23/09/2026
*లలితావైభవం 468(2)*
🌹🌻🌺💐🌸🍀
తేదీ.24.09.2026
గురువారం
🌹💄🍂🌞🪷🌺 అమ్మ సహస్ర నామ శ్లోకం 97
" *వజ్రేశ్వరీ వామదేవీ వయో వస్థావివర్జితా, సిద్ధేశ్వరీ సిద్దవిద్యా సిద్దమాతా యశస్విని"*
*నామము*
*వజ్రేశ్వరీ*
*సాక్ష్యము*
" *షష్టీతిథినిత్యా జాంధరపీఠాధిష్ఠాత్రీ వజ్రేశ్వరీ. అథవా శ్రీపురస్య ద్వాదశః ప్రాకారో వజ్రమణిమయః తస్త్యైకాదశస్య మధ్యే వజ్రాఖ్యానదీ. తదధిపతిః ఉక్తంచ దుర్వాససా తత్ర సదా* *ప్రవహంతీ తటినీ వజ్రాభిధా చిరం జీయాత్. చటులోర్మిఝూటనృత్యత్ కలహంసీకుల కలక్వణీతపుష్టా. రోధసి తస్యా రుచిరే వజ్రేశీ జయతి వజ్రభూషాడ్యా* *వజ్రప్రదానతోషిత వజ్రిముఖ త్రిదశనిమత చారిత్రే తి. ఇంద్రాయ వజ్రో పి దేవ్యైచ దత్తః తదుక్తం బ్రహ్మాండే శక్రస్య జలే తపః ప్రకృత్య తజ్జలాదుత్థితా దేవీ వజ్రం దత్వా బద్విషే పునరంతర్ధధే సోపి* *కృతార్ధస్సర్గమేయివాన్ ఇతి"*
*అర్ధము*
వజ్రేశ్వరీ = షష్టీ తిథి నిత్యా దేవి.
*విశేషాలు*
1.షష్ఠి తిథి నిత్యాదేవి
2.జాలంధర పీఠాధిష్ఠాన దేవత
3.వజ్రా నదికి ఈశ్వరి అయిన తల్లి.
" *మూలాధారం గుదస్థానం, స్వాధిస్ఠానం తు మేహనం, నాభి స్తు మణిపూరాఖ్యాం, హృదయం చాబ్ధ మనాహతం, తాలుమూలం* *విశుద్ధాఖ్యం, అజ్ఞాం చ నిటలాంబుజం, తస్మా దూధ్వ మధోముఖం వికసితం ఒపద్మసహస్రఛ్ఛదం, నిత్యానందమఘీ సదాశివపురీ శక్తే నమ శాశ్వత"*
ఆజ్ఞాద్ధార గుదస్థానం - ఆధారచక్రము గుద స్థానములో ఉన్నది
స్వాధిష్టానంతుమేహనం - స్వాధిష్ఠానము లింగ స్థానములో ఉన్నది
నాభిస్తుమణిపూరాఖ్యం - మణిపూరం నాభిస్థానములో ఉన్నది
హృదయంచాబ్ధ్మనాహతం - అనాహతము హృదయస్థానములో ఉన్నది
తాలుమూలం విశుద్ధాఖ్యం - విశుద్ధి చక్రం కంఠస్థానములో ఉన్నది
ఆజ్ఞాంచనిటలాంబుజం - అజ్ఞాచక్రం భ్రూమధ్య భాగములో ఉన్నది
తస్మా దూర్ధ్వమధోముఖం వికసితం పద్మం సహస్రఛ్ఛదం - వాటిపైన సహస్రదళ పద్మమునందు నా తల్లి పరమేశ్వరి అయిన లలితాదేవి ఉంటుంది
🌳 మన అందరి శరీరమనే దేవాలయములో. ఇది గుర్తు పెట్టుకోండీ.. అంటే..? మన దేహమే నా తల్లి లలితాదేవి దేవాలయమన్నమాట.
🌳 ఆ తల్లి లలితాపరాభట్టారిక కొలువై ఉన్న చక్రాలకు విడివిడిగా దళాలు ఉంటాయి.
1.ఆధారచక్రానికి - 4 దళాలు
2.స్వధిష్టానికి - 16 దళాలు
3.మణిపూరానికి - 10 దళాలు
4.అనాహతానికి - 12 దళాలు
5.విశుద్ధచక్రానికి - 16 దళాలు
6.ఆజ్ఞాచక్రానికి - 2 దళాలు
7.సహస్రారానికి - వేయిదళాలు
🌳 వీటిలో ప్రతీ చక్రానికీ కొన్ని కిరణాలుంటాయి. జగద్ గురువులైన భగవత్పాద విరచిత ఆదిశంకరాచార్యుల వారు తమ సౌందర్య లహరిలో 14 గవ శ్లోకములో ఈ క్రింది విధంగా వర్ణించారు.. మన దేహములో ఉన్న చక్రాలు మరియు అమరికలలో నా తల్లి జగన్మాత అయిన లలితాదేవి కొలువై ఉన్న విధానాన్ని.
" *క్షితో షట్పంచాశ ద్విశ మధిక పంచాశ దుదకే హుతాశే ద్వాషష్టి చతురధక పంచాశదనిలే దివి షట్త్రింశ న్మనసి చ చతుష్టష్టి రితియే మయూఖాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం"*
🌳అవి ఎలా అంటే..? క్షితౌషట్పంచాశ - భూతత్త్వాత్మకమైన మూలాధారానికి 56 కిరణాలు ద్వశమధికపంచాశదుదకే - జలతత్త్వాత్మకమైన మణిపూరానికి 52 కిరణాలు ఈ మొత్తం అగ్నిదేవునివి 108 కిరణాలు
హుతాసేద్వాషష్టి - అగ్నితత్త్వాత్మకమైన స్వాధిష్టానానికి 62 కిరణాలు
చతురధికపంచాశదనిలే - వాయుతత్త్వాత్మకమైన అనాహతానికి 54 కిరణాలు
ఈ మొత్తము సూర్య భగవాణునివి 116 కిరాణాలు
దివిద్విషత్త్రింశన్ - ఆకాశతత్త్వాత్మకమైన విశుద్ధి చక్రానికి 36 X 2 = 72 కిరణాలు
మనసిచ చతుషష్టిరతియే - మనస్తత్త్వాత్మకమైన ఆజ్ఞాచక్రానికి 64 కిరణాలు
ఈ మొత్తము చంద్రునివి 136 కిరణాలు మన శరీరము మూడు ఖండాలుగా ఉంది. అవీ..
1.అగ్నిమండలము
2.సూర్య మండలము
3.చంద్ర మండలము
1.అగ్నిమండలము:
ఆధార, మణిపూరచక్రాలను అగ్నిమండలము అని అంటారు.
*అస్యశ్రీ అగ్ని మండల మహామంత్రస్య| అగ్నిఋషిః| అనుష్టుఛ్ఛంధః| శ్రీ అగ్నిమండలం దేవతా| రంబీజం| ధూమ్రార్చిశ్శక్తిః | ఊం కీలకం | జపేవినియోగః*
*. న్యాసం*
*రాం | రీం | రూం | రై | రౌ | రః*
*. ధ్యానము*
*సదాశివప్రియం రౌద్రం సప్తాస్యం సర్వతోముఖం | వందే తం శిఖినం నిత్యం హవ్య కవ్యవహం ముదా ||*
*మంత్రము హ్రీం శ్రీం సౌః శ్రీఅగ్నిమండల శ్రీపాదుకాం పూజయామినమః*
దీనిలో 108 కిరణాలు ఉన్నాయి.
మూలాధారము (పృధివీతత్త్వాత్మకము) 56 కిరణాలు
1.ఉడ్డీశ్వర
2.ఉడ్డీశ్వరి
3.జలేశ్వర
4.జలేశ్వరి
5.పూర్ణేశ్వర
6.పూణేశ్వరి
7.కామేశ్వర
8.కామేశ్వరి
9.శ్రీకంఠ
10.గగనా
11.అనంత
12.స్వరసా
13.శంకర
14.మతి
15.పింగళ
16.పాతద దేవి 17.నారదాఖ్య
18.నాదా
19.ఆనంద
20.హాకినీ
21.ఆలస్య
22.ఢాకినీ
23.మహానంది 24.లాకినీ
25.యోగ్య
26.లౌకినీ
27.అతీత
28.శాకినీ
29.పాదం
30.హాకినీ
31.ఆధారేశ
32.రక్త
33.చక్రేసి
34.చండా
35.కురంగేశ
36.కఠాళా
37.మదధ్రీశ 38.మహేచ్చుష్మా 39.అనాది విమల 40.మాతంగి 41.సవర్జావిమల 42.పుళింద
43.యోగ విమల 44.శాంభరి
45.సిద్ధ విమల 46.వాచాపరా 47.సమయవిమల 48.కులాలికా
49. తన్రేసా
50.కుబ్జా
51.ఉడ్డీశ
52.లఘ్వీ
53.షష్టీశ
54.కులేశ్వరి 55.చర్వాదీశ
56.అజా
🌳ఇవి ఆధార చక్రములోని నాలుగు దళాల యందు దళానికి ఏడుచొప్పున్న రెండు ఆవృత్తులుగా ఉంటాయి.
మనిపూరము(జలతత్త్వాత్మకము) 52 కిరణాలు
1.సదోజ్యాత
2.మాయా
3.వామదేవ
4.శ్రీః
5.అఘోర
6.పద్మా
7.తత్పురుష
8.అంబికా
9.అనంత
10.నివృత్తి
11.అనాధ
12.ప్రతిష్ఠా
13.జనశ్రిత
14.విద్యా
15.అచింత్య
16.శాంతా
17.శశిరేఖ
18.ఉమా
19.తీవ్ర
20.గంగా
21.మణివాహ 22.సరస్వతీ 23.అంబువాహ 24.కమలా
25.తేజోధీశ
26.పార్వతీ 27.విద్యావగీశ్వర 28.చిత్రా 29.చతుర్విధేశ్వర 30.సుకమలా 31.ఉమాంగేశ్వర 32.మన్మథా
33.కృష్ణేశ్వర
34.క్రియా
35.శ్రీకంఠ
36.లయా
37.అనంత
38.సతీ
39.శంకర 40.రత్నమేఖలా 41.పింగళ
42.యశోవతి 43.సాధ్యాఖ్య 44.హింసానంద 45.పరదివ్యేషు 46.వామా 47.మారదివ్యౌషు 48.జ్యేష్ఠా
49.పీఠేషు
50.రౌద్రి
51.సర్వేశ్వర 52.సర్వమయీ
🌳 ఈ రశ్ములు మణిపూరములోని షడ్డదళాలలోనూ వరుసగా 4,4,6,4,5,3 చొప్పున్న రెండు ఆవృత్తులుగా ఉంటాయి.
*గమనిక* : స్వాధిష్టాన మణిపూరాలకు పేర్లు కొన్ని గ్రంధాలలో అటూ, ఇటూ మారుతున్నాయి. ఈ విషయాన్ని భక్తులు గమణించ గలరని మనవి.
రేపు ఇంకో నామముతో అమ్మ వైశిష్ట్యము తెలుసుకుందామా.
జై భవానీ తల్లీ లలితా పరాభట్టారికా..!
🌻🍀🌹🍁🌸💐🌺
సదా మీ ఆధ్యాత్మిక సేవలో
మీ
చిన్నిక్రిష్ణ.
లలితోపాసకులు, లలితాపీఠం,
లలితా చారిటబుల్ ట్రష్ట్,
అనాధ ఆశ్రమము, (పిల్లలు మరియు వృద్ధులు)
గోశాల, లలితా త్రిపురాంతకేశ్వర వేణుగోపాల స్వామి ఆలయం, చుట్టూరా 108 దేవతల గోపురాలు, అమ్మవారి ఆవిర్భావ ఇతిహాసపు మ్యూజియం, ఫ్రీజర్ బాక్సు మరియు కైవల్య రథం సేవలు, అనాథ శవాల దహనం.
లలితా పురం కోసంగిపురం జ.
పలాసా మరియు కాశీబుగ్గ. చరవాణి:8500272747
*గమనిక* :
🙏🏾🌹🙏🏾🌹🙏🏾🌹🙏🏾
ఇందులో ఏమైనా దోషాలు గానీ ఇంకా ఏదైనా సందేహ నివృత్తి గానీ కావాలంటే..? కేవలము మెస్సెజ్ ద్వారా నాకు తెలియజేయగలరు.
దానిని సద్విమర్శగా స్వీకరించి మరలా మీ సలహాలను మరియు సూచనలను ఇందులో చేర్చి మీకు వివరణ ఇవ్వబడును.
ఎందుకంటే..? సమాజానికి తప్పుడు సమాచారము అందకూడదు.