BTM SEVA Foundation

BTM SEVA Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BTM SEVA Foundation, Non-Governmental Organization (NGO), Mudumal, Narayanpet.

26/01/2025

గణతంత్ర దినోత్సవం సందర్భంగా
బీటీఎం సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
రెండు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన వివిధ ఆటల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన బీటీఎం సేవ ఫౌండేషన్ తిమ్మయ్య గారు మరియు వారి టీమ్.
ఈ కార్యక్రమం విద్యార్థుల స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.
✊🏼🇮🇳🙏

Thank You So Much

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లల ముఖాల్లో చిరునవ్వులు🇮🇳 2025 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీటీఎం సేవ ఫౌండేషన్...
26/01/2025

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లల ముఖాల్లో చిరునవ్వులు

🇮🇳 2025 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీటీఎం సేవ ఫౌండేషన్ తరపున ముడుమల్ ప్రైమరీ స్కూల్ పిల్లలకు గిఫ్టులు మరియు స్వీట్స్ అందజేయడం జరిగింది.

బీటీఎం సేవ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ బి. తిమ్మయ్య గారు మాట్లాడుతూ,
మన రాజ్యాంగం అందించిన విలువలను గౌరవించి, పిల్లల భవిష్యత్తు మెరుగుపరచడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించాలి" అని సందేశం ఇచ్చారు.

బీటీఎం సేవ ఫౌండేషన్ సభ్యుడు బి. వెంకటేశ్ గౌడ్ గారు మాట్లాడుతూ,
"పాఠశాలకు సంబంధించిన ఏవైనా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించడానికి మా ఫౌండేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది" అని తెలిపారు.

ఇక ముడుమల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు డి. శేఖర్ గారు గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
పాఠశాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ, పిల్లల విద్యా ప్రమాణాలను పెంచడంలో మరియు మంచి వసతులను కల్పించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పాఠశాల గొప్ప ప్రగతిని సాధించింది.

👉 పిల్లలకు ఇచ్చే ప్రతి ప్రోత్సాహం దేశ భవిష్యత్తుకు వెలుగుని ప్రసాదిస్తుంది.

🇮🇳 మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

BTM SEVA FOUNDATION తరఫున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు! 🇮🇳మన స్వాతంత్ర్యానికి, రాజ్యాంగానికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రత్యేక ది...
26/01/2025

BTM SEVA FOUNDATION తరఫున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు! 🇮🇳

మన స్వాతంత్ర్యానికి, రాజ్యాంగానికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రత్యేక దినం సందర్భంగా, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి మనం చేసే ప్రతి చిన్న కృషి గొప్పదై ఉంటుంది.

ఈ రిపబ్లిక్ డే రోజున,
👉 సమానత్వం
👉 స్వేచ్ఛ
👉 సామరస్యం
వంటి విలువలను నిలబెట్టుకునేందుకు ప్రతిజ్ఞ చేద్దాం. 🙌

జై హింద్! 🇮🇳

బీటీఎం సేవ ఫౌండేషన్ తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు!ఆశలు ప్రకాశవంతం కాని దీపాల వలే వెలుగుల్నందిస్తాయి. ఈ దీపావళి, మీ ...
31/10/2024

బీటీఎం సేవ ఫౌండేషన్ తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

ఆశలు ప్రకాశవంతం కాని దీపాల వలే వెలుగుల్నందిస్తాయి. ఈ దీపావళి, మీ జీవితంలో విజయాలకి దారి చూపే వెలుగులు నింపాలి. సంతోషం, సఫలత, మరియు శాంతి, మీ ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. దీపావళి శుభాకాంక్షలు!

BTM SEVA FOUNDATION ❤️🙏

27/10/2024

డాక్టర్ విజయకుమార్ గారు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపిన పులి రాజు గారు

బాబు బాటలో సత్యశోధన పాదయాత్రలో భాగంగా 26వ రోజు ధన్వాడ నుంచి చిన్న జట్రం గ్రామానికి పాదయాత్ర సాగుతుండగా, ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతూ రైతు ఆత్మహత్యల గోస రచయిత పులి రాజు సార్, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ ఉమేష్ సార్, వనపర్తి జిల్లాకు చెందిన సామాజిక బాధ్యత కలిగిన యువకుడు బాలకృష్ణ గారు, బీటీఎం సేవ ఫౌండేషన్ అధ్యక్షులు బి.తిమ్మయ్య గారు, మరియు బీటీఎం సేవ ఫౌండేషన్ సభ్యుడు ఎండి సోఫీ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంలో పులి రాజు గారు రచించిన రైతన్నలారా ఆత్మహత్యలు వద్దు! కుటుంబాలు ముద్దు!! అనే కరపత్రాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ విశ్రాంత విద్యాధికారి డాక్టర్ విజయకుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పులి రాజు గారు మాట్లాడుతూ, "ఈ వయసులో ఒక ఉద్యమంలా విజయకుమార్ గారు చేస్తున్న పాదయాత్ర నేటి యువతకు స్ఫూర్తిదాయకం. రైతులకు సేంద్రీయ వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం ఎంతో అద్భుతం" అని పేర్కొన్నారు. ఉమేష్ గారు కూడా "ఈ పాదయాత్ర ప్రజల్లో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాం" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫార్మర్ శ్యామ్, కేపీ లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ విజయకుమార్ గారు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపిన పులి రాజు గారుబాబు బాటలో సత్యశోధన పాదయాత్రలో భాగంగా 26వ రో...
27/10/2024

డాక్టర్ విజయకుమార్ గారు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపిన పులి రాజు గారు

బాబు బాటలో సత్యశోధన పాదయాత్రలో భాగంగా 26వ రోజు ధన్వాడ నుంచి చిన్న జట్రం గ్రామానికి పాదయాత్ర సాగుతుండగా, ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతూ రైతు ఆత్మహత్యల గోస రచయిత పులి రాజు సార్, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ ఉమేష్ సార్, వనపర్తి జిల్లాకు చెందిన సామాజిక బాధ్యత కలిగిన యువకుడు బాలకృష్ణ గారు, బీటీఎం సేవ ఫౌండేషన్ అధ్యక్షులు బి.తిమ్మయ్య గారు, మరియు బీటీఎం సేవ ఫౌండేషన్ సభ్యుడు ఎండి సోఫీ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంలో పులి రాజు గారు రచించిన రైతన్నలారా ఆత్మహత్యలు వద్దు! కుటుంబాలు ముద్దు!! అనే కరపత్రాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ విశ్రాంత విద్యాధికారి డాక్టర్ విజయకుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పులి రాజు గారు మాట్లాడుతూ, "ఈ వయసులో ఒక ఉద్యమంలా విజయకుమార్ గారు చేస్తున్న పాదయాత్ర నేటి యువతకు స్ఫూర్తిదాయకం. రైతులకు సేంద్రీయ వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం ఎంతో అద్భుతం" అని పేర్కొన్నారు. ఉమేష్ గారు కూడా "ఈ పాదయాత్ర ప్రజల్లో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాం" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫార్మర్ శ్యామ్, కేపీ లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

23వ రోజు పాదయాత్ర | చిన్న పొర్ల నుండి ఉట్కూరుడాక్టర్ విజయకుమార్ సార్ గారి 23వ రోజు పాదయాత్రకు బీటీఎం సేవా ఫౌండేషన్ తరఫున...
27/10/2024

23వ రోజు పాదయాత్ర | చిన్న పొర్ల నుండి ఉట్కూరు

డాక్టర్ విజయకుమార్ సార్ గారి 23వ రోజు పాదయాత్రకు బీటీఎం సేవా ఫౌండేషన్ తరఫున ఘన సన్మానం!

ఈ మహోన్నత యాత్రలో బీటీఎం సేవా ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ బి. తిమ్మయ్య గారు మరియు టీమ్ మెంబర్స్ ఫార్మర్ శ్యామ్, ఎండి సోపి గారు పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా, శ్రీ బి. తిమ్మయ్య గారు డాక్టర్ విజయకుమార్ గారి పాదయాత్ర గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేస్తూ దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

బీటీఎం సేవా ఫౌండేషన్ సభ్యుడైన ఫార్మర్ శ్యామ్ గారు పాదయాత్రలో భాగస్వామ్యం కావడం మా ఫౌండేషన్‌కు గర్వకారణం.🇮🇳🙏✊

న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంతేదీ: 15/09/2024ప్రదేశం: డాక్టర్ జయచంద్ర మోహన్ సార్ గారి వ్యవసాయ క్షేత్రం, నారాయణపేట ...
15/09/2024

న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం

తేదీ: 15/09/2024
ప్రదేశం: డాక్టర్ జయచంద్ర మోహన్ సార్ గారి వ్యవసాయ క్షేత్రం, నారాయణపేట జిల్లా

ఆయోజకులు: సుభిక్ష అగ్రి ఫౌండేషన్
సహకార సంస్థ: బిటియం సేవ ఫౌండేషన్ BTM SEVA Foundation Bhisembli Thimmaiah

లబ్ధిదారులు: 40 మంది మహిళా రైతు ఆత్మహత్య కుటుంబాలు

కార్యక్రమం ముఖ్యాంశాలు:
ఈ కార్యక్రమం బిటిఎం సేవ ఫౌండేషన్ అధ్యక్షులు B. తిమ్మయ్య గారి ప్రియమైన తల్లిగారు కీ|| శే|| శ్రీమతి బిసెంబ్లీ బీరమ్మ గారి తొలి వర్ధంతి సందర్భంగా నిర్వహించబడింది. సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సహకారంతో రైతు ఆత్మహత్య కుటుంబాలకు న్యూట్రిషన్ కిట్ల & జ్ఞాపకార్ధకంగా టిఫిన్ బాక్సులు కూడా పంపిణీ చేయడం జరిగింది.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

అయ్యప్ప గారు (అడ్వకేట్), మరికల్

అశోక్ గౌడ్ గారు (మాజీ సర్పంచ్), ముడుమల్

అంజలయ్య గౌడ్ గారు (మాజీ MPTC), ముస్తాపేట

సుభిక్ష అగ్రి ఫౌండేషన్ టీం సభ్యులు

బీటీఎం సేవ ఫౌండేషన్ టీం సభ్యులు

ఇతర సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు

అతిథులు ప్రసంగాలు:
ముఖ్య అతిథులు రైతు ఆత్మహత్యల ప్రభావం గురించి మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడటమే కాకుండా, వారు సమాజంలో ధైర్యంతో నిలబడేందుకు మనం ఎలా మద్దతు ఇవ్వాలో చర్చించారు. మహిళలు తమ కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలి అన్న విషయాలపై వారు ప్రోత్సాహకరమైన ప్రసంగాలు చేశారు.

అతిథులు తమ మాటల్లో రైతు కుటుంబాలను ప్రోత్సహిస్తూ, న్యూట్రిషన్ కిట్ల పంపిణీ మాత్రమే కాకుండా, సమాజంలో ఈ కుటుంబాలు ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

మధ్యాహ్నం భోజనం:
కార్యక్రమంలో పాల్గొన్న వారికీ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.







⭐️ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తికిప్రియమైన B. తిమ్మయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు! 🎉 💖 BTM సేవా ఫౌండేషన్ టీం ను...
09/09/2024

⭐️ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తికి
ప్రియమైన B. తిమ్మయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు! 🎉

💖 BTM సేవా ఫౌండేషన్ టీం నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు
మీరు సృష్టించిన BTM సేవా ఫౌండేషన్ ద్వారా, ప్రజల హృదయాల్లో మీరు చిమ్మిన ప్రేమ మాకు నిరంతర ప్రేరణ.

🌟 మీ సేవలో చూపించిన అంకితభావం
మీ అంకితభావం మరియు కృషి, సమాజం పై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తూ, కొత్త ఆశలను తెచ్చిపడుతుంది.

✨ మీ ఆత్మీయత మరియు నిబద్ధత
మీ ఆత్మీయత మరియు నిబద్ధత మాకు ప్రేరణగా నిలుస్తూ, కొత్త మార్గాలను తెరుస్తాయి.

🙏మీకు శివుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ
మీ జీవితం విజయాలు సాధించేందుకు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.

🌹ఇదే సమయంలో, మీ ప్రియమైన తల్లి గారిని స్మరించుకుంటూ
ఆమె మీరు చేసిన సేవలకు సాక్షిగా ఉన్నారు, ఆమె ఆశీస్సులతో మీ జీవితంలో మరింత విజయాలు సాధించండి.

BTM SEVA FOUNDATION TEAM 🤝🩷




News Articles Yesterday Teachers Day Program Grand SuccessThanks Everyone
06/09/2024

News Articles

Yesterday Teachers Day Program Grand Success

Thanks Everyone

ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ముడుమల్ ప్రాథమిక పాఠశాల!ముడుమల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్య...
06/09/2024

ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ముడుమల్ ప్రాథమిక పాఠశాల!

ముడుమల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో, బిటిఎమ్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బి.తిమ్మయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డీ.శేఖర్ సార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి.తిమ్మయ్య గారిని శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల పాత్ర, విద్యార్థుల భవిష్యత్, మరియు పాఠశాల అభివృద్ధి గురించి మాట్లాడి, ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.









#2024

ప్రియమైన తల్లి కీ|| శే|| శ్రీమతి భిషంబ్లీ బీరమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగామేము ఆమె చూపించిన అమూల్యమైన ప్రేమ, ఆప్యాయత,...
01/09/2024

ప్రియమైన తల్లి కీ|| శే|| శ్రీమతి భిషంబ్లీ బీరమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా

మేము ఆమె చూపించిన అమూల్యమైన ప్రేమ, ఆప్యాయత, మరియు మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆమె కరుణ, సహాయం, మరియు మంచి మనసు బీటీఎం సేవ ఫౌండేషన్‌కు ఎప్పటికీ మార్గదర్శకమవుతాయి.

ఆమె స్మృతులు మాకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయి, మరియు ఆమె చూపిన మార్గంలోనే మేము ముందుకు సాగుతాము.

ఈ స్మరణలో ఆమె కుమారుడు బి తిమ్మయ్య గారు మరియు ఆయన కుటుంబానికి మా గౌరవం మరియు కృతజ్ఞతలు.

ఓం శాంతి. 🙏

Address

Mudumal
Narayanpet

Website

Alerts

Be the first to know and let us send you an email when BTM SEVA Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share