The Great Miryalaguda

Directions

The Great Miryalaguda Here Providing info of miryalaguda...

and this is the place for meet old friends and old memories...

come and join all r invited....

With Prop Department – I just got recognised as one of their rising fans! 🎉
27/07/2026

With Prop Department – I just got recognised as one of their rising fans! 🎉

24/07/2026

Alochinchavalsina avasaram eanthaina Undi.

Think Positive.

ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి సెయింట్ మేరీ స్కూల్ లో గత 30 సంవత్సరాలకు పైగా తమ...
11/07/2026

ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి సెయింట్ మేరీ స్కూల్ లో గత 30 సంవత్సరాలకు పైగా తమ సేవలు అందించి ఈరోజు పదవి విరమణ పొందిన గౌరవనీయురాలు శ్రీమతి *విద్య టీచర్* గారికి విద్యార్థులందరీ తరపున... పాదాభివందనం....🙏🙏🙏

అమ్మ మీరు 30 సంవత్సరాలా క్రితం నేర్పించిన డిసిప్లిన్,సమయపాలన పరిశుభ్రత & పర్సనల్ కేర్... ఇంకా పాటిస్తున్నాం...

ప్రతి సంవత్సరం స్కూల్ అన్యువల్ డే కి లేదా రిపబ్లిక్ డే కి లేదా ఇండిపెండెన్స్ డే కి మీరు నేర్పించే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ డ్రిల్స్ మేము మర్చిపోలేము...

ఇప్పుడు మేము మా పిల్లల్ని లక్షలు పోసి హైదరాబాదులో ఇంకా చాలా మెట్రోపోలియన్ సిటీస్లో చదివిపిస్తున్నాం కానీ మేము నేర్చుకున్న అలాంటి డ్రిల్స్ ఫిజికల్ ఎక్ససైజ్ మాత్రం ఏ స్కూల్లో నేర్పించడం లేదు...

మీరు కేవలం P E T టీచర్ కాదు....

మా అందరి హృదయాలను నిలిచిపోయే ఒక గొప్ప సింగర్...

▶️▶️▶️నాకు 6 ఏండ్లు ఉన్నప్పుడు అనుకుంటా మీరు ఒక పాట పాడారు కార్గిల్ వారి గురించి...

1.జోహారూ జోహారూ జోహారూ జోహారూ గణపయ్య నీకు జోహారూ.... (కార్గిల్ వార్ థీమ్ సాంగ్... మీరే రాశారు...)

2 హే మాలిక్ తేరే బందే హమ్....

3.అందమైన వెన్నెలలో నా పాటకి మీరు రాసిన జాతీయ పతాకం పేరడీ పాట....

ముందున్నది కాషాయం...
శాస్తాసంపద సౌలభ్యం...

❇️మీ whistle కి ఉండే గ్రీన్ hanging....

❇️మీ Drum Stick కి ఉండే Cream Colour Cushion.

❇️మీ పాటలు రాసే Brown Colour డైరీ...

❇️మీరు రైట్ హ్యాండ్ కి వాచ్ పెట్టుకోవడం...

కళ్ళు మూసుకుంటే ఇంకా కనిపిస్తున్నాయి...

300-500 మంది పిల్లలు డ్రిల్ చేస్తున్నప్పుడు కనీసం అందులో 100 మంది పేర్లు మీకు గుర్తుండేవి పేర్లతో పిలిచే వారు మమ్మల్ని ఇంకా గుర్తుందమ్మా...

గుర్తుందమ్మా అన్ని గుర్తున్నాయి....🙏🏻🙏🏻🙏🏻

👇🏻👇🏻👇🏻

ఒకరోజు మీ పిల్లల్ని అంటే Kunni & Goldy ni చర్చి ముందు సెటప్ చేసిన చిన్న రంగులు రత్నం ఎక్కించడానికి తీసుకొని వచ్చారు....

అక్కడ ఒక పిల్లోడు మన స్కూల్ యూనిఫామ్ వేసుకొని నించునున్నాడు... పాపం పసివాడికి ఆ రంగుల రత్నం ఎక్కాలని ఉంది...కానీ వాడి దగ్గర డబ్బులు లేవు చాలామంది పిల్లలు ఎక్కుతున్నారు ఆ తిప్పే అతను కాసేపు తిప్పి దింపేస్తున్నాడు వాళ్ళ అందరి దగ్గర రెండు రూపాయలు తీసుకుంటున్నాడు మీరు వచ్చారు మీ పిల్లల్ని ఎక్కించారు....

తిప్పడం అయిపోయింది వెళ్ళిపోతున్నారు ఆ పక్కన ఉన్న పిల్లోడు మన స్కూల్ యూనిఫాంలో బాగ్ తో ఉన్నాడు...ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేసారో తెలియదు...

మీరు వచ్చి ఆ పిల్లోడిని కూడా ఎక్కించి ఆ రంగులరాట్నం తిప్పే అతనికి డబ్బుల్ని ఇచ్చారు...

ఆ అబ్బాయి దిగిన తర్వాత వాడి మొహం లో ఉన్న సంతోశం ని చూసి మీరు నవ్వినవ్వు నేను ఇంకా మర్చిపోలేదు అమ్మ...😊😊😊

ఆ పిల్లోడు ఇప్పుడు బాగా చదివాడు పెద్ద అయ్యాడు...

ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నాడు వాడు కంపెనీ సీఈఓ... కం ఓనర్...
50 మంది కి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు...

ఆ పిల్లాడిని నేనే అమ్మ మీరు చూపించిన అమ్మ ప్రేమ నేనెప్పటికీ మర్చిపోలేను....

📌25 సంవత్సరాల తర్వాత స్కూల్ కి వస్తే చాలా దూరం నుంచి నన్ను చూసి గుర్తుపట్టి నన్ను పేరు పెట్టి పిలిచారు అమ్మ 2023 సంవత్సరంలో....

*పక్కనున్న నా భార్య అదేంటి నువ్వు స్కూల్లో సెవెంత్ క్లాస్ వరకే కదా చదివావు... ఆ టీచర్ ఇన్ని సంవత్సరాల తరవాత ఇప్పుడెలా గుర్తు పట్టింది అని అడిగింది అమ్మ...*

నేను అప్పుడు తనకి ఒకటి సమాధానం చెప్పను...

మా టీచర్ 500 మందికి ఒకేసారి డ్రిల్ చేపిస్తూ కనీసం 100 మందిని పేరు పెట్టి పిలుస్తారు...

ఆమె పేర్లు ఎప్పటికీ మర్చిపోరు అని....

ఇలా నా లాంటి ఎంతో మందికి మీరు రియల్ ఇన్స్పిరేషన్ అమ్మ.....

🙏🙏🙏

ఒకసారి సుందర్ పిచాయ్ స్నేహితులతో కలిసి ఒక హోటల్ లో కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు.ఎవరి సరదాల్...
08/01/2026

ఒకసారి సుందర్ పిచాయ్ స్నేహితులతో కలిసి ఒక హోటల్ లో కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు.

ఎవరి సరదాల్లో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక బొద్దింక ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకామె మీదకు ఎగిరింది. అంతే! హోటల్ దద్దరిల్లేలా అరిచి, గోల చేసి, ఎగిరి.. ఎలాగైతేనేం బొద్దింకను విదిల్చి కొట్టింది. అది కాస్తా వెళ్లి రెండో అమ్మాయి మీద పడింది. ఆవిడ కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టింది.

ఆ గందరగోళం లోనే దాన్ని విదిల్చేసరికి అది వెళ్ళి ఒక సర్వర్ మీద పడింది. అతను చాలా ప్రశాంతంగా ఆ బొద్దింకను పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు విసిరేశాడు.

ఈ సంఘటన విన్నాక మీకేమనిపించింది? ఒక పది సెకన్లు ఆలోచించి మీకు ఏదో ఒకటి అనిపించాక ఇది చదవండి.

మీలాగే ఈ దృశ్యాన్ని చూసిన సుందర్ పిచాయ్ కు కూడా కొన్ని ఆలోచనలు వచ్చాయి. మనకొచ్చిన ఆలోచనలకు, అతని ఆలోచనలకు తేడా ఏమిటో అతని మాటల్లోనే తెలుసుకుందాం.

కాఫీ తాగుతూ జరిగిందంతా చూసిన నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ గందరగోళం అంతటికీ కారణం ఏమిటి? ఆ అమ్మాయిలు అంత హిస్టీరిక్ గా మారిపోడానికి కారణం ఏమిటి?

బొద్దింకా? అలా అయితే ఆ సర్వర్ మీద పడింది కూడా అదే బొద్దింక కదా!

అతనెందుకు వీళ్ళలా డిస్టర్బ్ కాలేదు?

అంటే కారణం బొద్దింక కాదు. బొద్దింక వలన కలిగిన ఇబ్బందిని ఆ ఇద్దరమ్మాయిలూ ఒకలా, అతనొకలా స్వీకరించారు.

అప్పుడు నాకర్థమైంది... ఇంట్లో మా నాన్న లేదా ఆఫీసులో బాస్ లేదా భార్య నా మీద అరిచినప్పుడు నాకు కలిగే చిరాకుకు కారణం ఏంటో? దానికి కారణం వాళ్ళ అరుపులు కాదు. వాళ్ళ అరుపుల వల్ల నాలో చిరాకు పుట్టకుండా నన్ను నేను అదుపు చేసుకోలేక పోతున్నాను.

రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే నాకు కలిగే అసహనానికి కారణం ట్రాఫిక్ కాదు, అలాంటి పరిస్థితిలో అసహనానికి గురవ్వకుండా నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నానన్న మాట.

సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరువల్లే జీవితం గందరగోళంగా తయారవుతోంది. బొద్దింక ఘటన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే...

సమస్యల పట్ల స్పందించడం కన్నా, సమస్యను అధిగమించడం ముఖ్యం.

బొద్దింక రూపంలో వచ్చిన సమస్యకు ఆ అమ్మాయిలు అతిగా స్పందించారు. కానీ ఆ సర్వర్ స్పందించకుండా, సమస్యను అధిగమించాడు.

స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో కూడుకుని ఉంటాయి. సమస్యను అధిగమించడం అనేది మాత్రం ఆలోచనలతో కూడుకుని ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే జీవితం అందంగా అనిపిస్తుంది.

ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని కాదు. తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులన్నిటి పట్లా అతను సరైన వైఖరితో ఉన్నాడని అర్థం.

Source: Quora.

06/12/2025

Address

Miryalaguda
Nalgonda
508207

Website

Alerts

Be the first to know and let us send you an email when The Great Miryalaguda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share