గ్రూపు సభ్యులు, విగ్రహ నిర్మాణ కమిటీ వారు అత్యంత హర్షం వ్యక్తపరిచారు.

దళిత బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక అయిన ఈ విగ్రహ స్థాపనలో భాగస్వాములైన శ్రీ పెనుమాల శ్రీనివాసరావు గారికి సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, విప్లవపూర్వక 'జై భీమ్' అభివాదములు తెలియజేయుచున్నారు.

31/07/2026

10tv వారి న్యూస్ లో... మనం - వనం ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ పెనుమాల శ్రీనివాసరావు గారు గురించి..

జంపాల మధుమతి విద్యార్థికి 10000 రూపాయలు బహుమానం జిల్లా పరిషత్ నిమ్మకూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు స...
31/07/2026

జంపాల మధుమతి విద్యార్థికి 10000 రూపాయలు బహుమానం జిల్లా పరిషత్ నిమ్మకూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి మనం మనం ఫౌండేషన్ తరపున విద్యార్థికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం మనం ఫౌండేషన్ డైరెక్టర్ పెనుమాల శ్రీనివాసరావు (పి ఎస్ ఆర్ )గారు చెక్కు రూపంలో 10000 జంపాల మధుమతికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వి . శ్రీనివాస్ గారు మరియు మనం ఫౌండేషన్ వాలంటీర్లు ప్రతాప్, దాసు, నత్త రవి,నాగమల్లేశ్వరరావు, రాజేష్ తదితరులు పాల్గొనడం జరిగింది

Follow for more updates
30/06/2026

Follow for more updates

Address

Kondaya Palem
Pamarru

Alerts

Be the first to know and let us send you an email when Manam-Vanam Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share