03/10/2024
*మేడారం మొక్క ముడుపు పండగ ఆత్మీయ ఆహ్వానం మరియు నియమాలు*
రండి.. ఒక అక్షర సత్యమైన, భాద్యతాయుతమైన వన భోజన మహోత్సవ కార్యక్రమము జరుపుకుందాం..!!
*స్థలం:* నార్లాపూర్ చింతల వద్ద
*తేదీ:* అక్టోబర్ 8, ఉదయము 7 గంటల నుండి మొదలు
మన మేడారం గ్రామ ప్రజలందరినీ కలపడానికి, అడవి తల్లులకు సేవ చేయడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి చేస్తున్న ఈ చిరు ప్రయత్నంలో మీ కుటుంబసభ్యులందరితో తప్పకుండా పాల్గొనగలరు.
ఇది గ్రామ ప్రజల అందరి సహాయ సహకారాలతో *ఆదర్శవంతమైన - సుస్థిర మేడారం* దిశగా వేస్తున్నఒక తొలి అడుగు.
మరిన్ని వివరాలకు సంప్రదించగలరు
1. సుధీర్ ఆలం : +91-9618302743
2. శోభ ఆలం : +91-9494330141
3. వెంకట్ రామ్ రెడ్డి : +91-9441304074
4. మీ మనిషి : +91-9490069000
*మేడారం మొక్క ముడుపు పండగ - ఆత్మీయ నియమాలు*
*1. మేడారం ఒక తరగతి గదిలా;* తెలంగాణా ప్రజలకు, మహా జాతరకు తరలివొచ్చే భక్తులందరికీ ఒక అక్షర సత్యమైన - బాధ్యతాయుతమైన వాన బోజనాలను తిరిగి పరిచయం చేసే పండగ. అందరికి తెలియజేయండి: "వన భోజనం ≠ దావత్ / పిక్నిక్ / పార్టీ"
*2. అందరూ సమానులే:* మనమంతా సామాన్య మానవులమై, మానవత్వం ప్రతిభింబించే మనుషులమై, గ్రామ ప్రజలందరితో కలిసి, ప్రకృతిఒడిలో సేదతీరడానికి, ప్రకృతినుండి నేర్చుకోవడానికి, అడవి తల్లులకు, ఈ భూమాతకు సేవచేయడానికి చేసుకొనే పండగ.
*3. ప్లాస్టిక్ నివారణ:* ఈ అక్షర సత్యమైన వన భోజన మహోత్స నిర్వహణకు మీరు, దయచేసి కుటుంబసభ్యులకు సరిపడా స్టీల్ గ్లాసులు, నీళ్ల జగ్గు, స్టీల్ ప్లేట్లు, చాప తీసుకొని రాగలరు. ప్లాస్టిక్స్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నివారించడానికి సహకరించగలరు.
*4. సేవా నాయకత్వం:* సేవాభావంతో ముందుండి ప్రతిఒక్కరు ఈ కార్యక్రమము నిర్వహణను విజయవంతం చేయడంలో తమవంతు సహకారం అందించగలరు. *సేవకుడే నిజమైన నాయకుడు.*
*5. భాగస్వామ్యం:* ఈ పండగ గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలను తీసుకొని చేయుచున్న పండగ కావున - కొరతకు ఆస్కారం లేకుండా ప్రతిఒక్కరు తమవంతు విరాళము నిధికి అందించి, కుటుంబసభ్యులందరితో తప్పక భాగస్వామ్యం తప్పక తీసుకొనగలరు. ముందుగా *ఆన్ లైన్ పేమెంట్ అట్టం రమేష్ @ +91 75697 86447* కి చేసి, తప్పకుండా నిరూపణకు స్క్రీన్ షాట్ పంపించగలరు. పండుగరోజు, స్వీకరించిన విరాళముల వివరాలు అందరికి తెలియజేయబడును.
*6. ఈ మొక్క ముడుపు పండగ పూర్తి స్థాయి స్పృహలోఉండి,* చెట్లు పెట్టి, సాత్విక - ఆహార సమిష్టి భోజనము చేసి, ఆట పాటలతో ఆనందంగా గడిపే గ్రామ పండుగ. దయచేసి ఎవరూ మద్యం సేవించి రాకూడదని మనవి. ఎలాంటి సమస్యలున్నా - పండగ నిర్వహణ కమిటీ వాలంటీర్లకు తెలియజేయండి. అందరం సామరస్యంగా సమాధానాలు వెదకుదాం - *ఇది మనందరి గ్రామ పండగ:* ప్రతిఒక్కరి భాగస్వామ్యమే, మొక్క ముడుపు పండగ సమిష్టి విజయానికి తొలిమెట్టు 🙏🏼