15/08/2026
*ఎట్టకేలకు 8సంవత్సరాల కృషి ఫలించింది 🤲🏻*
*అధికారికంగా 700సంవత్సరాల చరిత్రకలిగిన కొండవీడు కోట జుమ్మ మసీదు పునర్నిర్మాణ పనులు ప్రారంభం*
*గుంటూరుకు చెందిన Know Our History సంస్థ & సంస్థ అధ్యక్షులు సూఫీ ఇమ్రాన్ వారి ఎనలేని 8సంవత్సరాల (2018 - 2026) కృషి ఫలితంగా 14న ఆగస్టు 2026, శుక్రవారం జుమ్మ నమాజు సమయాన 700సంవత్సరాల చారిత్రాత్మక కొండవీడు కోట జుమ్మ మసీదు పునరుద్ధరణ పనులను స్థానిక ఎమ్మెల్యే గౌ. శ్రీ. ప్రత్తిపాటి పుల్లారావు గారు ఎంతో వైభవంగా ప్రారంభించారు*
*దాదాపు 50లక్షల రూపాయలతో ఎంతో అద్భుతంగా.. బహమనీ సుల్తానులు, ఖుతుబ్ షాహీ సుల్తానుల కాలంనాటి అత్యంత సుందరమైన మసీదుగా కొండవీడు కోట జుమ్మ మసీదు రూపుదిద్దుకోబోతున్నట్లు సూఫీ ఇమ్రాన్ తెలిపారు*
*ఈ కార్యక్రమంలో డెక్కన్ టెర్రైన్ కంపెని సీఈవో మీర్ ఖాన్, జలీల్ ఖాన్, అబ్దుల్ ఘనీ, కొండవీడు అజ్హరుద్దీన్, హిందుస్తాన్ కౌసర్ బాషా, అక్బర్ బాషా, బ్రైట్ హారిజన్స్ మొహియుద్దీన్, షోయబ్, సిరాజ్, జ్యోతి బాబు, కొమ్మెరపుడి అల్లబక్షు, సలీమా, గౌస్, అబ్దుల్ కలాం వాకర్స్ సభ్యులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*