Mythri Foundation

Mythri Foundation Alone we can do so little,
together we can do so much....
join in Mythri Foundation and Help Poor..
(1)

18/05/2025
13/05/2025

ఈరోజు 13.05.2025 మంగళవారం నాడు బందరు కొబ్బరితోట వాస్తవ్యులు మరియు మన గ్రూపు సభ్యులు చలమలశెట్టి శిరీష గారి తల్లి గారైన *కీర్తిశేషులు బర్మా నాగమస్తానమ్మ గారి 4 వ వర్ధంతి సందర్భంగా* మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో *ఈరోజు మధ్యాహ్నం 12.00 hrs కు సుకర్ణాబాదులో గల చేయూత వృద్ధాశ్రమం నందు* వృద్ధులకు మరియు పిల్లల మధ్యలో *అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది.*

ఈ సందర్భంగా కీ.శే నాగ మస్తానమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మైత్రీ ఫౌండేషన్ తరపున భగవంతుడిని ప్రార్థిస్తూ ఘన నివాళులు అర్పించినారు.

ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు విజయ గారు కీ.శే నాగ మస్తానమ్మ గారి కుటుంబ సభ్యులకు మరియు మైత్రి ఫౌండేషన్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినారు.

ఈవెంట్ నెంబర్:611
తేది:11.05.2025

13/05/2025

మైత్రీ ఫౌండేషన్ గౌరవ సభ్యులు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సమయం పణి కుమార్ గారి తండ్రి కీర్తిశేషులు సమయం సాయి ప్రసాద్ గారి జయంతి సందర్భంగా వీరి జ్ఞాపకార్థం మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరి ఆర్థిక సహకారముతో ఈరోజు 12.05.2025 సోమవారం నాడు స్థానిక మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్, షిరిడి సాయిబాబా గుడి దగ్గర దగ్గర ఉదయం 11 గంటలకు మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో "ఉచిత మజ్జిగ పంపిణీ"కార్యక్రమం నిర్వహించబడినది.

ఈ సందర్భంగా మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ తరపున సమయం సాయి ప్రసాద్ ఆత్మ సద్గతిని పొందాలని భగవంతుడు ప్రార్ధిస్తూ ఘన నివాళులు అర్పించిన పిదప 700 మంది సాయి భక్తులకు,బాటసారులకు, ఆటో డ్రైవర్లకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈవెంట్ నెంబర్:610
తేది:12.05.2025

13/05/2025

అందరికీ నమస్కారం!
ఈరోజు 11.05.2025 ఆదివారం నాడు మల్లపరాజు గూడెం వాస్తవ్యులు కిక్కిశెట్టి షణ్ముఖ సాయి నరేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా వారి శ్రీమతి మాధవి గారి సహకారంతో మైత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12.00 కు చిలకలపూడి వాసవీ వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది.

ఈ సందర్భంగా కిక్కిశెట్టి షణ్ముఖ సాయి నరేష్ గారికి మైత్రీ ఫౌండేషన్ తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది.

ఈ సందర్భంగా శ్రీ వాసవి వృద్ధాశ్రమ నిర్వాహకులు షణ్ముఖ సాయి నరేష్ గారి కుటుంబ సభ్యులకు మరియు మైత్రీ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసినారు.

ఈవెంట్ నెంబర్:609
తేది:11.05.2025

ఈరోజు 09.05.2025 శుక్రవారం నాడు మన ఫౌండేషన్ గౌరవ సభ్యులు శ్రీకాసాని రవి గారి  కుమారుడు "చిరంజీవి హరి వేదాన్ష్  " తృతీయ జ...
09/05/2025

ఈరోజు 09.05.2025 శుక్రవారం నాడు మన ఫౌండేషన్ గౌరవ సభ్యులు శ్రీకాసాని రవి గారి కుమారుడు "చిరంజీవి హరి వేదాన్ష్ " తృతీయ జన్మదిన" సందర్భంగా వీరి ఆర్థిక సహకారంతో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు వీధి వెంబడి నివసించే నిరాశ్రయులైన పేదవారికి ఆహార పొట్లాల వితరణ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ సందర్భంగా చిరంజీవి కాసాని హరి వేదాన్ష్ కు మైత్రి ఫౌండేషన్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ , తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము .
ఈవెంట్ నెంబర్:608
తేది:09.05.2025

07/05/2025

ఈరోజు 05.05.2025 సోమవారం నాడు సాయంత్రం 06:30 గంటలకు మచిలీపట్నం ,హౌసింగ్ బోర్డ్ కాలనీ-1 వాస్తవ్యులు విశ్వనాథపల్లి సూర్యప్రకాష్ రావు గారి భార్య విశ్వనాథపల్లి జానకి దేవి గారి చతుర్ధ వర్ధంతి సందర్భంగా వీరి కుమారులు రాజశేఖర్,శ్యామ్ శేఖర్ మరియు కూతురు ప్రత్యుషా గార్ల ఆర్థిక సహకారంతో ఈడేపల్లి జెట్టి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది.

ఈ సందర్భంగా మైత్రి ఫౌండేషన్ తరపున, కీర్తిశేషులు విశ్వనాథపల్లి జానకి దేవి గారి ఆత్మ సద్గతిని పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఘన నివాళులు అర్పించిన పిదప అన్నదాన కార్యక్రమం వీరి పిల్లలు వృద్దులకు స్వహస్థాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు.

ఈవెంట్ నెంబర్:607
తేది:05.05.2025

మచిలీపట్నం లో త్వరలో జరగబోవు బీచ్ ఫెస్టివల్  ను విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందించాలని పట్టణంలోని వివిధ స్వచ్ఛంద స...
04/05/2025

మచిలీపట్నం లో త్వరలో జరగబోవు బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందించాలని పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం అయిన గౌరవ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు...
మైత్రీ ఫౌండేషన్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు కలిసి రానున్న 10 రోజుల్లో వివిధ రకాల కార్యక్రమాల ద్వారా బీచ్ ఫెస్టివల్ ప్రమోషన్ నిర్వహించనున్నట్లు అధ్యక్షులు కేసాని వేణు కుమార్ గారు తెలిపారు.

మైత్రి ఫౌండేషన్ ద్వారా రక్తదానంచల్లపల్లి గ్రామానికి చెందిన ప్రెగ్నెంట్ ( గర్భిణీ ) మహిళ  పేరు రవలశ్రీ గారికి అర్జెంటుగా ...
04/05/2025

మైత్రి ఫౌండేషన్ ద్వారా రక్తదానం
చల్లపల్లి గ్రామానికి చెందిన ప్రెగ్నెంట్ ( గర్భిణీ ) మహిళ పేరు రవలశ్రీ గారికి అర్జెంటుగా రక్తం అవసరం అని డాక్టర్లు తెలుపగా వారు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాతల కోసం ఎదురు చూస్తున్నారని సోషల్ మీడియా ద్వారా విషయం తెలిసికొన్న మైత్రి ఫౌండేషన్ సభ్యుడు మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగి Golla Adiseshu SOFTWARE Engineer ( Hcl Tech ) గోళ్ళ ఆదిశేషు గారు వెంటనే స్పందించి సకాలంలో గర్భిణీ స్త్రీకు రక్తదానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పేషంట్ తరపు బంధువులు మైత్రి ఫౌండేషన్ కు మరియు రక్తదాత ఆదిశేషు గారికి కృతజ్ఞతలు తెలియపరిచారు.

Event NO :: 606
Dt :: 04.05.2025

03/05/2025
03/05/2025

ఈరోజు 03.05.2025 శనివారంనాడు మన ఫౌండేషన్ గౌరవ సభ్యురాలు శ్రీమతి జి భవాని దేవి గారి స్నేహితులు పెడన వాస్తవ్యులు"శ్రీమట్టా శివ గారి " జన్మదిన సందర్భంగా వీరి ఆర్థిక సహకారంతో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు వీధి వెంబడి నివసించే నిరాశ్రయులైన పేదవారికి "ఆహార పొట్లాల వితరణ "కార్యక్రమం నిర్వహించబడినది ఈ సందర్భంగా శ్రీ మట్టా శివ గారికి మైత్రి ఫౌండేషన్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు కుంటున్నాము.

ఈవెంట్ నెంబర్:605
తేది:03.05.2025

Address

Main Road Machilipatnam
Machilipatnam
521001

Alerts

Be the first to know and let us send you an email when Mythri Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mythri Foundation:

Share