Helpingspot Organisation

Helpingspot Organisation Helpingspot Organization - Child and women welfare society

We are a group of youngsters who works for eradicating poverty and on the child education.

We are not a great human beings and we are not making a big change in the society but we area trying to make a change in the ideology of human beings. We are a team of youngsters and value added citizens who are fighting against the "killing baby girl & poverty with respect to poor children". The main theme of the community is to save girl child and to feed the poor children. Helpingspot moves wit

h 2 slogans

1.Save Girl..Save World
2.Protect Children From Poor..Protect India From Poverty

We are never blame the system, will never blame the society..We will blame you because you as an individual plays a vital role in either. Dear Youngsters and citizens please join your hands with helpingspot and we all together make a change in the present society by using the youth as a weapon because ours is Young India.

25/02/2026

🌱 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐨𝐫𝐦𝐢𝐧𝐠 𝐜𝐨𝐦𝐦𝐮𝐧𝐢𝐭𝐢𝐞𝐬 𝐰𝐢𝐭𝐡 𝐟𝐨𝐨𝐝 🌱

Weekend Charity - January 18, 2026
𝐴𝑛 𝑖𝑛𝑖𝑡𝑖𝑎𝑡𝑖𝑣𝑒 𝑜𝑓 𝑯𝒆𝒍𝒑𝒊𝒏𝒈 𝑺𝒑𝒐𝒕 𝑶𝒓𝒈

✔ Kothamasu Krishna గారు మరియు satya గారిని గుర్తుచేసుకుంటూ మచిలీపట్నం లో దేవునితోట స్లం లో నివసించే పేద కుటుంబాలకు మా సంస్థ ద్వారా #అన్నదానం 🍚 చేయించడం జరిగింది 🙏🏻

✔ ఈ అన్నదానం ని స్పాన్సర్ చేసిన Janasena NRI Coordinator #సాయిరాజ్ Sai Raj గారికి మా హృదయ పూర్వక #కృతజ్ఞతలు 🙏🏻

ఈ అన్నదాన కార్యక్రమాన్ని దగ్గర ఉండి నిర్వహించిన మా హెల్పింగ్ స్పాట్ #వాలంటీర్లకు 👬మా హృదయ పూర్వక #కృతజ్ఞతలు

𝗕𝗵𝗮𝗿𝗴𝗮𝘃 𝗩𝗲𝗻𝘁𝗿𝗮𝗽𝗿𝗮𝗴𝗮𝗱𝗮
𝐇𝐞𝐥𝐩𝐢𝐧𝐠 𝐒𝐩𝐨𝐭 𝐎𝐫𝐠𝐚𝐧𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧
𝑺𝒖𝒓𝒑𝒍𝒖𝒔 𝒕𝒐 𝒔𝒆𝒓𝒗𝒊𝒄𝒆

అది ఒక సాధారణ ఫోన్ కాల్‌తో మొదలైంది…విజయవాడ నుంచి.అవతల గొంతు వణుకుతోంది.వయసు మీద పడిన ఒక అమ్మమ్మ — పేరు అయ్యమ్మ.“నాకు ము...
15/01/2026

అది ఒక సాధారణ ఫోన్ కాల్‌తో మొదలైంది…
విజయవాడ నుంచి.

అవతల గొంతు వణుకుతోంది.
వయసు మీద పడిన ఒక అమ్మమ్మ — పేరు అయ్యమ్మ.

“నాకు ముగ్గురు కూతుళ్లు బాబు…
ఒక కూతురు భర్తను కోల్పోయింది…
మిగతా ఇద్దరు దేవాలయాల ముందు కొవ్వొత్తులు అమ్ముకుంటున్నారు…”

చిట్టినగర్‌లో నెలకు ₹3000 అద్దె ఇంట్లో జీవితం.
ఇళ్లలో పని చేస్తూ వచ్చిన డబ్బుతో
కుటుంబాన్ని నెట్టుకొస్తున్న జీవితం.

ఆమె ఏదీ పెద్దగా అడగలేదు.
ఒక్క మాటే తప్ప…
“కొంచెం సరుకులు సహాయం చేస్తారా?”

దురదృష్టవశాత్తూ ఆ కాల్ తర్వాత ఆమె నంబర్ మిస్ అయ్యింది.
ఒక నెల తర్వాత మళ్లీ కాల్ వచ్చింది.
అదే గొంతు… అదే వినయం… అదే ఆశ.

ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
డబ్బు పంపడం కాదు…
స్వయంగా నేను వెళ్లి చూడాలి అని.

హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రయాణం.
అవసరమైన సరుకులు నా టీం కి చెప్పి సిద్ధం చేశాను.
చిట్టినగర్‌లో ఆమె ఇంటి ముందుకు చేరుకున్నాం.

మమ్మల్ని చూసిన క్షణం…
ఆ అమ్మమ్మ కళ్లలో కన్నీళ్లు.
ఆ చిరునవ్వులో చెప్పలేని కృతజ్ఞత.

సరుకులు అందుకున్న తర్వాత
ఆమె నన్ను ఆలింగనం చేసుకుంది.
ఏ మాటలూ అవసరం లేకుండా
ఆ ఆలింగనం అన్నీ చెప్పేసింది.

ఆ రోజు నాకు అర్థమైంది👇
👉 సహాయం అంటే సరుకులు మాత్రమే ఇవ్వడం కాదు…
ఎవరో ఒకరి జీవితంలో “నేను ఒంటరిగా లేను” అనే భావన ఇవ్వడం.

దేవుడికి చాలా థాంక్స్ 🙏
ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు.

అయ్యమ్మ చిరునవ్వే —
మా సేవకు ప్రేరణ.

Thank you Charan Avin Avi Sam Pawan Samson for supporting the cause

🌟 మనుషుల మధ్య మంచితనం ఇంకా ఉందని గుర్తు చేసే చిన్న సంఘటన… 🌟నిన్న మా వాలంటీర్ ఒకళ్ళు కాల్ చేశారు.“భార్గవ్ గారు, మా స్కూల్...
19/11/2025

🌟 మనుషుల మధ్య మంచితనం ఇంకా ఉందని గుర్తు చేసే చిన్న సంఘటన… 🌟

నిన్న మా వాలంటీర్ ఒకళ్ళు కాల్ చేశారు.
“భార్గవ్ గారు, మా స్కూల్ స్నేహితురాలికి చాలా కష్టాలు వచ్చాయి. ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతుంటే, అనుకోకుండా ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇల్లు నెట్టుకుపోవడమే పెద్ద సమస్యగా మారింది… పిల్లల చదువులు ఇంకా భారంగా మారాయి. ఒక బిడ్డ స్కూల్ ఫీజు బాధ్యత తీసుకోగలరా?” అని అడిగింది.

ఆమె మాటల్లో ఉన్న ఆవేదన, పిల్లల భవిష్యత్తు మీదున్న ఆందోళన నాకు వెంటనే అర్థమైంది.
అక్కడే నిర్ణయం తీసుకున్నాను — చాణక్య జోస్ అనే ఆ చిన్నారి ఈ సంవత్సరం విద్యా బాధ్యతను తీసుకుందాం అని.

🙏 నాకు మంచి స్నేహితుడు నా చెడ్డీ దోస్త్ డాక్టర్ మైకెల్ మనోజ్ కి ప్రత్యేక ధన్యవాదాలు.
కాల్ చేసిన వెంటనే స్పందించి, మచిలీపట్నం నాగార్జున పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న చాణక్య ఫీజును వెంటనే అందించారు.

జీవితం ఎంత కఠినమైనదైనా…
మనుషుల మధ్య ప్రేమ, అండ, సహాయం… ఇవే నిజమైన బలం.

మన చిన్న సహాయం ఎవరికో పెద్ద భవిష్యత్తు అవుతుంది.
ఇలాంటి మంచి పనుల్లో భాగస్వాములుగా నిలుస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️✨

Address

Machilipatnam
521001

Telephone

+918886686000

Website

Alerts

Be the first to know and let us send you an email when Helpingspot Organisation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share