Sri Lalitha Sahasranama Seva Samithi - Nagarkurnool

Sri Lalitha Sahasranama Seva Samithi - Nagarkurnool శ్రీ లలిత సహస్రనామ సేవా సమితి Official Page | భక్తి మరియు సేవా కార్యక్రమాలు | నాగర్ కర్నూల్

శ్రీ లలిత సహస్రనామ సేవా సమితి అనే ఈ సంస్థ ని నాగర్ కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ లోని కొంత మంది మహిళలు బృందం గా ఏర్పడి 2010 సంవత్సరం లో స్థాపించడం జరిగింది.
హిందూ పండుగలు మరియు బృంద సభ్యుల యొక్క ప్రత్యేక దినములలో, ఏదైనా దేవాలయము లేదా వారి గృహములలో శ్రీ లలిత సహస్రనామ పారాయణము చేసి ఆధ్యాత్మిక భావన పెంపొందించటం తో పాటు మానసిక ప్రశాంతత పొందాలనే ముఖ్య ఉద్దేశం తో మా బృందం కార్య కలాపాలు మొదలు పెట్

టినది.
క్రమేణా బృంద సభ్యుల మరియు ఇతర దాతల ఆర్థిక సహాయ సహకారాలతో బృంద కార్యకలాపాలను శ్రీ లలిత సహస్రనామ పారాయణము తో పాటు సేవా కార్యక్రమాలకు విస్తరించి శ్రీ లలిత సహస్రనామ సేవా సమితిగా రూపాంతరం చెందింది.

నాగర్కర్నూల్ పట్టణం లో ఇట్టి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవాలనే ప్రతి ఒక్కరికి మా ఈ సేవా సమితి సదా ఆహ్వానం పలుకుతుంది...

08/02/2026

Day4

News coverage
07/02/2026

News coverage

07/02/2026

Day3

07/02/2026
07/02/2026

Day2

04/02/2026

Day 1

02/02/2026

🕉️ఓం శ్రీమాత్రే నమః🕉️

🕉️ *ఓం నమఃశివాయ*🕉️

*@శ్రీ లలితా సహస్రనామ సేవా సమితి@*

@@శివ స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం@@

*@@13వ వార్షికోత్సవం@@*

"శ్రీ లలితా సహస్రనామ సేవాసమితి" ఆధ్వర్యంలో శివ స్వాములకు మరియు శ్రీశైల యాత్రికులకు *అన్న ప్రసాద వితరణ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాలు* .. బృంద సభ్యులు మరియు దాతల సహకారంతో దిగ్విజయంగా ,నిరాటంకంగా పుష్కరకాలం పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము...

శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని.. ఈ సంవత్సరం కూడా ప్రసాద వితరణ కార్యక్రమం *తేదీ:-04/02/2026* (బుధవారం) నుంచి హౌసింగ్ బోర్డ్ బస్ స్టాప్ ఎదురుగా , నాగర్ కర్నూల్ లో "శ్రీ లలితా సహస్రనామ సేవాసమితి" ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతుంది..

దీనిలో భాగంగా ప్రతి రోజు

==>పండ్ల వితరణ , తాగునీటివసతి, అత్యవసర టాబ్లెట్స్ పంపిణీ(ఉదయం గం. 6:00 నుంచి రాత్రి గం.11:00 వరకు)

==>మధ్యాహ్నం గం.1.00 కి పార్వతీ పరమేశ్వరులకు మహా నైవేద్యం తో అర్చన తర్వాత శివ స్వాములకు మరియు శ్రీశైల యాత్రికులకు అన్నప్రసాద వితరణ

==>సాయంకాలం లలితా సహస్రనామ పారాయణం

==>రాత్రి అల్పాహార నైవేద్యం అనంతరం ప్రసాద వితరణ

ఇత్యాది మొదలగు కార్యక్రమాలు *తేది:-04/02/2026నుంచి తేది:-14/02/2026వరకు*
పదకొండు రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది..

==> *" రుద్రాభిషేకం"*
తేదీ:- *09/02/26
(సోమవారం) రోజున సాయంత్రం ప్రారంభమవుతుంది..

కావున..

భగవత్ సేవలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భగవత్ బంధువులందరూ పాల్గొనాలనీ మా సేవా సమితి తరుపున కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మనవి🙏🏻

Address

Housing Board
Nagarkurnool
509209

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Lalitha Sahasranama Seva Samithi - Nagarkurnool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share