30/08/2025
🕉️>🕉️
*🎊:: జ్ఞాన వికాస భారతి ::🎊*
1. *మట్టి గణపతి, మహా గణపతి.. సనాతన హిందూ ధర్మ సాంప్రదాయాల ఒరవడిలో ప్రారంబించుకున్న గణపతి ఉత్సవాలు వినూత్న రీతిలో సాంప్రదాయబద్దంగా ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న విషయం మనందరికీ విదితమే.! దీంట్లో భాగంగా మట్టి వినాయకుని ప్రతిష్ట చేసుకోవడం... "గంగ, యమునా, సరస్వతి, నర్మదా, సింధూ, కృష్ణా, గోదావరి జలాలతో పూజించిన సప్తనది మహా గంగా జల కలశాల చేత గణపతిని స్వయంగా భక్తులచే అభిషేకించడం ద్వారా నిమజ్జనం చేయుచున్నాము.!"*
2. *ఈయొక్క సప్తనది జలాలచే నిమజ్జనం చేసిన గణపతి మృత్తికను (మట్టిని) భక్తులకు అందిచడం.!*
3. *ఇట్టి మృత్తికను (మట్టిని) భక్తులు తమ తమ తులసి కోటలోను, పెరటి మొక్కలకు, పంట పొలాలకు, ఓపెన్ ప్లాట్ లలోను పొలిలా చల్లుకోవడం ద్వారా మరింత పవిత్రతను చేకూర్చుకోవడం. పూర్వ కాలంలో చెరువులలోని మట్టిని గణపతి గా చేసి 5 లేదా 9 రోజులు శోడ శోధ చాపములచే పూజించి చివరగా మన చెరువులలో నిమజ్జనం చేయడం ద్వారా పవిత్రత చేకూరిన ఆ గణపతుల మట్టి చెరువుల నీళ్ళల్లో కలవడం ద్వారా ఆయొక్క నీరు మళ్ళీ మన పంట పొలాల్లోకి పారి ఎరువులా పంటలకు జవసత్వాన్ని, పవిత్రతను చేకూర్చడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం భుజించేవారము కానీ ఈమధ్య కాలంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతి రూపములో వచ్చినందున వాటిని మన చెరువు నదుల్లో నిమజ్జనం చేయడము వలన అనారోగ్యానికి గురవుతున్నాము. జలాచర జీవుల మనుగడను ప్రశ్న్తార్తకం చేస్తున్నాం. కావున నవరాత్రులు లేదా 5 రోజులు పూజించిన గణపతి మట్టిని ఈ సప్తనది జలాల ద్వారా నిమజ్జనం చేసి ఆయొక్క మట్టిని మళ్ళీ మన పంట పొలాలకు పొలిలా చల్లుకోవడం ద్వారా భగవంతుని కృపకు పాత్రులము కాగలుగుతాము.*
4. *మృత్తికా స్నానం ఆచరించుట:- ప్రకృతి వైద్యంలో భాగంగా మృత్తికా స్నానం శరీరానికి ఎంతో శ్రేష్టమైనది. ఒండ్రు మట్టిని శరీరమునకు రుద్దుకుని అబ్యంగన స్నానం ఆచరించడం ద్వారా చర్మరోగాలను నివారించుకోవడం, శరీర సౌందర్యమును పెంచుకోవడం తద్వారా ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం.!*
*👉కావున భక్తాదులందరూ ఈయొక్క సప్తనదీ జల అభిషేక నిమజ్జనములో పాల్గొని వాయు కాలుష్యమును, జల కాలుష్యమును నివారిస్తూ గణేష్ నిమజ్జన మట్టిని తీసుకొని ఆయురారోగ్యములను పొందుతూ భగవత్ కృపకు ప్రాప్తులు కాగలరని అభిలశిస్తున్నాము.!*
____________________________
*సప్తనది గంగాజల అభిషేక నిమజ్జనం.!!*