04/08/2023
అర్ధరాత్రి వేళలో కూడా ఆగని స్వేరోస్ సేవలు.
రాత్రి సుమారుగా 12 గంటల 18 నిమిషాలకు కందుకూరి నివాసి అయిన శిరీష గారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో , అక్కడ ఉన్న వైద్యులు కోటి మెటర్నరీ హాస్పిటల్* కి తరలించమని సూచించగా వెంటనే కుటుంబ సభ్యులందరూ తనని కోటి మెటర్నరీ హాస్పిటల్ కి తరలిస్తూ , సహాయం కోసం నాకు ఎమర్జెన్సీ హెల్త్ హెల్త్ వాలంటీర్
రవి వర్మ కి ఫోన్ చేయడం జరిగింది .
పరిస్థితి తెలిసిన వెంటనే, హాస్పిటల్ లో ఉన్న మన లైఫ్ లైన్ లీగ్ L3 వైద్య నిపుణులు Dr. సత్యా మేడం గారికి కాల్ చేసి సమాచారం అందించడం జరిగింది, అర్ధరాత్రి వేళలో కూడా , నిద్రలో ఉన్నప్పటికీ సంకోచించకుండా తను అందుబాటులో ఉన్న సిబ్బందితో మాట్లాడి , పరిస్థితి తెలుసుకొని ఏం చేయాలో, అక్కడి వైద్య నిపుణులకు సూచించారు . అలాగే నాలుగు గంటల వరకు రాత్రి అంతా 12 గంటల నుండి నాలుగు గంటల వరకు పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అరగదీస్తూ తెల్లవారే సమయానికి తల్లి కూతుర్ల ప్రాణాలు కాపాడి కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు .
సమయానికి స్పందించి సరైన వైద్యం అందేలా చేసిన Dr. సత్యా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే స్వేరోయిజం అనే బీజాలు నాటుతు, ఎంతో గొప్ప భావజాలాన్ని అందించిన స్వేరోస్ వ్యవస్థాపకులు డా. ఆర్ . ఎస్ . ప్రవీణ్ కుమార్ సార్ గారికి కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
జై భీం జై స్వేరో .