Chaitanya orphanage and rehabilitation center

Chaitanya orphanage and rehabilitation center When u lose ur parents as a child, u r indoctrinated into a club, u r taken in2 life's severest confidence. You are undeceived.
-Chaitanya service society

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పి సి ఐ డి & కార్మికశాఖ, చైతన్య స్వచ్చంద సేవ సంస్థ, సంయుక్తంగా ఆపరేషన్ స్వేచ్ఛ ఫేస్ 3 బాల కార్మ...
08/11/2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పి సి ఐ డి & కార్మికశాఖ, చైతన్య స్వచ్చంద సేవ సంస్థ, సంయుక్తంగా ఆపరేషన్ స్వేచ్ఛ ఫేస్ 3 బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకై ప్రత్యేక తనిఖీ కార్యక్రమం 8-11-2024 నిర్వహించడం జరిగింది....

ఈ కార్యక్రమం లో చైల్డ్ లేబర్ లను గుర్తించి వారికి కౌన్సిల్లింగ్ ఇవ్వడం అండ్ వారిపై తగు సెక్షన్స్ లకింద కేసు కట్టడం జరిగింది....

ఈ కార్యక్రమం లో భాగంగా డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమీషనర్ లేబర్ శ్రీ డి. వి. రంగరాజు గారు, లేబర్ ఆఫీసర్ ఇర్ఫాన్ గారు, ఐ సి డి ఎస్ సూపర్వైసర్ ఎస్ శాంతమ్మ గారు, ఐ సి పి ఎస్ పి ఓ వెంకటరవికుమార్, చైతన్య స్వచ్చంద సేవ సంస్థ ఫౌండర్ కమ్ చైర్మన్ ఎం. పి ఆనందన్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కృష్ణచరణ్, సంస్థ సిబ్బంది, ర్ ఇ డి స్ సంస్థ మధుకర్ గారు పాల్గొనటం జరిగింది...

మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం మదనపల్లి ప్రభుత్వ పశువుల హాస్పిటల్ నందు నిన్న రాత్రి అనగా 18-10-2024 ఒక జెర్మన్ షేఫెర్డ్ ...
19/10/2024

మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం మదనపల్లి ప్రభుత్వ పశువుల హాస్పిటల్ నందు నిన్న రాత్రి అనగా 18-10-2024 ఒక జెర్మన్ షేఫెర్డ్ కుక్కను గుర్తు తెలియని వారు కట్టి వదిలివెయ్యడం జరిగింది... ఆ కుక్కకు చెవినందు ఇన్ఫెక్షన్ కారణంగా చాలా భాద అనుభవిస్తుంది, కావున దయచేసి కుక్కను పెంచుకునేవాళ్లందరికి ఒక సలహా పరిపూర్ణంగా చూసుకునేవాళ్ళే తీసుకొని పెంచవలసింగా కోరుతూన్నాను....
ఇంతకీ విషయం ఏంటంటే ఆహ్ కుక్క యజమానులే దానికి ట్రీట్మెంట్ చేసి ఎవ్వరికైనాధాత్తత ఇవ్వాల్సింది గా కోరుకుంటున్నాను.... కుక్కలా సహజ స్వభావం యజమానుల మాటవినడం.... అలాంటిది వెరెవ్యక్తులు దానికి ట్రీట్మెంట్ ఇప్పించడం చాలా కష్టం..... కావున దయచేసి దానికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి సహకరించాలసిందిగా కోరుకుంటూ మీ చైతన్య....
మీరు దూరం అయ్యారానే భాద తో అది ఇంకా ఇంకా భాద పడితే దాని ఆరోగ్యం ఇంకా క్షిణిచిపోతుంది.... ప్లీజ్ మీకెవరికైనా తెలిసింటే వారికి తెలియజేయండి...

మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు మహాలయ మహాలయ పితృపక్ష అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ మదన...
25/09/2022

మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు మహాలయ మహాలయ పితృపక్ష అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ మదనపల్లి

తెలంగాణా రాష్ట్ర,సిరిసిల్ల జిల్లా వేములవాడ లో నేడు నంది అవార్డ్స్ ప్రధానోత్సవం సందర్బంగా దాదాపు 22 సంవత్సరాలు సమాజ సేవకు...
17/07/2022

తెలంగాణా రాష్ట్ర,సిరిసిల్ల జిల్లా వేములవాడ లో నేడు నంది అవార్డ్స్ ప్రధానోత్సవం సందర్బంగా దాదాపు 22 సంవత్సరాలు సమాజ సేవకు వారి జీవితాలను అంకితం చేసి, నిరాశ్రాయులు, ఆదరణ కావాల్సిన పిల్లలకై మదనపల్లి లోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 100 మంది విద్యార్థులకు విద్య బుద్దులు నేర్పిస్తున్నటువంటి ఎంపీ ఆనందన్ గారికి మరియు రొంపిచర్ల వాస్తవ్యులు బాలకార్మికుల నిర్మూలన కోసం పనిచేస్తు ప్రస్తుతం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నందు అడ్మినిస్ట్రేషన్ కం హెచ్ఆర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ జివీఎస్ బాబు గారికి నేడు తెలుగు వెలుగు సాహితీ వేదికవారు నంది పురస్కారాలతో సత్కరించారు...
ఈ సందర్భంగా వారు ఇరువురికి హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ.........

ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు
05/06/2022

ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు

ఈరోజు మన సంస్థ ను సందర్శించి శ్రీమతి రాణి గారు వారి పిల్లలు దీపికా ఫణింద్ర తో కలిసి మన పిల్లలకు కావలసిన దాదాపు 10 వేల రూ...
25/05/2022

ఈరోజు మన సంస్థ ను సందర్శించి శ్రీమతి రాణి గారు వారి పిల్లలు దీపికా ఫణింద్ర తో కలిసి మన పిల్లలకు కావలసిన దాదాపు 10 వేల రూపాయలు విలువచేసే విద్యా సామగ్రి 🖋️📘🖊️📘🎓✒️📘🖊️📘వితరణ చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దైవం చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమతి రాణి గారికి మరియు వారి పిల్లలకి మన సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు🌹🙏🌹 కృతజ్ఞతలు🙏🙏🙏 తెలియజేస్తున్నది మా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ.💐

13/05/2022
26.4.2022నేడు మన సంస్థ నందు నిరంతర దాతలు శ్రీ మరియు శ్రీమతి డాక్టర్ అలేఖ్య డాక్టర్ వెంకటేష్ గార్ల కుమారుడు చిరంజీవి జయాన...
27/04/2022

26.4.2022
నేడు మన సంస్థ నందు నిరంతర దాతలు శ్రీ మరియు శ్రీమతి డాక్టర్ అలేఖ్య డాక్టర్ వెంకటేష్ గార్ల కుమారుడు చిరంజీవి జయాన్ష్ జన్మదినం సందర్భంగా పిల్లలకు మరియు వృద్ధులకు పోషక విలువలతో కూడిన అన్నదాన విచారణ చేసి వారి సంతోషాన్నిమన సంస్థ నందు పంచుకున్నారు. ఈ సందర్భంగా జయాన్ష్ కి హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ🙏🙏🙏

*నేడు మన సంస్థ నందు ఈ రాత్రి అన్నదాన వితరణ చేసిన వారు శ్రీమతి అండ్ శ్రీ శృతి శ్రీ అరుణ్ కుమార్  శ్రీ అరుణ్ కుమార్ గారి జ...
01/04/2022

*నేడు మన సంస్థ నందు ఈ రాత్రి అన్నదాన వితరణ చేసిన వారు శ్రీమతి అండ్ శ్రీ శృతి శ్రీ అరుణ్ కుమార్ శ్రీ అరుణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క సంతోషాన్ని ఇలా మనతో పంచుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దైవం కావాల్సిన అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలతో పాటు ధన కనక వస్తు వాహన సర్వ సౌభాగ్యాలను సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ.*

విలేఖరి : సార్ మీది ఏ కులం????నేను : ఏ వయస్సు లో...విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???నేను : వుంటుంది! బాల్యంలో...
23/03/2022

విలేఖరి : సార్ మీది ఏ కులం????
నేను : ఏ వయస్సు లో...

విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???
నేను : వుంటుంది!
బాల్యంలో బాలకులం
యవ్వనంలో యువకులం
వృద్ధాప్యంలో పండుటాకులం
రాలిపోయే ఎండుటాకులం

విలేఖరి : అది కాదు మామూలుగా మీది ఏ కులం???
నేను : ఎవరూ లేకుంటే ఏకాకులం
ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం
పెళ్లి అయ్యాక సంసారికులం
కానప్పుడు బ్రహ్మచారికులం

విలేఖరి : అది కాదండీ కమ్మ కాపు ఆలా మీది ఏ కులం
నేను : ధనముంటే దనికులం
లేకుంటే బీదకులం దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం
నమ్మకుంటే నాస్తికులం

విలేఖరి : మీకు ఆసలు కులం లేదా????
నేను : ఎందుకు లేదు
ప్రయాణిస్తే ప్రయాణికులం
యాత్రలు చేస్తే యాత్రికులం
మాయలు చేస్తే మాంత్రికులం
ఉపన్యసిస్తే ఉపన్యాసకులం
హాస్యం పండిస్తే విధూషకులం
పాడితే గాయకులం
సభలో ఉంటే సభికులం
సినిమా హాల్లొ ప్రేక్షకులం
టీవీ ల ముందు వీక్షకులం

విలేఖరి : మీరు ఎక్కడ చదివారు????
నేను : చదివింది గురుకులం
అభ్యసిస్తే అభ్యాసకులం
బోధిస్తే బోధకులం
వృత్తిరీత్యా
అధ్యాపకులం
పత్రికల పాఠకులం
నేర్పించే శిక్షకులం

విలేఖరి : అసలు మీరు ఎవరండీ ఇలా చంపుతున్నారు????
నేను : నాగరికత నేర్పిన నాగరికులం
నాయకులని నమ్మే అమాయకులం
మూఢత్వం పోని మూర్ఖులం

విలేఖరి : అసలు మీ వయస్సు ఎంతండి బాబు????
నేను : కొందరికి పూర్వీకులం
మరికొందరికి సమకాలికులం
ప్రస్తుత వర్తమానికులం

విలేఖరి : అసలు మీది ఏ దేశం???
నేను : భరత జాతి వంశీకులం
భావి భారత రథసారథికులం...

విలేఖరి : మీకు దణ్ణం రా బాబు ఇంకెప్పుడు ఎవరిని మీది ఏ కులం అని మాత్రం అడగను...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Address

14-555, Burma Street
Madanapalle
517325

Alerts

Be the first to know and let us send you an email when Chaitanya orphanage and rehabilitation center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chaitanya orphanage and rehabilitation center:

Share