Pathipally

Pathipally Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pathipally, Youth Organization, Pathipally, Mulugu.

  Admissions 2026-27 through NCET-2026🎓Shape your future with world-class teacher education in IITs, NITs and Central & ...
12/02/2026

Admissions 2026-27 through NCET-2026🎓

Shape your future with world-class teacher education in IITs, NITs and Central & State Universities etc. across India.

For further details & updates, applicants are advised to visit official & websites regularly.

Read here the Public Notice issued by NTA on 12.02.2026:https://nta.ac.in/Download/Notice/Notice_20260212140446.PDF

Application Submission: 12th Feb-10th March 2026

To apply-exams.nta.nic.in/ncet/
Details- web.ncte.gov.in

25 సంవత్సరాల పూర్వం పత్తిపల్లి గ్రామానికి ఆ కాలంలో నామమాత్రపు ఫీజులతో *కార్పొరేట్ స్థాయి విద్యను అందించిన మహానుభావుడు…ఆ ...
30/11/2025

25 సంవత్సరాల పూర్వం పత్తిపల్లి గ్రామానికి ఆ కాలంలో నామమాత్రపు ఫీజులతో *కార్పొరేట్ స్థాయి విద్యను అందించిన మహానుభావుడు…

ఆ సమయంలో పత్తిపల్లి గ్రామం నుండి **సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, నవోదయ, గురుకుల పాఠశాలల్లో** ప్రవేశం సాధించేందుకు శ్రమించిన అపూర్వ గురువు…
గ్రామీణ ప్రాంతాల్లో మంచి విద్యానందించడం ఎంత కష్టమో తెలిసినా, ఆ సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టి అనేక కుటుంబాల భవిష్యత్తు మార్చిన **విద్యా దాత**…
అనేక మందిని చదువుల బాట పట్టించి, విద్యావంతులుగా తీర్చి దిద్దిన #పత్తిపల్లి గ్రామ జ్యోతిరావ్ పూలే …

మీరు నేర్పిన పాఠాలు, చూపించిన దారి, ఇచ్చిన మార్గదర్శనం — ఇవి మాకు శాశ్వతమైన ఆదర్శం.
మీ సేవల కాంతి తరతరాలకు మార్గదర్శకంగా నిలిచిపోతుంది.

మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.

#ఓం_శాంతి
#సత్గతి_ప్రాప్తిరస్తు

***🙏🙏🙏***

మనభూమికి సహజ సిద్ధంగా ఏర్పడిన ఉపగ్రహం మన చంద్రుడు, ఇక మనిషి చే తయారుచేయబడ్డ ఉపగ్రహాలు మనభూమి చుట్టూ 6718 తిరుగుతున్నాయి,...
19/03/2025

మనభూమికి సహజ సిద్ధంగా ఏర్పడిన ఉపగ్రహం మన చంద్రుడు, ఇక మనిషి చే తయారుచేయబడ్డ ఉపగ్రహాలు మనభూమి చుట్టూ 6718 తిరుగుతున్నాయి, అందులో అతిపెద్దది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది మానవవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే ఉపగ్రహం. ఇక రాబోయే కాలంలో space X కంపెనీ మాత్రమే 12000 ఉపగ్రహాలనీ పంపబోతుంది.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రోజుకి 16 సార్లు మన భూమి చుట్టూ తిరుగుతుంది, అందుకే అందులో ఉండే శాస్త్రవేత్తలు ఒక రోజులో 16 సూర్యోదయలు 16 సూర్యాస్తమయాలు చూస్తారు, ఈ ఉపగ్రహం వేగం సెకండ్ కి ఐదు మైళ్ళు, గంటకి 28 వేల కిలోమీటర్లు, ఇది మన భూమికి 400 కి.మీ ఎత్తులో ఉంది.

అంతరిక్షంలో ఎక్కువ రోజులు Peggy Whitson అనే మహిళా శాస్త్రవేత్త 675 days గడిపితే, తర్వాత రెండవ స్థానంలో సునీత విలియమ్స్ 606 రోజులు గడిపారు, ఇక కల్పనా చావ్లా 30 రోజుల 14 గంటల సమయం గడిపారు, ఈ శాస్త్రవేత్తల ధైర్యం, తెగువ, జ్ఞానం, మానువాళికి ఎంతగానో ఉపయోగపడింది, భవిష్యత్తులో కూడా ఉపయోగపడబోతోంది.

మన సహజ ఉపగ్రహమైన చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజుల సమయం పడుతుంది, అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 90 నిమిషాలు సమయం తీసుకుంటుంది, అందుకే 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది ప్రతిరోజు. ఈ లెక్కన సునీత విలియమ్స్ తన చివరి మిషన్ లో4576 సార్లు భూమి చుట్టూ తిరిగారు, కిలోమీటర్లు అయితే 195 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించారు అంతరిక్షంలో.

కేవలం ఎనిమిది రోజులు పని కోసం వెళ్లిన సునీత విలియమ్స్, బచ్ విల్ మోర్, అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల 284 రోజులు గడపాల్సి వచ్చింది, ఆ సమయంలో వాళ్ల మానసిక, శారీరిక, సంఘర్షణ ఎలా ఉంటుందో వర్ణించడానికి మాటలు చాలవు. అవన్నీ తట్టుకొని మానవాళికి ఎంతగానో ఉపయోగపడే పరిశోధనలు చేసి భూమి కీ క్షేమంగా తిరిగి వచ్చిన వ్యోమగాములు కు నా హృదయపూర్వక అభినందనలు.❤️❤️❤️🎉

తెలంగాణలో  సర్పంచ్ జీతం 3000 అంటే సంవత్సరానికి 36,000మొత్తం 5 ఏళ్ళకి 1,80,000కానీ మనవాళ్ళు ఎలక్షన్ కి ఖర్చు పెట్టేది ఇంచ...
11/12/2022

తెలంగాణలో సర్పంచ్ జీతం 3000
అంటే సంవత్సరానికి 36,000
మొత్తం 5 ఏళ్ళకి 1,80,000
కానీ మనవాళ్ళు ఎలక్షన్ కి ఖర్చు పెట్టేది ఇంచుమించు 20,00,000..
ఏ ధైర్యంతో ఇంత ఖర్చు చేస్తున్నారు?
మీకు అర్ధమైతే ఒక్కసారి మాతో పంచుకోండి ప్లీజ్..
విచిత్రమేంటంటే కాలం ముగిసేలోగా మన వాళ్ళు అది సంపాదించి పైగా అంతకుఅంత వెనకేసుకుంటున్నారు! ఎలా??
మీకు తెలుసా!!
మీరు ఎప్పుడైనా గ్రామ సభకు వెళ్ళారా? ఒక్క గ్రామ సభకు ఎంత ఖర్చు పెడుతున్నారు?
అంబేడ్కర్ గారి విగ్రహం పెట్టమని కాదు మా స్కూల్ ని బాగు చేయండి అని ఎప్పుడైనా అడిగారా?
రామాలయం కాదు మనకి పర్మినెంట్ డాక్టర్ ఉండే ప్రాధమిక ఆసుపత్రి ఉంటే బాగుంటుందని అడిగారా?
మన ఊరి మొత్తం మీద ఇంటి పన్ను ఎంత వసూలు అవుతుంది ఎపుడైనా కనుక్కున్నారా?
మీ పంచాయతీలో గవర్నమెంట్ ఉద్యోగులు కాక మిగతా వారికి జీతం ఎంత ఇస్తున్నారు ఎంత రాస్తున్నారు చూసారా?
గవర్నమెంట్ స్థలాల్లో కొట్లు పెట్టుకున్నవారు పంచాయితీకి ఎంత కడుతున్నారు, వారు లెక్కల్లో ఎంత చూపిస్తున్నారు తెలుసుకున్నారా?
ఉపాధిహామీ పథకంలో ఎంతమంది 50-50 కి ఒప్పుకుని ఇంట్లోనే కూర్చుని సంపాదిస్తున్నారో తెలుసా?
పింఛను ఎంతమంది తీసుకుంటున్నారు?
ఎస్సి నిధులు ఎస్సి పేటలోనే ఖర్చు చేస్తున్నారా అని అడిగారా?
మీకు తెలుసుకోవాలనుంటే క్రింద అప్లికేషన్ పిక్ పెడుతున్నా.. ప్రింట్ తీసుకుని మీరు అడగాలనుకుంటున్నవి రాసి మీ పంచాయతీలో ఇవ్వండి. తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పెట్టండి పైసా ఖర్చు ఉండదు. ఇచ్చేటపుడు మీ సెల్ లో వీడియో తీయండి. మీ పంచాయితీకి మంచి రోజులు వచ్చినట్టే.. ప్రామిస్.

Address

Pathipally
Mulugu
506352

Alerts

Be the first to know and let us send you an email when Pathipally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pathipally:

Share