Bahujana Abhyuda Seva Samiti-BASS

Bahujana Abhyuda Seva Samiti-BASS Anandam Aduri

28/09/2025
ది :21 సెప్టెంబర్ 2025 న గన్నవరం గ్రామంలో ప్రారంభమైన డే కేర్ సెంటర్ ఈ రోజు వరకు విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతిరోజూ సాయంత...
27/09/2025

ది :21 సెప్టెంబర్ 2025 న గన్నవరం గ్రామంలో ప్రారంభమైన డే కేర్ సెంటర్ ఈ రోజు వరకు విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 50 మంది పిల్లలకు స్నాక్స్ అందించడం జరుగుతుంది. ఎవరైనా పుట్టినరోజు జరుపుకునే వారు ఈ స్నాక్స్ ను అందించి సహాయ పడవచ్చు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆర్థికంగా తోడ్పాటు అందించి సహాయ పడగలరని కోరుచున్నాము

డే *కేర్ సెంటర్ ని ప్రారంభించిన ఎస్ ఐ.పుష్పాల రామారావు*-------------------------------------------- వైరా : వైరా మండలం, గ...
21/09/2025

డే *కేర్ సెంటర్ ని ప్రారంభించిన ఎస్ ఐ.పుష్పాల రామారావు*
--------------------------------------------

వైరా : వైరా మండలం, గన్నవరం గ్రామంలో బహుజన అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్ ను వైరా ఎస్ ఐ.పుష్పాల రామారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ బహుజన అభ్యుదయ సేవా సమితి ద్వారా ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత మీ పిల్లలను సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించే ఈ స్టడీ సెంటర్కి పంపించే భాద్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, డే కేర్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసిన సంస్థ నిర్వాహకులు ఆదూరి మణి, ఆనందం దంపతులను ఆయన అభినందించారు.
ఈ సందర్బంగా బహుజన అభ్యుదయ సేవా సమితి వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం, మణి మాట్లాడుతూ గన్నవరం గ్రామంలో ఉన్న పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఇచ్చిన హోమ్ వర్క్ ను ఈ డే కేర్ సెంటర్ లో చేయించడం జరుగుతుందని. అందుకోసం గ్రామంలో డిగ్రీ చదివిన టీచర్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా సాయంత్రం సమయంలో పిల్లలకు పౌష్టిక ఆహారం ఉచితంగా అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు పనికి వెళ్ళి సాయంత్రం 6,7 గంటలకు ఇంటికి చేరుకోవడం వలన పిల్లలు బయట రోడ్లపై తల్లిదండ్రులు వచ్చేవరకు తిరుగుచున్న వారు ఈ డే కేర్ సెంటర్ లో మా సంరక్షణలో ఉంటారని వారు తెలిపారు. అందుకొరకు ఇద్దరు టీచర్ లను, ఒక ఆయా ను, నియమించడం జరిగిందని అన్నారు. ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు కోరారు.
అనంతరం ఎస్ ఐ రామారావు ని నిర్వాహకులు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కారుమంచి ప్రమీల, కారుమంచి రాధ, కారుమంచి లేయమ్మ, ఆదూరి ముత్తమ్మ పాల్గొన్నారు.

20/09/2025
*సైబర్ నేరగాళ్ళ వలలో పడకండి.*  *----- హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం* తల్లాడ : తల్లాడ మండల కేంద్రంలో గల...
03/09/2025

*సైబర్ నేరగాళ్ళ వలలో పడకండి.*

*----- హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం*

తల్లాడ : తల్లాడ మండల కేంద్రంలో గల ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ కొర్రపాటి ప్రత్యూష అధ్యక్షతన ఆశా కార్యకర్తలకు బహుజన అభ్యుదయ సేవా సమితి అనుబంధ సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో మానవ హక్కులు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ మహిళా చట్టాలు, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు,లీగల్ మెట్రాలజీ యాక్ట్, వినియోగదారుల హక్కు చట్టాలను గూర్చి వివరించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వ్యక్తిగత ఫోటోలను షేర్ చేయవద్దని, డీపీ ఫోటోలని మార్చుకోవాలని కోరారు. ఆన్లైన్ లో మోసపోయామని తెలిసిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలని చెప్పారు. అనంతరం నేషనల్ ప్రెసిడెంట్, లీగల్ అడ్వైజర్ ఇనపనూరి మహేంద్రనాధ్ మాట్లాడుతూ మహిళలను సాయంత్రం 6 గంటల తర్వాత గానీ, ఉదయం 6 గంటల లోపు గానీ పోలీసులు అరెస్ట్ చేయకూడదని, విచారణ నిమిత్తం మహిళలను స్టేషన్ కు పిలువకూడని చట్టం చెబుతుంది. కావున చట్టాలను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ నేషనల్ మహిళా వింగ్ అధ్యక్షురాలు ఆదూరి మణి, నేషనల్ జనరల్ సెక్రటరీ చిల్లిముంత వెంకటేశ్వరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగుల వెంకటేశ్వరావు, రాష్ట్ర కన్వీనర్ కువ్వారపు విజయరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ గంజాయి కుమారి, సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జి పల్లెపాము డానియల్ తల్లాడ మండల అధ్యక్షులు ఆదూరి బాబురావులు పాల్గొన్నారు మాట్లాడారు.
ఈ సందర్బంగా హాస్పిటల్ వైద్యులు కె. ప్రత్యూష హ్యూమన్ రైట్స్ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు అనంతరం హ్యూమన్ రైట్స్ సొసైటీ లో పనిచేస్తున్నవారికి సంస్థ ఐడి కార్డులను ఆమె ద్వారా అందజేశారు.

*లక్ష్య సాధనకు విద్యే ఆయుధం :*  *------- హ్యూమన్ రైట్స్ సొసైటీ* కల్లూరు :కల్లూరు పట్టణంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత ...
09/08/2025

*లక్ష్య సాధనకు విద్యే ఆయుధం :*

*------- హ్యూమన్ రైట్స్ సొసైటీ*

కల్లూరు :కల్లూరు పట్టణంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు అనుబంధ సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ నేషనల్ మహిళా అధ్యక్షురాలు ఆదూరి మణి అధ్యక్షతన మానవ హక్కులు- చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది.
ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ మానవ హక్కులలో పొందుపర్చిన ఆర్టికల్ 26 ప్రకారం విద్యా హక్కు చట్టం -2009 వచ్చిందని, ఈ చట్టం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్భంద విద్య అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సకల సదుపాయాలను కల్పిస్తుందని, ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ లక్ష్య సాధనకు విద్యను ఆయుధం గా మలచుకోవాలని విద్యార్థులకు సూచించారు. లక్ష్యాలను సాధించే క్రమంలో చెడు అలవాట్లను వదిలివేసి, మంచి అలవాట్లను అలవార్చుకోవాలని కోరారు. చదువుపై ప్రభావం చూపే సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.
ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ జాతీయ అధ్యక్షులు, లీగల్ అడ్వైజర్ ఐ. మహేంద్రనాధ్ మాట్లాడుతూ బాల కార్మిక చట్టం గూర్చి తెలియజేస్తూ 18 సంవత్సరాల లోపు పిల్లలంతా బడిలోనే ఉండాలని, పనిలో ఉండకూడదని అన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిల్లిముంత వెంకటేశ్వరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిలూరి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగుల వెంకటేశ్వరావులు బాలల హక్కులు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మొదలగు వాటిపై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జి పల్లెపాము డేనియల్, హై స్కూల్ ఉపాధ్యాయులు వసంత, అనిత, సత్యం, ఆఫ్జాల్ జాన్, సావిత్రి, అనిత, తులసి, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
*బత్తులపల్లి హై స్కూల్ లో* *హ్యూమన్ రైట్స్ సొసైటీ సదస్సు*
సాయంత్రం 3 గంటలకు బత్తులపల్లి హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు బాలల హక్కులు - చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్ యన్. మధు మరియు స్టాఫ్ పాల్గొన్నారు.

ఈ రోజు ఎర్రుపాలెం మండల కేంద్రంలో కరుణ వృద్ధాశ్రమంలో మధ్యాహ్న భోజనంను వృద్దులకు అందించి అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ...
29/07/2025

ఈ రోజు ఎర్రుపాలెం మండల కేంద్రంలో కరుణ వృద్ధాశ్రమంలో మధ్యాహ్న భోజనంను వృద్దులకు అందించి అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో SI రమేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.
సాయంత్రం 3:30 నిమిషాల నుండి 4:40 నిమిషాల వరకు TSWRS పాఠశాల & కళాశాల విద్యార్థులకు బాలల హక్కులు, విద్యాహక్కు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం, నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోట వెంకట్ గారు, రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ కన్నెపోగు వెంకటేశ్వర్లు (కె.వి.ఆర్) గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగుల వెంకటేశ్వరావు గారు, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు కోట అంజయ్య గారు, తల్లాడ మండల అధ్యక్షులు ఆదూరి బాబురావు గార్లు పాల్గొన్నారు.

Address

Rajashakar Nagar
Khammam

Telephone

+919989438890

Website

Alerts

Be the first to know and let us send you an email when Bahujana Abhyuda Seva Samiti-BASS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bahujana Abhyuda Seva Samiti-BASS:

Share