28/11/2024
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
(ప్రభుత్వ సంస్ధ)
కమ్యూనికేషన్ సెల్ :: కార్పొరేట్ ఏరియా
పత్రికా ప్రకటన
తేదీ. 28.11.2024
కొత్తగూడెం ఇల్లందు క్లబ్ నందు డైరెక్టర్ (పి&పి) & ‘పా’ శ్రీ జి.వేంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన గుర్తింపు సంఘం
(ఏఐటియూసి) యూనియన్ తో 50 వ నిర్మాణాత్మక సమీక్షా సమావేశం
సింగరేణి కార్మికుల పలు సమస్యలపై డైరెక్టర్ (పి&పి) & ‘పా’ శ్రీ .వేంకటేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన కొత్తగూడెం ఇల్లెందు క్లబ్ నందు ఈ రోజు తేదీ: 28.11.2024, గురువారం నాడు గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటియూసి) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వి.సీతారామయ్య ,జనరల్ సెక్రెటరీ కె. రాజ్ కుమార్ మరియు ఇతర తొమ్మిది ఏరియాల నాయకులతో 50 వ నిర్మాణాత్మక సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశం లో ముందుగా సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ఎన్.బలరామ్, ఐఆర్‌ఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని ఉద్దేశించి గుర్తింపు సంఘం నాయకులతో మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో ఉత్పత్తి ఉత్పాదకత లో కార్మిక సంఘాల పాత్ర చాలా కీలకమైనది అని సింగరేణి సంస్థ ఉత్పత్తి మరియు ఉత్పాదకత లోనే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి కూడా ఎక్కువ ప్రదాన్యతను ఇస్తుంది అని తెలిపారు. అదే విధముగా ఏఐటియూసి గుర్తింపు సంఘం గాఎన్నిక అయ్యాక జరుగుతున్న మొదటి మరియు సంస్థలో 50 నిర్మాణాత్మక సమావేశం సంధర్భముగా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ఏవిధముగా ఉత్పత్తి లక్ష్య సాధనలో సహకరించారో ఇక ముందు కూడా సహకరించాలని కోరారు.
అనంతరం డైరెక్టర్ (పి&పి)& ‘పా’ శ్రీ .వేంకటేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన సుహృధ్భావ వాతావరణంలో ఉద్యోగుల డిమాండ్ల పై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
ఈ సమావేశంలో ఈ క్రింది అంశాలపై చర్చించడం జరిగింది.
1. ఎన్ .సి.డబ్ల్యూ.ఏ పరిధిలోకి రాని అన్ని అలవెన్సులు పెంచాలి.
I. కార్మికులందరికీ కొత్త ఇన్సెంటివ్ పాలసీని ప్రవేశపెట్టాలి మరియు ప్లే డేస్ మరియు పిహెచ్‌డిలలో ఎన్-1 పాలసీని రద్దు చేయాలి.
II. 2000 ర్యాంక్‌తో సంబంధం లేకుండా ప్రస్తుత మెరిట్ స్కాలర్‌షిప్ 57 స్లాట్‌లకు చెల్లించాలి మరియు మెరిట్ స్కాలర్‌షిప్‌ను రూ. 50,000/-.కు పెంచాలి.
III. కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న రామగుండంలోని మెడికల్ కాలేజీలో సింగరేణియన్లకు 25% MBBS సీట్లు రిజర్వ్ చేయాలి.
2. కార్పోరేషన్ మెడికల్ బోర్డ్ ద్వారా అండర్ గ్రౌండ్ కి అనర్హులుగా ప్రకటించిన మైనింగ్ సిబ్బంది, ట్రేడ్స్‌మెన్ మరియు ఈ.పి.ఆపరేటర్లు (సర్టిఫికెట్ హోల్డర్లు) కు సూటబుల్ జాబ్ అందించాలి మరియు ఉపరితలంపై తగిన పని ఇవ్వాలి.
I. సింగరేణి లో తొలగించబడిన జే.ఎం.ఇ.టి లను మరియు ఇతరులందరిని పునరుద్ధరించాలి.
3. ప్రైవేట్ ఏజెన్సీలకు బదులుగా, సింగరేణి లోని అన్ని క్యాంటీన్ లను నాణ్యత మరియు తగు పరిమాణంతో యాజమాన్యమే నిర్వహించాలి.
I. క్యాంటీన్ ఖర్చు కోసం ప్రతి ఉద్యోగికి రోజుకు రూ.25/- అందించాలి.
II. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం కల్పించాలి.
4. కేడర్ స్కీమ్ మరియు ప్రమోషన్ పాలసీని సర్వే స్టాఫ్, కెమిస్ట్‌లు (క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్), ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పారా-మెడికల్ స్టాఫ్, POAలు, వర్క్‌షాప్ లలో మెల్టార్‌లుగా మరియు క్లర్క్‌లలో (2019 మార్గదర్శకాల ప్రకారం).E.P.ఆపరేటర్లు Gr.-D నుండి Cకి మరియు Gr-C నుండి Bకి సమయానుకూల ప్రమోషన్లలో పదోన్నతి కల్పించాలి.
5. పెండింగ్‌లో ఉన్న అన్ని డిపెండెంట్ ఉద్యోగ కేసులతో సహా వంచన మరియు విజిలెన్స్ కేసులలో జప్తు చేయబడిన మొత్తాన్ని సమీక్షించి, క్లియర్ చేయాలి.
6. మెషిన్ మైనింగ్ మరియు సెమీ మెకనైజ్డ్ మైనింగ్ విభాగాలకు ట్రేడ్స్‌మెన్ హెల్పర్‌లను కేటాయించాలి మరియు UG పనిలో ట్రేడ్స్‌మెన్ కోసం అధికార పరిధిని నిర్వచించాలి.
పైన చర్చించిన అంశాలపై త్వరలో సానుకూలముగా నిర్ణయం తీసుకుంటామని డైరెక్టర్ (పి&పి)& ‘పా’ శ్రీ జి. వేంకటేశ్వర రెడ్డి గారు తెలిపారు.
ఈ సమావేశంలో యజమాన్యం తరపున డైరెక్టర్ (పి&పి)& ‘పా’ శ్రీ జి. వేంకటేశ్వర రెడ్డి, జిఎం( పర్సనల్) ఐఆర్&పిఎం కవితా నాయుడు, జిఎం(ఐఈ) టి.సురేష్ బాబు, జిఎం(ఫైనాన్స్) ఎం.సుబ్బా రావు, జిఎం(యూజి మైన్స్) వై. రఘు రామి రెడ్డి, జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & ఆర్‌సి కే.శ్రీనివాస రావు, ఏసిఎంఓ ఎం.ఉష, డిజిఎం(పర్సనల్) ఐఆర్ వింగ్ కే.అజయ్ కుమార్, రాజ గోపాల్ మరియు ఇతర అధికారులు గుర్తింపు సంఘం తరపున (ఏఐటియుసి) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, కేంద్ర ఉపాధ్యక్షులు వంగ వెంకట్, ఉప ప్రధాన కార్యదర్శులు కే.సారయ్య, వై.వి.రావు, మడ్డి ఎల్లా గౌడ్, కందికట్ల వీరభద్రం, ముస్కె సమ్మయ్య, నాయకులు వై.రాంగోపాల్, అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
జిఎం(ఐఆర్&పిఎం)