06/11/2025
*💥ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్💥*
రామకృష్ణాపూర్ పట్టణo లోని ప్రగతి కాలనీ కి చెందిన అల్లాడి ప్రేమ్ కుమార్ ది అత్యంత నిరుపేద కుటుంబం. ఇతను పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో అనారోగ్యం కారణం చేత ప్రాణం కోల్పోయాడు. అతనికి భార్య, మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. అతని కుటుంబం, అంత్యక్రియలు చేయడానికి సైతం డబ్బుల్లేక దయనీయ స్థితిలో ఉండడం జరగింది. వీరి పరిస్థితిని తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బాధితుని ఇంటికి వెళ్లి ,ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు ద్వారా *15,000/-* రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. దాతలు ఇంకా ఎవరైనా ఉంటే ఈ కుటుంబానికి సహాయం చేయగలరని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు బీనవేన సంపత్, అధ్యక్షుడు సుంకరి మల్లేష్, సభ్యులు సట్ల మహేందర్, జెట్టి శ్రీనివాస్ లు పాల్గొనడం జరిగింది.