07/08/2026
మంగళం పల్లి గ్రామంలో ఘనంగా ఎన్డీఏ కూటమి ‘ఇంటింటికీ సంక్షేమం’ కార్యక్రమం
ముఖ్య అతిథులుగా హాజరైన యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు
*కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ డోర్-టు-డోర్ ప్రచారం*
తిరుపతి జిల్లా ఓబులువారిపల్లి మండలం మంగళం పల్లి మరియు హరిజనవాడ గ్రామంలో నేడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ (ఇంటింటి ప్రచారం) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్, కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*, హాజరయ్యారు.
*గ్రామ పంచాయతీకి విచ్చేసిన ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనస్వాగతం పలికారు*.
ఈ సందర్భంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి , కూటమి నాయకులతో కలసి గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి గడిచిన రెండేళ్ల కాలంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించిన ‘తల్లికి వందనం’ పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి, లబ్ధిదారులకు ఎంతో మేలు చేకూరిందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కాలనేదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తల పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.