VIHE Khammam

VIHE Khammam VIHE Khammam is established on 09-12-2012. Our Motto:Institutionalize and empower the Individuals

వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- ఖమ్మం ( VIHE Khammam   ) ఆధ్వర్యంలోMJPTBCWRDC (మహాత్మ జ్యోతిబాపూలే తె...
13/08/2025

వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- ఖమ్మం ( VIHE Khammam ) ఆధ్వర్యంలో
MJPTBCWRDC (మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీ ఖమ్మం) విద్యార్థినులకు.. Tally with GST ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులను సందర్శించిన VIHE వ్యవస్థాపకులు Vasudeva Rao Devaki దేవకి వాసుదేవ రావు..

13/08/2025

Tally With GST Student feedback..

Today news paper clip's...
24/07/2025

Today news paper clip's...

వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- ఖమ్మం ( VIHE ) ఆధ్వర్యంలోMJPTBCWRDC (మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యా...
23/07/2025

వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- ఖమ్మం ( VIHE ) ఆధ్వర్యంలో
MJPTBCWRDC (మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీ) విద్యార్థినులకు.. Tally with GST ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమంను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం VIHE వ్యవస్థాపకులు Vasudeva Rao Devaki

09/12/2024

VIHE 12వ వార్షికోత్సవం

వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ (VIHE) 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2012 డిసెంబర్ 9న స్థాపన జరిగినప్పటి నుండి మేము సాగించిన సేవా, సాధికారత ప్రయాణం ఎంతో ఆనందంగా వుంది. స్వామి వివేకానంద గారి అమూల్యమైన ఉపదేశాల నుండి ప్రేరణ పొందిన మా సంస్థ, కుల, మత, జాతి అడ్డంకులను అధిగమిస్తూ యువత సాధికారతకు మరియు మానవ సేవకు అంకితమై ఉంది.

గత 12 సంవత్సరాలలో, ఖమ్మం జిల్లాలో 15,000 మంది పురుషులు మరియు మహిళలకు శిక్షణ ఇవ్వడం, 50,000 మందికి పైగా యువతను చేరడం గౌరవంగా కలిగింది. యువతకు విలువలు, నైపుణ్యాలు, మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రయత్నాల్లో మేము నిమగ్నమయ్యాము, తద్వారా వారు ప్రకాశవంతమైన భవిష్యత్తును రూపొందించగలిగే స్థితిలో ఉంటారు. అదనంగా, COVID-19 మహమ్మారి మరియు ఇటీవల ఖమ్మం వరదల వంటి సవాలుతో కూడిన సమయంలో, మేము సమాజంతో నిలబడి సహాయం మరియు ఉపశమనాన్ని అందించాము.

ఈ అసాధారణమైన ప్రయాణం మా దాతలు, కార్పొరేట్ భాగస్వాములు, మరియు మా నిబద్ధత గల స్వచ్ఛంద సేవకుల సహాయం లేకుండా సాధ్యమయ్యేది కాదు. మీ దాతృత్వం, కృషి, మరియు మా మిషన్ మీద ఉన్న నమ్మకం మా విజయాన్ని నిర్మించడంలో కీలకమైనవి. గురుదక్షిణ క్యాంపస్‌లో ఆందోళన లేకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రాంగణం అందించిన, మా మీద విశ్వాసం చూపించిన అతి దయాళువైన చెకురి కాశయ్య గారికి మా మనసులో ఎనలేని గౌరవం. ప్రస్తుతం, ఖమ్మంలో మూడు ప్రాంగణాల నుంచి మేము సేవలను అందిస్తూ, మా వ్యాప్తిని మరియు ప్రభావాన్ని విస్తరించుకుంటున్నాము.

మా ప్రియమైన బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీ అంకితభావం మరియు నమ్మకం గత 12 సంవత్సరాలలో మా విజయానికి మూలస్తంభంగా నిలిచింది. మీ కృషి మరియు తపన మా కలలని సాకారం చేయడానికి మార్గం సుగమం చేసింది. మా ప్రాంగణానికి సందర్శించిన ప్రముఖ వ్యక్తులు మరియు ప్రేరణాత్మక నేతలందరికి మా కృతజ్ఞతలు. వారి ప్రేరణ మా ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది.

చివరగా, మన పథానికి దారితీసిన మా గురువుగారు మరియు మార్గదర్శకులు స్వామి శితికంఠానంద గారి పాదాల వద్ద మేము గౌరవంతో మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాము. వారి ఆశీర్వాదాలు మరియు జ్ఞానం మాకు నిత్యం వెలుగుగా నిలిచాయి.

స్వామి వివేకానంద గారి ఆత్మీయ సిద్ధాంతాలకు ప్రేరణగా, మనం ఈ ప్రయాణాన్ని కొనసాగించుకుందాం. ఈ మిషన్‌లో భాగస్వామిగా మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

🙏
దేవకి వాసుదేవ రావు
సంస్థాపకులు - VIHE Khammam

**VIHE  &అభయ ఫౌండేషన్* వారి ఆధ్వర్యంలో  నిరుద్యోగలకు అద్భుతమైన అవకాశం!   **ఉచిత డ్రైవింగ్ శిక్షణ**ఆదివారం 07-12- 2024 ను...
05/12/2024

**VIHE &అభయ ఫౌండేషన్* వారి ఆధ్వర్యంలో నిరుద్యోగలకు అద్భుతమైన అవకాశం!

**ఉచిత డ్రైవింగ్ శిక్షణ**

ఆదివారం 07-12- 2024 నుండి తరగతులు ప్రారంభమవుతాయి..

ఉచిత డ్రైవింగ్ శిక్షణ కొరకు విద్యార్థులకు నియమ నిబంధనలు

1. వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు కలిగి ఉండాలి

2. ప్రతి విద్యార్థి లెర్నింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండవలెను

3. విద్యార్హత : 10 / ITI / డిప్లొమా /డిగ్రీ ఫెయిల్ అయ్యి పని చేయని వారై ఉండాలి. (*డిగ్రీ మరియు ఆపై చదువులు చదివే, చదువుతున్న వారు అనర్హులు).

4. హాజరు: శిక్షణ కాలంలో ప్రతి రోజు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలి.

5. సమయపాలన: సమయపాలన కచ్చితంగా పాటించాలి.

6. VIHE టీ-షర్ట్: ప్రతి విద్యార్థి VIHE టీ-షర్ట్‌ను తప్పనిసరిగా ధరించాలి.( మొదటి టీ షర్టు ఉచితం ) అదనపు టీ-షర్ట్ కోసం రూ. 100/- చెల్లించాలి.

7. డిపాజిట్: ఉచిత శిక్షణ కోర్సులో ఎంపికైన విద్యార్థులు రూ. 500/- డిపాజిట్ చెల్లించాలి.

8. సత్ప్రవర్తన: సత్ప్రవర్తన తప్పనిసరి. లేకపోతే అడ్మిషన్ రద్దు చేయబడుతుంది.

9. సర్టిఫికెట్: శిక్షణ పూర్తయ్యిన తర్వాత సర్టిఫికెట్ పొందడానికి ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి.

10. డిపాజిట్ తిరిగి చెల్లింపు: పై నిబంధనలు పాటించిన వారికే డిపాజిట్ తిరిగి చెల్లించబడుతుంది.

వేదిక: కరుణ గిరి, సాయి బాబా గుడి పక్కన, గురుదక్షిణ ఫౌండేషన్ క్యాంపస్ పోలేపల్లి , ఖమ్మం.

ఈ కోర్స్ నేర్చుకోవాలంటే ఈ క్రింది లింక్ లో మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి..

https://surveyheart.com/form/674e9414c613a23671a1e050

మరిన్ని వివరాలకు

9639345999
7891345999
8466056999

09/11/2024
04/11/2024

*ఖమ్మం మున్నేరు వరద బాధితులకు స్లీపింగ్ కిట్స్ పంపిణీ కార్యక్రమం *

03-11-2024 ఆదివారం రోజున ఖమ్మం రామకృష్ణా విద్యాలయంలో మున్నేరు వరద బాధితులకు అభయ ఫౌండేషన్, VIHE & దేవకి ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో VIHE వ్యవస్థాపకులు, దేవకి వాసుదేవరావు గారి చేతుల మీదుగా స్లీపింగ్ కిట్లను(6×6 ఫ్లోర్ మ్యాట్, రెండు దిండ్లు మరియు కవర్లు, ఒక్క దుప్పటి ) పంపిణీ చేశారు. సుమారు వెయ్యి మందికి ఒక్కోదానికి వెయ్యి రూపాయలు విలువచేసే స్లీపింగ్ కిట్లను మరియు గతంలోనూ మున్నేరు వరద బాధితులకు బియ్యం, నిత్యవసర, స్టీల్ సామాగ్రిని రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి పూర్తి సహకారంతో పంపిణీ చేశారు. ఇప్పటివరకు మున్నేరు వరద బాధితులకు సుమారు 70 లక్షలు విలువ గల నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు దేవకీ వాసుదేవరావు గారు అన్నారు. గతమెన్నడు లేని విధంగా ఖమ్మం నగరానికి వరదలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఎంతైనా ఉందని, ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద అవసరానికి మించిన ఎత్తుతో చెక్ డ్యాం ఏర్పాటు కారణంగానే వరదలు సంభవించాయనీ అన్నారు.
అదేవిధంగా దాతల సహకారంతో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో మా వంతుగా వరద బాధితులకు సహాయం అందించడం జరిగింది..
మానవసేవే మాధవసేవ అన్నారు పెద్దలు సాటివారు ఆపదలో ఉంటే ఆదుకోవాలని ఆలోచనతో సంస్థ ద్వారా దాతల సహాయంతో వరద బాధితులకు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉంది..కష్టకాలంలో ఉన్న వారందరికీ మా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉండి తోచిన సహాయం అందిస్తుంది..అదేవిధంగా గ్రామీణ నిరుపేద యువతకు తోడుగా వారి బతుకులు వెలుగులు నింపడం కోసం మా సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది గ్రామీణ నిరుపేద యువత తమకు తాను సొంతంగా ఉపాధి కల్పించుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా తయారుచేసి మానవతా విలువలను పెంపొందించి సాటి మనిషికి సహాయపడే గుణాన్ని అందించి మంచి సమాజాన్ని నిర్మించడం అనేది ఈ సంస్థ యొక్క ఉద్దేశం అన్నారు..ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు గారు, VIHE సెక్రటరీ చంద్రశేఖర్ గారు,VIHE బాధ్యులు జయంత్ పటేల్ గారు, కేశవ్ లాల్ పటేల్ గారు,రామిరెడ్డి, దుర్గ రామ్, స్నేహలత, మరియు వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు...

శ్రీ శ్రీ శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామిజీ 69వ తిరునక్షత్ర తీర్థగోష్టి సాకేత దివ్య క్షేత్రంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృ...
01/11/2024

శ్రీ శ్రీ శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామిజీ 69వ తిరునక్షత్ర తీర్థగోష్టి సాకేత దివ్య క్షేత్రంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతం

30/10/2024

*వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ (VIHE) ద్వారా ప్రయోజకుడైన లక్ష్మీ చందర్...*
___________________________
👉2012-13 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ సంస్థ ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల గురించి ఈనాడు దినపత్రికలో చూసి ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యాను.

👉గ్రామీణ నిరుపేద విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ మరియు మోటివేషన్ క్లాసెస్ ద్వారా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దేవకి వాసుదేవరావు గారు ఈ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు అనేక మంది యువత జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయి.

👉2012 నుండి 2016 వరకు నేను ఈ సంస్థ ఏర్పాటు చేసిన వివిధ శిక్షణ తరగతులకు హాజరయ్యాను. ఈ తరగతుల్లో నేర్చుకున్న స్కిల్ డెవలప్మెంట్ మరియు మోటివేషన్ స్కిల్స్ నా జీవితంలో విశేషమైన ప్రభావం చూపాయి.

👉ప్రస్తుతం నేను ముంబాయిలో ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాను. వెనుక చూసుకుంటే, ఆ మోటివేషన్ తరగతులు నాకు ఏదైనా సాధించాలనే సంకల్పాన్ని కలిగించాయి, దానివల్లనే నేను ఈ స్థాయికి ఎదిగాను.

👉దేవకి వాసుదేవరావు గారు గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన ఈ సంస్థ నా లాంటి అనేక మంది యువతకి మోటివేషన్ మరియు ప్రేరణను అందించింది.

Address

2nd Floor, Bhadradri Bank Complex, Nehru Nagar
Khammam
507002

Alerts

Be the first to know and let us send you an email when VIHE Khammam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to VIHE Khammam:

Share