06/09/2026
అయ్యవారి పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 86 సంవత్సరాల మారెళ్ళ లక్ష్మమ్మ గారి పూరి గుడిసె పది రోజుల క్రితం నిప్పురవ్వలు పడి కాలిపోయింది. ఈ కుటుంబ సభ్యుల కోసం రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోలేపల్లె సుబ్బ రంగయ్య గారు, శ్రీమతి లక్ష్మీ రాజ్యం గార్ల ఆర్థిక సహాయం తో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రసిడెంట్ శ్రీ రంగ జనార్ధన గారు, జర్షిత , రక్షిత మరియు ఇరుగు పొరుగు వారు పాల్గొన్నారు.